ఆ మూవీతో కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్‌ తేజ! | Director Teja Introduce His Son Amitav As Hero With Vikramaditya Movie | Sakshi
Sakshi News home page

Director Teja: ఆ మూవీతో కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్‌ తేజ!

Published Thu, Feb 24 2022 7:10 PM | Last Updated on Thu, Feb 24 2022 7:14 PM

Director Teja Introduce His Son Amitav As Hero With Vikramaditya Movie - Sakshi

డైరెక్టర్‌ తేజ ప్రస్తుతం రానా సోదరుడు అభిరాం దగ్గుబాటి హీరోగా అహింస మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అభిరాం హీరోగా పరిచయం కానున్నాడు. భిన్న కథలతో కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే తేజ ఇప్పుడు ఆయన తనయుడిని హీరోగా చూపించబోతున్నాడు. ఫిబ్రవరి 22 తేజ బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పిరియాడిల్‌ ఎపిక్‌ లవ్‌స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు వెల్లడించాడు.

చదవండి: ఒకే ఫ్రేంలో ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భీమ్లా నాయక్‌’, వీడియో వైరల్‌

లక్ష్మి నరసింహా ప్రోడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ఈ మూవీలో తేజ కొడుకు అమితవ్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడనే టాక్‌ నడుస్తోంది. ‘విక్రమాదిత్య’ అనే పిరియాడికల్‌ లవ్‌స్టోరితో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే. కాగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement