లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి నమ్మకమే పార్టీ కొంప ముంచిందన్నారు. లక్నోలో ఆదివారం(జులై 14) జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో యోగి మాట్లాడారు.
‘ఎన్నికల్లో కొన్ని ఓట్లు, సీట్లు కోల్పోయాం.దీంతో గతంలో మన చేతిలో ఓడిపోయిన ప్రతిపక్షం ఎగిరెగిరి పడుతోంది. అంత మాత్రానా బీజేపీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మనమెన్నో మంచి పనులు చేశాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజల కోసం పోరాడాం. అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు పటిష్టం చేశాం.
యూపీని మాఫియా రహితంగా చేశాం’అని యోగి అన్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ కేవలం 33 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ సమాజ్‌వాదీ(ఎస్పీ) 37 సీట్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment