బిహార్‌లో భాగల్‌పూర్‌లో రూ. 1700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తీగల వంతెన ఆదివారం పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ మేరకు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..గతేడాది ఏప్రిల్ 30న ఈ వంతెన కొంతభాగం కూలిపోయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత దీని నిర్మాణ విషయంపై అధ్యయనం చేయడం కోసం ఐఐటీ రూర్కీ నిపుణలను సంప్రదించాం.
ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది. అధ్యయనం చేసిన నిపుణుల ఈ నిర్మాణంలో కొద్దిపాటి లోపాలున్నాయని మాకు తెలియజేశారు. అందుకు సంబంధించిన వాటినన్నింటిని తొలగించాం. అయనప్పటికీ ఆదివారం జరిగిన ఘటన తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోందని తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులైన అధికారులపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వంతెన దగ్గర పనిచేస్తున సెక్యూరిటీ గార్డు కూడా ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయినట్లు తెలిపారు. రెస్క్యూ అధికారులు అతని ఆచకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్రిడ్జి కూలిన తర్వాత నుంచి గార్డు కనిపించ లేదని, అతడి మృతదేహం కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అతడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి డిమాండ్ చేశారు. ఆయన పాలనలో జరుగతున్న అవినీతి కారణంగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందని ఆరోపణలు చేశారు. మరో సహచర బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ కూడా ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
(చదవండి: బిహార్‌లో కూలిన తీగల వంతెన)
Comments
Please login to add a commentAdd a comment