vikramaditya
-
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేస్తున్నారు. హిమాచల్‌లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్‌లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
కంగనా రనౌత్‌పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. ‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్‌ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్‌కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్‌కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు. ‘స్టార్డమ్తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఇటీవల తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్‌గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్ అన్నారు. -
యూట్యూబ్ లో మా సంపాదన ఎంతంటే..?
-
ఎంటర్‘ట్రైన్’మెంట్: ట్రైన్ సీన్లు కీలకంగా ఉన్న కొత్త సినిమాలివే!
ట్రైన్లో ప్రేమ.. ట్రైన్లో ఫైట్.. ట్రైన్లో కామెడీ.. ట్రైన్లో ఎమోషన్.. ట్రైన్ జర్నీలో ఎన్నో... వెండితెరపై ఎన్నో భావోద్వేగాలను ట్రైన్ చూపించింది. ఆడియన్స్‌ని ఎంటర్‘ట్రైన్’ చేసింది. ట్రైన్‌కి చాలా సీన్ ఉన్న సినిమాలు ఇప్పుడు ట్రాక్‌లో ఉన్నాయి. ఆ ఎంటర్‘ట్రైన్’మెంట్లోకి వెళదాం... Tollywood Movies With A Train Backdrop: ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్ ప్రేరణగా పూజా హెగ్డే కనిపిస్తారు. 1970నాటి యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీలో ఓ ట్రైన్ ఎపిసోడ్ కీలకంగా నిలవనుంది. ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్లో ట్రైన్లో ప్రభాస్, పూజ కనిపిస్తారు. ప్రేరణగా పూజా హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ట్రైన్లో ఉన్న స్టిల్‌నే విడుదల చేశారు. ఓ ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగే ట్రైన్ యాక్సిడెంట్లో విడిపోయిన విక్రమాదిత్య, ప్రేరణ మళ్లీ ఎలా కలుసుకుని వారి ప్రేమకు శుభం కార్డు వేశారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని సమాచారం. ఈ చిత్రం మార్చి 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ‘రాధేశ్యామ్’ చిత్రంలోని హీరో పాత్ర పేరు విక్రమాదిత్యనే టైటిల్‌గా పెట్టి దర్శకుడు తేజ 1836 నేపథ్యంలో సాగే ఓ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో ట్రైన్ విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. సో.. ‘విక్రమాదిత్య’లో ట్రైన్ ఎపిసోడ్ కీలకంగా ఉండటమే కాకుండా, ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో మేజర్ కథ సాగుతుందని ఊహించవచ్చు. అలాగే ‘సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం’ బ్యారేజ్‌కు, ‘విక్రమాదిత్య’ చిత్రకథకు లింక్ ఉందని చిత్రం యూనిట్ హిట్ ఇచ్చింది. ఇక రవితేజ కెరీర్లో ఓ హిట్ మూవీగా నిలిచిన ‘వెంకీ’లోని ట్రైన్ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ఎపిసోడే కథను ముందుకు నడిపిస్తుంటుంది. తాజాగా కథను ముందుకు నడిపే ట్రైన్ ఎపిసోడ్‌తో రవితేజ చేస్తోన్న చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. ఈ సినిమా కొత్త పోస్టర్ ఇటీవల రిలీజైంది. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉన్నట్లుగా ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అయితే రవితేజ ‘వెంకీ’ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్ కామెడీతో ఉంటే, ‘రామారావు: ఆన్ డ్యూటీ’లోని ట్రైన్ ఎపిపోడ్స్ సీరియస్‌గా ఉంటాయని తెలుస్తోంది. ట్రైన్లో మంటలు చెలరేగడం, బాధితులకు న్యాయం చేసే ఓ ఎమ్మార్వోగా రవితేజ పోరాటం చేయడం అనే అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న విడుదల కానుంది. ఇక రవితేజ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ఇది. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ట్రైన్లో దొంగతనాలు చేసే నాగేశ్వరరావుగా కొన్ని సీన్స్‌లో రవితేజ కనిపిస్తారట. ఇంకోవైపు ‘వి’ చిత్రం తర్వాత హీరో నాని కాస్త నెగటివ్ రోల్లో కనిపిస్తారని ప్రచారం అవుతోన్న చిత్రం ‘దసరా’. ‘నేను లోకల్’ చిత్రం తర్వాత నాని, కీర్తీ సురేష్ హీరోహీరోయిన్లుగా నటించనున్న ఈ పీరియాడికల్æఫిల్మ్‌కు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ స్టార్టింగ్‌లో పొగతో వచ్చే రైలు బండి కనబడుతుంది. ఇక ఈ సినిమాలో రైలు ఎపిసోడ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? గోదావరి ఖనిలోని సింగరేణి కోల్‌మైన్స్ సమీపగ్రామంలో ‘దసరా’ స్టోరీ సాగుతుంది. మార్చిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. మరోవైపు కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో ట్రైన్లో నుంచి కల్యాణ్ రామ్ తుపాకీతో ప్రత్యర్థులపై గురి పెట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. దీన్నిబట్టి ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాను మలుపు తిప్పుతుందని అనుకోవచ్చు. 1945లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ సారథ్యంలోని అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో అనుకోని çఘటనల వల్ల ఓ గూఢచారి జీవితం ఎలా ప్రభావితం అయింది? అనే అంశం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఈ సినిమాలే కాక మరికొన్ని తెలుగు చిత్రాల్లో ట్రైన్ సన్నివేశాలు సెట్స్‌లో ట్రాక్‌పై ఉన్నాయి. రైలు జర్నీ బాగుంటుంది. సినిమాలో రైలు ఎపిసోడ్లూ దాదాపు బాగుంటాయి కాబట్టి వెండితెరపై ట్రైన్ జర్నీ కొనసాగాలని కోరుకుందామా! -
ఆ మూవీతో కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్ తేజ!
డైరెక్టర్ తేజ ప్రస్తుతం రానా సోదరుడు అభిరాం దగ్గుబాటి హీరోగా అహింస మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అభిరాం హీరోగా పరిచయం కానున్నాడు. భిన్న కథలతో కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే తేజ ఇప్పుడు ఆయన తనయుడిని హీరోగా చూపించబోతున్నాడు. ఫిబ్రవరి 22 తేజ బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పిరియాడిల్ ఎపిక్ లవ్‌స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఒకే ఫ్రేంలో ‘గాడ్ ఫాదర్’, ‘భీమ్లా నాయక్’, వీడియో వైరల్ లక్ష్మి నరసింహా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ఈ మూవీలో తేజ కొడుకు అమితవ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ‘విక్రమాదిత్య’ అనే పిరియాడికల్ లవ్‌స్టోరితో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే. కాగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. Taking you back in the year 1836, when LOVE was INNOCENT ❤️ Here’s the PRE LOOK POSTER of an Epic Love Story #VikramAditya 🎬 Directed by @tejagaru ❤️🔥 Shoot Begins today🤘 More details to be revealed soon✨@LNPOfficial #NallamalupuSrinivas (Bujji)#HappyBirthdayTeja 💥 pic.twitter.com/fzKTQuqaaY — LNP (@LNPOfficial) February 22, 2022 -
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
ముంబై: భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మంటలు చెలరేగి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించినట్లు నేవీ ప్రతినిధి తెలిపారు. నౌకలోని సిబ్బంది పొగను గమనించి వెంటనే మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని అన్నారు. దీంతో సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, పెద్దగా నష్టం జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యుద్ద నౌక కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయంలో ఉందని, ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని నేవీ ప్రతినిధి అన్నారు. కీవ్-క్లాస్ అనే యుద్ధ నౌకను భారత్ 2013లో రష్యా నుంచి కొనుగోలు చేసి, దానికి విక్రమాదిత్య చక్రవర్తి పై గౌరవార్థం ఐఎన్ఎస్ విక్రమాదిత్యగా పేరు పెట్టారు. 20 అంతస్తుల ఎత్తు, 22 డెక్స్‌తో సుమారు 1600 మంది సిబ్బంది సామర్ఠ్యం కలిగిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య పొడవు 284 మీటర్లు, 60 మీటర్ల బేస్‌తో మూడు ఫుట్‌బాల్ మైదానాల వైశాల్యం కలిగి ఉంది. -
సీఎంను కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ
సాక్షి,అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను బ్యాంకు ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ముంబై) విక్రమాదిత్య సింగ్ కిచి గురువారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని, రాష్ట్ర ప్రగతికి తమవంతు కృషి చేస్తామని విక్రమాదిత్య సింగ్ తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటిం టికీ రేషన్ అందించేందుకు సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించిన 9,260 కమర్షియల్ వాహనాలకు అవసరమైన రుణాలను బ్యాంక్ ఆఫ్ బరోడా అందించినట్లు తెలిపారు. బ్యాంక్ జోనల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా (హైదరాబాద్) మాట్లాడుతూ..సాంకేతికను సద్వినియోగం చేసుకుంటూ వినియోగదారులకు విభిన్నమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. సీఎంను కలిసిన వారిలో బ్యాంక్ విజయవాడ రీజనల్ మేనేజర్ ఠాకూర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎం.విద్యాసాగర్, డీజీఎం సీహెచ్ రాజశేఖర్ ఉన్నారు. -
ఎంఎస్ఎంఈలకు అండగా బీఓబీ
విజయవాడ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు అండగా నిలవడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కోవిడ్–19 వైరస్ విపత్తు కారణంగా ఈ రంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, పరిష్కారాలకు తగిన సూచినలను అందించడంలో భాగంగా జాతీయస్థాయి వెబినార్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కిచి మాట్లాడుతూ.. ‘దేశంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఎంఎస్ఎంఈకి బీఓబీ అండగా ఉంటుంది. ఈ రంగానికి ఆర్బీఐ అందిస్తున్న పలు ప్రోత్సాహాల గురించి సమావేశం ద్వారా తెలియజేశాం’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 33వేలకు పైగా ప్రతినిధులు ఆన్లైన్లో పాల్గొన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. -
‘యుద్ధం’పూర్
కశ్మీర్‌లోని జమ్మూ ప్రాంతంలో కీలక లోక్‌సభ స్థానం ఉధంపూర్. హిందూ ఓటర్లు మెజారిటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ 2014లో గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ను ఆయన దాదాపు 61 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. కశ్మీర్ మాజీ సంస్థానాధీశుడు, రాజా హరిసింగ్ కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కరణ్‌సింగ్ (కాంగ్రెస్) గతంలో నాలుగుసార్లు ఇక్కడి నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. జమ్మూ, కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ నేత భీమ్‌సింగ్ 1988 ఉప ఎన్నికలో ఒకసారి ఇక్కడ విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్ సభ్యుడు జితేంద్రసింగ్ బీజేపీ తరఫున, కాంగ్రెస్ టికెట్‌పై కరణ్‌సింగ్ కొడుకు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. గ్వాలియర్ మాజీ సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన మాధవరావు సింధియా కుమార్తెను విక్రమాదిత్య 1987లో వివాహమాడారు. పాంథర్స్ పార్టీ తరఫున హర్షదేవ్సింగ్ పోటీలో ఉన్నారు. 16.85 లక్షల ఓటర్లున్న ఈ సీటుకు ఏప్రిల్ 18న (రెండో దశ) పోలింగ్ జరగనుంది. ఏడు జిల్లాల్లోని 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉధంపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. బీజేపీ నాలుగుసార్లు విజయం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చమన్‌లాల్ గుప్తా గతంలో మూడుసార్లు ఉధంపూర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లో జితేంద్రసింగ్ గెలిచారు. మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తుండటంతో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని భావిస్తున్నారు. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా చౌధరీ లాల్‌సింగ్ పోటీకి దిగడంతో హిందూ ఓట్లు చీలిపోతాయని అంచనా. కఠువా రేప్ కేసులో నిందితులకు అనుకూలంగా లాల్‌సింగ్ మాట్లాడి వివాదం సృష్టించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికైన లాల్‌సింగ్ తర్వాత మంత్రి అయ్యారు. ‘కఠువా’ పరిణామాలతో బీజేపీ రాజీ నామా చేయించింది. నలుగురు అభ్యర్థులూ రాజపుత్ర వర్గానికి చెందినవారే. కఠువా ఘటనలో బాధితులైన బక్రవాల్ ముస్లిం వర్గం ఓట్లు కాంగ్రెస్‌కే పడతాయని అంచనా. మాజీ సీఎం మహబూబా ముఫ్తీ.. కాంగ్రెస్‌కు అనుకూలంగా అభ్యర్థిని నిలపకపోవడం విక్రమాదిత్యకు కలిసొచ్చే అంశం. లాల్‌సింగ్ ర్యాలీలకు అనూహ్య స్పందన! కఠువా ఘటనతో సంచలనం సృష్టించిన లాల్‌సింగ్ ర్యాలీల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. హిందువులకు ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానం ఇక్కడ తగ్గలేదనీ, ఎంపీ అభ్యర్థి ఎవరనే పట్టింపు లేదనీ, ఈ కారణంగా బీజేపీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లాల్‌సింగ్ చీల్చే ఓట్లు గణనీయంగా ఉంటే జితేంద్రసింగ్ గెలుపు కష్టమే అవుతుంది. కశ్మీర్ మాజీ రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్యకు హిందువుల నుంచి లభించే ఆదరణ ఉధంపూర్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. పీడీపీ మద్దతు వల్ల విక్రమాదిత్యకు ముస్లింల ఓట్లు లభిస్తే కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగవుతాయి. మొత్తం మీద 2014తో పోల్చితే ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉందని చెప్పవచ్చు. -
తేజస్ జెట్లను వినియోగించలేం: నేవీ
న్యూఢిల్లీ: దేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేజస్ కు సేవలను అందుకోగల సామర్ధ్యం భారత విమానవాహక నౌకలకు లేదని భారతీయ నేవీ పేర్కొంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, అడ్మిరల్ సునీల్ లాన్బా ఓ ప్రకటన విడుదల చేశారు. తేజస్ అధిక బరువు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అధిక బరువు కలిగిన జెట్లను విమానవాహక నౌకలపై వినియోగించడం అసాధ్యమని చెప్పారు. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ నేవీకి ఉపయోగపడుతుందని తాము భావించామని చెప్పారు. దురదృష్టవశాత్తూ తేజస్ జెట్ల అధిక బరువు విమానవాహక నౌక సామర్ధ్యానికి కంటే ఎక్కువ ఉందని చెప్పారు. ప్రస్తుతం మిగ్-29కే జెట్లను విమానవాహక నౌక విక్రమాదిత్యపై వినియోగిస్తున్నామని, తర్వలో దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్ మీద కూడా మిగ్-29కేలను ఉపయోగించనున్నట్లు తెలిపారు. నేవీ వద్ద ఉన్న విమానవాహక నౌకల సామర్ధ్యానికి తగిన విధంగా ఉండే సరికొత్త జెట్ల కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు చెప్పారు. తేజస్ జెట్లకు సరిపడే విమానవాహక నౌక అవసరం నేవీకి ఉందని లాన్బా అన్నారు. నేవల్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను అభివృద్ధి చేసేందుకు డీఆర్డీవోను నేవీ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కాగా, తేజస్ ను భారతీయ వాయుదళంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి కొనుగోలు చేసిన విమానవాహక నౌకల సామర్ధ్యానికి.. మనం సొంతగా తయారుచేసే జెట్లు సరితూగకపోతే కాలానుగుణంగా టెక్నాలజీలో వచ్చిన మార్పులు అందుకు కారణంగా భావించవచ్చు. దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్(విమానవాహక నౌక)పై కూడా తేజస్ ను వినియోగించలేమని నేవీ చెప్పడం దూరదృష్టి లేకుండానే దేశీయ జెట్లు, విమానవాహక నౌకలను తయారు చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మిగ్ విమానాలకు ప్రత్యామ్నాయంగా ఓ ఫైటర్ డెవలప్ మెంట్ ను చేయాలని 1980ల్లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1999లో విక్రాంత్ ను అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. -
భారత అమ్ములపొదిలో మరో అస్త్రం