విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత | Prasented Pratibha Awards to students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

Published Sun, Jul 24 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

Prasented Pratibha Awards to students

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : 2015–16 విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన కురువ విద్యార్థులకు జిల్లా కురువ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జిల్లా కేంద్రంలోని కెమిస్ట్‌ అండ్‌ డ్రగిస్ట్‌ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ కురవ కులస్తుల్లో అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కురవల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు తమవంతు కషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, చింతలయ్య, నాగరాజు, ఎస్‌.మల్లేష్‌. వేణుగోపాల్, కె.రాజు, శివన్న, గోపాల్, చంద్రకళ, హర్షిత, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement