మేడమ్‌ కళ్లు పెద్దవి చేసి చూడండి.. కంగనాకు అదిరిపోయే కౌంటర్‌ | HPSEBL Gives Clarity On MP Kangana Ranaut Rs 1 Lakh Power Bills Controversy, Says Bills Included Old Dues | Sakshi
Sakshi News home page

మేడమ్‌ కళ్లు పెద్దవి చేసి చూడండి.. కంగనాకు అదిరిపోయే కౌంటర్‌

Published Fri, Apr 11 2025 8:58 AM | Last Updated on Fri, Apr 11 2025 10:49 AM

HPSEB Carified MP Kangana Ranaut Power bills Issue

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. బాలీవుడ్ స్టార్, మండి ఎంపీ కంగనా రనౌత్‌ ఇంటికి సంబంధించి వచ్చిన కరెంట్‌ బిల్లు విషయంలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మంత్రి, విద్యుత్‌ శాఖ అధికారులు.. కంగనాకు కౌంటరిచ్చారు. కంగనా ఇంటికి వచ్చిన బిల్లు లక్ష కాదని రూ.55 వేలు మాత్రమేనని..  గతంలో చెల్లించని బిల్లుల కారణంగా రూ.91,100 గా పూర్తి బిల్లు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.

మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు వచ్చిందంటూ గోల చేసింది కంగనా. తప్పంతా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ మండిపడ్డారు. మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ.లక్ష కరెంట్‌ బిల్లు వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యా. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటు. అయినప్పటికీ మనందరికీ ఒక అవకాశం ఉంది. నా సోదరీ సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

 దీంతో, రంగంలోని దిగిన విద్యుత్‌ శాఖ అధికారులు.. బిల్లుపై ఆరా తీశారు. ఎంపీ కంగనా ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ స్పందించారు. ఈ క్రమంలో కంగనాకు.. 55 వేల రూపాయలు కేవలం ఈ నెల బిల్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆమె గతంలో చెల్లించని బిల్లులు కూడా కలిపి రూ.91,100గా పూర్తి బిల్లు వచ్చిందని చెప్పారు. చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే ఇంత మొత్తంలో బిల్లు వచ్చేది కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా రనౌత్ దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారని.. అందుకే ఒక్క నెల బిల్లు కూడా రూ.55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా చూపించారు. ఇదే సమయంలో తాము కంగనాకు రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు తెలిపారు. దీంతో, కంగనాకు బిగ్‌ షాక్‌ తగిలింది.

మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడమ్‌ కరెంట్‌ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చూసి బిల్లును చూడండి అంటూ చురకలు అంటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement