కంగనా రనౌత్‌పై హిమాచల్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు | Congress Minister comments BJP Relying only stardom by fielding Kangana Ranaut | Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్‌పై హిమాచల్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు

Published Mon, Mar 25 2024 6:57 PM | Last Updated on Mon, Mar 25 2024 7:18 PM

Congress Minister comments BJP Relying only stardom by fielding Kangana Ranaut - Sakshi

సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి సెగ్మెంట్‌ బాలీవుడ్‌ నటీ కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్‌ కేటాయింది.  కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్‌ ప్రకటించటంపై హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రి విక్రమాధిత్య సింగ్‌ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు.

‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత  విషయం. నేను వారు ఎంపిక విధానంపై  ఎటువంటి  వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్‌సభ ఎ‍న్నికల  బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్‌ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్‌ ప్రదేశ్‌కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్‌ ప్రదేశ్‌కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు.

‘స్టార్‌డమ్‌తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్‌డమ్‌ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్‌ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్‌ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్‌డమ్‌ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. 

ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ ఇటీవల తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్‌ ప్రకటించటంపై ప్రతిభా సింగ్‌ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్‌గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement