
పాట్నా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.
కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు. తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment