
విజయవాడ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు అండగా నిలవడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కోవిడ్–19 వైరస్ విపత్తు కారణంగా ఈ రంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, పరిష్కారాలకు తగిన సూచినలను అందించడంలో భాగంగా జాతీయస్థాయి వెబినార్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కిచి మాట్లాడుతూ.. ‘దేశంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈకి బీఓబీ అండగా ఉంటుంది. ఈ రంగానికి ఆర్‌బీఐ అందిస్తున్న పలు ప్రోత్సాహాల గురించి సమావేశం ద్వారా తెలియజేశాం’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 33వేలకు పైగా ప్రతినిధులు ఆన్‌లైన్లో పాల్గొన్నట్లు బ్యాంక్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment