Pratibha
-
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
-
లాపతా లేడీస్: సిమ్లా టూ బాలీవుడ్, ఎవరీ యాపిల్ బ్యూటీ (ఫొటోలు)
-
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తుండగా కిరణ్ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్‌లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా లాపతా లేడీస్ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్ ముంబై అందాల పోటీల్లో మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్ హువా’ టీవీ సీరియల్ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో. -
కంగనా రనౌత్‌పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. ‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్‌ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్‌కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్‌కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు. ‘స్టార్డమ్తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఇటీవల తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్‌గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్ అన్నారు. -
సొంత నేతలతో కాంగ్రెస్‌కు తలనొప్పులు?
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి ఆ పార్టీలోని సీనియర్ నేతలే కారణమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలు పార్టీకి కత్తిమీద సాములా మారాయి. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ హిమాచల్‌లోని మండి స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ససేమీరా అంటున్నారు. ప్రతిభా సింగ్ 2019లో మండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆమెకు అమితమైన ప్రజాదరణ ఉంది. కాగా మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఇదే వైఖరితో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు వీరభద్ర సింగ్ గ్రూపులోని పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారట. విక్రమాదిత్య సింగ్ వర్గం హిమాచల్ సీఎం కుర్చీపై కన్నేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
హిమాచల్ సీఎం రేసులో ప్రతిభా సింగ్? ఆమె నేపథ్యం ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో సీఎంను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖును తొలగించి, సీనియర్ నేత ప్రతిభా సింగ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత ప్రతిభా సింగ్ దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య. వీరభద్ర సింగ్ ఆరుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిభా సింగ్ 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నాడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2012లో ఆమె భర్త వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన లోక్‌సభకు రాజీనామా చేశారు. దీంతో 2013లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో నిలిచి, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్‌ను ఓడించారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వేవ్‌లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ 39 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రతిభా సింగ్‌పై విజయం సాధించారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతిభా సింగ్ ఓటమితో నేతలంతా కంగుతిన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత 2021లో ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో విజయం సాధించారు. 2022, ఏప్రిల్ 26న, హైకమాండ్ ప్రతిభా సింగ్‌ను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ 32వ అధ్యక్షురాలిగా నియమించింది. ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 1956 జూన్ 16న జన్మించారు. ప్రతిభా సింగ్ వీరభద్ర సింగ్‌ను 1985లో వివాహం చేసుకున్నారు. ప్రతిభ అతనికి రెండవ భార్య. వీరభద్ర సింగ్ మొదటి భార్య కుమార్తె అభిలాషా కుమారి గుజరాత్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్‌ల కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పనిచేశారు. -
విలువలకు నిదర్శనం రావి జీవితం
కుటుంబం కోసం కాకుండా జీవితాంతం ప్రజల కోసం పరితపించిన తన తాత రావి నారాయణరెడ్డి జీవితం తనకు ఆదర్శమని ఆయన మనవరాలు రావి ప్రతిభారెడ్డి తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా హరిజనులు, సామాన్యుల అభ్యున్నతి కోసం తపిస్తూ సాధారణ జీవితాన్ని గడిపారని.. ఎంపీగా పొందిన పింఛన్‌ను సైతం ప్రజల అవసరాల కోసం ఖర్చు చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. విలువలు, దార్శనికత కలిగిన రావి నారాయణరెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి ప్రభావం తనపై ఎంతో ఉందని ప్రతిభారెడ్డి చెప్పారు. తాత చూపిన మార్గంలో పయనించాలని ఉద్యోగాన్ని వదిలేశానని, ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాటం.. అందులో పాల్గొన్న వీరుల చరిత్ర తెలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు.. అయినా నిగర్వి.. రావి నారాయణరెడ్డి ఓ నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు. నీతి, నిజాయతీ కోసం ప్రాణం ఇచ్చేవారు. విలువలకు ఆయన ప్రాధాన్యతను ఇచ్చే వారు. ఆయన 1952 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా, ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారంటేనే ఆయన నీతి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంపీగా నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్న గర్వం ఆయనలో ఎప్పుడూ కనిపించేది కాదు. హరిజనులను ప్రేమించే వారు.. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ తాత సాధారణ జీవితం గడిపే వారు. తనకున్న 500 ఎకరాల భూమిని హరిజనులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంట్లో కార్లు కూడా ఉండేవి కాదు. ఆయనకు రెండు, మూడు జతల దస్తులే ఉండేవి. నానమ్మ బంగారు నగలను గాంధీజీ హరిజన సేవా సంఘానికి ఇచ్చారు. హిమాయత్‌నగర్‌లో మా ఇంటికి ఎప్పడూ భువనగిరి నుంచి వచ్చే వారికి నానమ్మ అన్నం పెట్టేది. తినకుండా ఎవరినీ వెళ్లనిచ్చే వారుకాదు. తాత చివరి దశలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి చూడటానికి వచ్చి నీకు ఏమైనా కావాలా అని అడిగితే కుటుంబం కోసం కాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయాలని అడిగారు. తాతయ్యతో ఎంతో అనుబంధం .. చిన్నతనం నుంచి హిమాయత్‌నగర్‌లోని మా ఇంట్లో తాతయ్య రావి నారాయణరెడ్డి దగ్గరే పెరిగాను. నాపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. నేను 8, 9 తరగతులు చదువుతున్న వయసులో హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలు, సమావేశాలతోపాటు రెడ్డి హాస్టల్‌కు నన్ను ఎప్పుడూ తీసుకెళ్లేవారు. నిజాయితీగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని నాకు చెప్పేవారు. ఆడపిల్లలకు చదువు అవసరమనేవారు. నన్ను కూడా బాగా చదువుకోమనే వారు. ఇంట్లో నానమ్మ రావి సీతాదేవి, మేనేత్త రావి భారతి, అమ్మానాన్నలు రావి ఉర్మిల, సంతో‹Ùరెడ్డిలు ఉండేవారు. అప్పుడున్న పరిస్థితులను చర్చించే వారు. స్త్రీలకు సమాన హక్కులు, విద్య, రైతాంగ సమస్యలు, సామాజిక విప్లవం, రాజకీయ చైతన్యం గురించి చెప్పేవారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, విద్యా, వైద్యసౌకర్యాలపై చర్చించే వారు. ఆయా అంశాలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. తాతయ్య ఆశయాల సాధన కోసం 17 సంవత్సరాలు చేసిన ఉద్యోగం వదిలి ఆయన చూపిన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నా. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనుంది.. తాత కోరుకున్న సమ సమాజం కోసం పనిచేస్తా. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 4 వేల కుటుంబాలకు ఏదైనా మంచి చేయాలన్న తాత ఆలోచనలను ముందుకు తీసుకెళ్తా. బొల్లేపల్లిలోని పాఠశాలతో నాకు అనుబంధం ఉంది. దానికోసం నాకు ఏమైనా చేయాలని ఉంది. గత సంవత్సరం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. జూన్ 4న తాత జయంతి సందర్భంగా టెన్త్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నగదు బహుమతులు అందజేశాం. బొల్లేపల్లిలో శిథిలావస్థలో ఉన్న తాత పుట్టిన ఇంటిని బాగు చేసి సంక్షేమ సెంటర్‌గా తీర్చిదిద్దుతా. అక్కడ స్త్రీల సాధికారత కోసం కంప్యూటర్ విద్య, కుట్టు పనులు నేర్పిద్దామనుకుంటున్నా. నేటి రాజకీయం డబ్బుమయం.. ప్రస్తుతం రాజకీయాలు డబ్బులమయమయ్యాయి. తాత లాగా ముక్కుసూటిగా మాట్లాడే వారు ఇప్పుడు రాజకీయాల్లో నెగ్గలేరు. ప్రస్తుతం నాయకులు పార్టీలు మారడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ప్రజలు సంక్షేమ పథకాలకు, డబ్బులకు అలవాటుపడ్డారు. ఓట్ల కోసం నాయకులు ఇస్తున్న డబ్బుతో చిన్నచిన్న అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకునికి ఐదేళ్ల కాలానికి చేసే అభివృద్ధి విజన్ ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలిసి ఉండాలి. అలాంటి వారినే ప్రజలు ఎన్నుకోవాలి. - యంబ నర్సింహులు -
క్రీడాకారిణికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు
-
హిమాచల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్‌కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. -
Pratibha Naithani: యాసిడ్ సమాజానికి సర్జరీ
పిల్లలను దృష్టిలో పెట్టుకొని టీవీ కార్యక్రమాల్లో అసభ్యత, హింస చూపడాన్ని వ్యతిరేకించడంలో పేరొందారు ముంబై వాసి డాక్టర్ ప్రతిభా నైతాని. యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా కాస్మెటిక్ వైద్యం అందించడంతో పాటు, వారికి తగిన న్యాయం జరగాలంటూ ఆయా మంత్రిత్వ శాఖల చుట్టూ తిరుగుతూ, దోషులకు శిక్ష పడేలా చేశారు, చేస్తున్నారు. డాక్టర్ ప్రతిభ కష్టానికి ఫలితంగా చట్టం మారింది, దోషులకు శిక్షలు పెరిగాయి. యాసిడ్ దాడి బాధితుల జీవితాలు కాస్త తేలికయ్యాయి. అయితే, గడిచిన ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా యాసిడ్ దాడులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రతిభా నైతాని ఎన్నో విషయాలను మీడియా ముందుంచారు. ‘‘పంతొమ్మిదేళ్ల క్రితం.. ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ అశోక్ గుప్తాతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. డాక్టర్ అశోక్ అప్పటికే తన పనితో పాటు సామాజిక సేవ కూడా చేస్తుండేవారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేద, గిరిజనులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఉచితంగా కాస్మెటిక్ సర్జరీలు చేస్తుండేవారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన నేను, ఈ సర్జరీలలో సహాయంగా ఉండేదాన్ని. యాసిడ్ దాడి కేసులు మొదట్లో ఒకటో రెండో వచ్చేవి. తర్వాత్తర్వాత వీటి సంఖ్య పెరుగుతుండటం గమనించాను. వీరికి ఉచితంగా సర్జరీలు చేయడమొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకున్నాను. వీటిని అరికట్టేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. దోషులకు శిక్షను పెంచాలి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ, లా కమిష¯Œ వరకు ప్రదక్షిణలు చేశాను. ముంబై నుంచి ఢిల్లీకి తరచూ ప్రయాణించేదాన్ని. గతంలో యాసిడ్ దాడి దోషులకు శిక్షలు చాలా తక్కువగా ఉండేవి. నిందితులకు కేవలం ఆరు నెలలు మాత్రమే బెయిలబుల్ శిక్ష ఉండేది. కానీ అమ్మాయి జీవితమంతా నరకమే. దీంతో పాటు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మరిన్ని ఇబ్బందులు తప్పవని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించేవారు. దీంతో వారికి న్యాయం జరిగేది కాదు. కత్తి గాయం, యాసిడ్ మంట ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకరి శరీరంపై యాసిడ్ పోయడం హత్య కంటే ఘోరమైన నేరం. ఈ విషయంలో చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత, 2013లో ఐపిసి లో 32-6A, 32-6B సెక్షన్లు చేర్చబడ్డాయి. దీని ప్రకారం, నిందితుడు దోషిగా తేలితే, ఏడేళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. అపరాధి నుండి జరిమానా కూడా వసూలు చేయబడుతుంది. దీంతో బాధితురాలి కోసం ఎంతో కొంతైనా చేయగలిగామనే ధీమా వచ్చింది. బాధితులకు పునరావాసం ‘‘యాసిడ్ దాడి బాధితులు సమాజంలో జీవించడం కష్టం. ఈ అమ్మాయిలకు పని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. చాలా సందర్భాల్లో చికిత్స ఖర్చులు పెరిగి, ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి ఘటనలు కూడా తెలిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల కేటగిరీలో చేర్చాలని, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వంటి వికలాంగుల కోటాలో వచ్చే అన్ని సౌకర్యాలు వారికి కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్‌ను నెరవేర్చడంలోనూ విజయం సాధించాం’’. ఉచిత వైద్య చికిత్స ‘‘యాసిడ్ దాడి బాధితులకు ప్రతి నగరంలో ఉచితంగా చికిత్స అందించాలన్నది మరో డిమాండ్. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం లేదు. ఏ ఆసుపత్రి అయినా, ఎక్కడ ఉన్నా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ మేరకు యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ సుప్రీంకోర్టులో పిటిష¯Œ దాఖలు చేశారు. వారికి ఉచితంగా శస్త్ర చికిత్స సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుబాటులో ఉండకూడదు బహిరంగంగా విక్రయించే యాసిడ్‌కు సంబంధించి, దాని విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేశాం. సాధారణ దుకాణాల్లో యాసిడ్ ఉండకూడదు. ఎప్పుడు, ఎవరు కొన్నారు, దేనికి వినియోగిస్తున్నారనేదానిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ విధానం వల్ల యాసిడ్ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ప్రాణాలతో పోరాటం యాసిడ్ దాడి బాధను భరిస్తూ జీవితంలో ముందుకు సాగిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అలాంటి అమ్మాయిలలో లలిత ఒకరు. దాడి జరిగి, తీసుకువచ్చినప్పుడు, ఆమె గాయాల వాసనకు, జనం క్లినిక్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనేక శస్త్రచికిత్సల తర్వాత కోలుకుంది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు తల్లి అయ్యింది. ఏ అమ్మాయీ యాసిడ్ బారిన పడకుండా అందరూ ఆనందంగా జీవించాలి’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారీ వైద్యురాలు. -
హిమాచల్ పీసీసీ చీఫ్‌గా ప్రతిభా వీరభద్ర సింగ్
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య, ఎంపీ ప్రతిభా వీరభద్ర సింగ్‌ను నియమించారు. కుల్దీప్ సింగ్ రాథోర్ స్థానంలో ఆమెను నియమించారు. దీంతోపాటు రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హర్ష మహాజన్, రాజేందర్ రాణా, పవన్ కాజల్, వినయ్‌కుమార్‌ను సోనియా నియమించారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఆనంద్ శర్మ, ప్రచార కమిటీ చైర్మన్‌గా సుక్వీందర్ సింగ్, సీఎల్పీ లీడర్‌గా ముకేశ్ అగ్నిహోత్రి నియమితులయ్యారు. చదవండి: (నవనీత్ కౌర్-రాణా దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు) -
‘మహా’ సెంటిమెంట్..
ముంబై: భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ అన్నది ఎవరు కాదనలేని వాస్తవం. అందుకే మనోళ్లను సెంటిమెంటల్ ఫూల్స్ అని వెక్కిరిస్తుంటారు. సెంటిమెంట్‌కు ఆయింట్మెంట్ కూడా లేదని సరదాగా అంటుంటారు. ఈ మాటకేమో గానీ సెంటిమెంట్‌తో రాజకీయాల్లోనూ ‘మహ’ బాగా నెగ్గుకురావొచ్చని తాజాగా నిరూపితమైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఒక్క సెంటిమెంట్ సీన్‌తో సమసిపోయిందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వ్యూహాలు-ప్రతివ్యూహాలు, ఎత్తులు-పైఎత్తులతో నెలరోజులుగా వేడెక్కిన మరాఠ రాజకీయాలు చివరకు సెంటిమెంట్ సీన్‌తో కొలిక్కి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన కలిసి రాకపోవడంతో బీజేపీ తెలివిగా ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా ఉన్న అజిత్ పవార్‌ను తనవైపు తిప్పుకుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి ఎన్సీపీలో చీలిక తేవాలని కుట్ర చేసింది. వెంటనే అప్రమత్తమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా మంత్రాంగం నడిపారు. అజిత్ పవార్‌ను శాసనసభా పక్షనేత పదవి నుంచి తొలగించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తనతో పాటు మిత్రపక్షాల ద్వారా అజిత్‌ను వెనక్కి పిలిచారు. ఇన్ని చేసినా అజిత్ పవార్ కమళ దండును వదిలి వెనక్కు రాలేదు. ఈలోగా మూడు రోజులు గడిచిపోయాయి. తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ‘పెద్దాయన’ తన సతీమణి ప్రతిభ పవార్‌తో అజిత్‌కు రాయబారం పంపారు. బీజేపీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టి వస్తే పవార్ పరివారంలో కలతలు సమసిపోతాయని, శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి వస్తుందని అజిత్‌ను స్వయంగా కలిసి చిన్నమ్మ బుజ్జగించారు. చెల్లెలు సుప్రియా సూలే కూడా అన్నయ్యకు నచ్చజెప్పారు. వీరిద్దరి మాటలతో మెత్తబడ్డ అజిత్ వెంటనే బీజేపీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి సొంతగూటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తున్నాయి. సినిమాల్లోనే కాదు సెంటిమెంట్ సీన్ ఎక్కడైనా పండుతుందని మరోసారి రుజువైందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. (రంగంలోకి దిగిన శరద్ పవార్ భార్య) -
మా ఆవిడ చేసే సాంబార్ ఇడ్లీకి ఫిదా
మా ఆవిడ ప్రతిభ మనస్సు పెట్టి చేసే స్మాల్ ఇడ్లీ.. సాంబార్ అంటే నాకు భలే ఇష్టం.. ఆ రోజు నిజంగా పండుగే.. మాకు పెళ్లి అయ్యేటప్పటికి ఆమెకు వంట రాదు. తర్వాత డ్యూటీలో భాగంగా నాతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వంట నేర్చుకుంది. సీ ఫుడ్ బాగా వండుతుంది.. కానీ ఇక్కడ అవి దొరకవు కదా.. అందుకే తీరిక దొరికినప్పుడు స్మాల్ ఇడ్లీ, సాంబారు చేస్తుందంటున్నారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్. ‘ఆయనకు ఇష్టమైన ఇడ్లీ చేయడం అంటే నాకు కూడా ఇష్టం.. ఆయన తిని ఆనందించడం కన్నా నాకేం కావాలి’ అంటున్నారు ఆయన సతీమణి ప్రతిభ. శనివారం ‘సాక్షి పర్సనల్ టైం’తో సీపీ దంపతుల ముచ్చట్లు.. సాక్షి, సిద్దిపేట: మాది పెద్దలు కుదిర్చిన వివాహం.. మా ఇద్దరిది సాంప్రదాయక కుటుంబాలు. డాక్టర్‌గా ప్రతిభ పేదలకు, వృద్ధులకు సేవచేయడం చూసిన మా బంధువులు ఈ మ్యాచ్ గురించి చెప్పారు. అమ్మా నాన్నలకు కూడా అటువంటి వారే కావాలని కోరుకునేవారు.. ఇంకేముంది ఒప్పేసుకున్నా.. అన్నారు డేవీస్. అయితే పోలీస్ ఆఫీసర్ అంటే మా కుటుంబానికి ఇష్టం ఉండకపోయేది. కానీ మంచి దైవచింతన, పెద్దలపై గౌరవం, కింది స్థాయి నుంచి కష్టాలు, కన్నీళ్లు చవిచూసిన వ్యక్తిగా మా బంధువులు చెప్పారు. అంతకంటే ఏం కోరుకుంటామని ఆయన సతీమణి ప్రతిభ బదులు చెప్పారు. మాది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా.. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చాం.. మాకు ఈ ప్రాంతంలో బంధువులు ఎవరూ లేరు.. నాకు మా ప్రతిభ.. ప్రతిభకు నేను.. మాకు ఇద్దరు కుమారులు ఎఫ్రేమ్ పీ జోయల్, ఇవాన్ పీ జోయల్, ఇది మా కుటుంబం.. అంతా సరదగా ఉంటాం.. అవకాశం దొరికితే ఇంటి వద్దనే ఎక్కువ గడిపేందుకు ఇష్టపడుతాం. నా పెళ్లి సమయం నాటికి ఆమెది ఎంబీబీఎస్ పూర్తి అయింది. సామాజిక సేవ చేయడం ఇష్టం. ఉట్నూరు ఆస్పత్రిలో పనిచేసినప్పుడు అందరు అంటూ ఉండేవారు.. అందుకోసమే ఆమె ఇష్ట్రపకారం ఎండీ కూడా చదివించాను. చదువును అశ్రద్ధ చేయలేదు.. చిన్నతనంలో ఎవ్వరైనా సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.. నేను కూడా అంతే.. వేసవి సెలవుల్లో మా నాన్న గారు ముందుగా పదిరోజులు బైబిల్ స్కూల్‌కు పంపించేవారు.. ఆ తర్వాత.. ఆటలే ఆటలు పొద్దన లేవగానే మిత్రులతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లడం.. వాలీబాల్ ఇతర ఆటలు ఆడటం.. కన్యాకుమారి చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతా లకు వెళ్లడం భలే సరదాగా ఉండేది. అయితే ఎంత ఆటలు ఆడినా.. ఎటు వెళ్లినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. సెలవులు ముగియగానే తిరిగి చదువు యుద్దం ప్రారంభించేవాళ్లం.. పోటీ పడి చదివే వాళ్లం.. కామిడీ సినిమా వస్తే చూడాల్సిందే.. కామిడీ సినిమాలు ఇంటే మా ఇద్దరికి ఇష్టం. అందుకోసమే కామిడీ సినిమా వచ్చిందంటే చూసి తీరాల్సిందే.. మనం సరదాగా సినిమాకు వెళ్తాం. అక్కడ కూడా అంతా టెన్షన్, ఉత్కంఠంగా ఉంటే నచ్చదు. సినిమా చూసిన మూడు గంటలు సరదాగా ఉండాలి. నవ్వుకునేలా ఉండాలి.. ఇటీవల చూసిన ఎఫ్–2 సినిమా మొదటి ఆఫ్ నాకు నచ్చింది. అనగానే రెండో ఆఫ్ నాకు నచ్చిందని డాక్టర్ ప్రతిభ బదులు చెప్పారు. అదేవిధంగా విక్రమార్క సినిమా కూడా బాగా నచ్చిందని చెప్పారు. తీరికి దొరికితే సిద్దిపేట కోమటిచెరువు.. ఎక్కువ సమయం దొరికితే హైదరాబాద్ వెళ్లి వస్తాం.. అక్కడ షాపింగ్, ఫుడ్ కోర్టులోకి వెళ్లడం అంటే కూడా ఇష్టమే. నైనిటల్ అంటే బాగా ఇష్టం.. ఇద్దరం బీజీగా ఉంటాం.. కానీ అప్పుడప్పుడు టూర్స్ వేస్తాం.. మా రాష్ట్రంలోని ఊటీ, కొడైకెనాల్ ఎప్పుడూ వెళ్తుంటా.. అయితే నైనిటాల్ అంటే బాగా ఇష్టం. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడికి ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపిస్తుంది. మా పెళ్లి అయిన తర్వాత ఆరు సంవత్సరాలకు ఇద్దరు కవలలు పుట్టారు. వారి పుట్టిన రోజు మాకు బాగా ఆనందకరం కల్గించిన రోజు.. అదేవిధంగా చిన్నబాబు ఇవాన్ పీ జోయల్ గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నప్పుడు... ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఆరోజు ఇద్దరు కంటికి రెప్పకూడా వేయకుండా బాబును చూసుకుంటూ ఏడ్చాం. అంతటి బాధెప్పుడూ రాలేదు. దేవుడి దయవల్ల ఇప్పుడు అంతా హ్యాపీ. -
పేద క్రీడాకారులకు అండగా ఉంటా
హన్మకొండ చౌరస్తా : ప్రతిభ ఉండి పేదరికంతో క్రీడలకు దూరమైన క్రీడాకారుల అభ్యున్నతికి తనవంతుగా చేయూత అందిస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ టెన్నికాయిట్ అసోసియేషన్ సౌజన్యంతో వరంగల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు నాయిని రాజేందర్‌రెడ్డి బహుమతులను ప్రదా నం చేశారు. బాలుర విభాగంలో తేజురాజ్ విజేతగా నిలవగా, రన్నరప్‌గా జంపన్న నిలిచారు. వరంగల్‌కు చెందిన కౌశిక్ నాలుగో స్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో విజేతగా ప్రియాంక నిలవగా, రన్నరప్ స్థానాన్ని శిరీష సాధించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మీకాంతం, సద్గురు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఉపాధ్యక్షుడు గోకారపు శ్యాం, కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్, మంచాల స్వామిచరణ్, అలువాల రాజ్‌కుమార్, సంపత్‌కుమార్, సీతారాం, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కేశవమూర్తి, కార్పొరేటర్ టి.విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : 2015–16 విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన కురువ విద్యార్థులకు జిల్లా కురువ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ కురవ కులస్తుల్లో అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కురవల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు తమవంతు కషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, చింతలయ్య, నాగరాజు, ఎస్.మల్లేష్. వేణుగోపాల్, కె.రాజు, శివన్న, గోపాల్, చంద్రకళ, హర్షిత, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భార్యపై దాడి..ఆపై ఆత్మహత్యాయత్నం
=దంపతుల పరిస్థితి విషమం =దిక్కుతోచని చిన్నారి మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: కుటుంబ సమస్యలపై దంపతులు గొడవపడ్డారు. ఆగ్రహించిన భర్త కట్టెతో భార్య తలపై మోదాడు. ఆమె చనిపోయిం దని భావించి తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం మదనపల్లె రూరల్ మండలంలో విషాదం మిగిల్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం ఈడిగపల్లె పంచాయతీ బోడువారిపల్లెకు చెందిన రమణ, గౌరమ్మ దంపతుల కుమారుడు రాజేంద్ర(32) కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్ తాలూకా కొత్త మంగళానికి చెందిన వెంకటేష్, మంగమ్మ కుమార్తె ఆశ(28)ను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. రాజేంద్ర ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని బసినికొండలో కాపురం పెట్టాడు. వీరికి పెళ్లైన ఆరేళ్ల తర్వాత పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాపకు ఏడాదిన్నర వయస్సు ఉంది. ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం పాపకు తీవ్ర జ్వరం రావడంతో ఆశ భర్తకు ఫోన్‌చేసి వెంటనే ఆస్పత్రికి రావాలని చెప్పింది. భర్త చాలా ఆలస్యంగా వెళ్లాడు. ఇద్దరూ ఇంటికెళ్లిన తర్వాత పాపకు జబ్బు చేస్తే ఆస్పత్రికి వచ్చేంత సమయమూ లేదా..?అని భార్య ప్రశ్నించింది. దీంతో ఇద్దరూ తగువులాడుకున్నారు. అంతే భర్తపై అలిగిన ఆశ కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత రాజేంద్ర భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్త ఇంటికి రెండుసార్లు వెళ్లాడు. అత్తామామలు, బావమర్దులు ఆశను కాపురానికి పంపకపోగా రాజేంద్రను అవమానపరిచి కొట్టారు. దీంతో అతను ఇంటికొచ్చేశాడు. రెండు రోజుల క్రితం ఆశను మేనమామ వెంటబెట్టుకుని రాజేంద్ర ఇంటికి వచ్చాడు. దంపతులిద్దరికీ నచ్చజెప్పి వెళ్లిపోయాడు. ఇంతలో ఏమైందో ఏమో ఆదివారం రాత్రి దంపతులిద్దరూ తిరిగి గొడవ పడ్డారు. తెల్లవారి నిద్రలేవగానే మళ్లీ గొడవపడ్డారు. క్షణికావేశానికి లోనైన రాజేంద్ర ఇంట్లో ఉన్న కట్టెతో భార్య తలపై మోదాడు. ఆమె మెదడు బయటకొచ్చి తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయింది. చనిపోయిందేమోనని భావిం చిన రాజేంద్ర కత్తితో తన గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆపై తన కుమార్తెను తీసుకుని రక్తస్రావం అవుతుండగానే ఆటోలో మదనపల్లె ఆస్పత్రికి చేరుకున్నాడు. తన భార్యను హత్యచేసి, తాను ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పాడు. ఆ వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేంద్ర కుమార్తెను ఆస్పత్రి సిబ్బంది చేరదీశారు. రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆశ ప్రాణాలతోనే ఉండడంతో ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యం చేయించారు. పరీక్షించిన వైద్యులు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నరకయాతన అనుభవించిన ఆశ భార్యాభర్తలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు రాజేంద్ర తల్లిదండ్రులు, అక్క రమణమ్మలకు తెలిసింది. వారు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆశ పరిస్థితి విషమంగా ఉందని, పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పినప్పటికీ తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. రక్తస్రావం ఆగకపోవడంతో ఆశ నరకయాతన అనుభవించింది. ఆఖరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆశ కుటుంబసభ్యులు వచ్చి తమ బిడ్డను కోలారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బిడ్డ పరిస్థితి దయనీయం రాజేంద్ర, ఆశ దంపతుల కుమార్తె ప్రతిభ పరిస్థితి దయనీయం గా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ముక్కుపచ్చలారని ఆ చిన్నారికి ఏమి జరిగిందో తెలియక ఆస్పత్రి సిబ్బంది వద్దే ఉండిపోయింది. ఏడ్చినప్పుడు వాళ్లు పాలబుడ్డి ఇవ్వడంతో పాలు తాగుతూ ఏడుపు ఆపేసేది. దీన్ని చూసిన సిబ్బంది, స్థానికులు అయ్యో పాపం అంటూ కన్నీటి పర్యంతమవడం కనిపించింది.