
హైదరాబాద్: త్యాగం, పోరాటం కలిపితే ఒక రావి నారాయణరెడ్డి మన కళ్లల్లో కనిపిస్తారని సామాజికవేత్త రావి ప్రతిభారెడ్డి అన్నారు. రావి నారాయణరెడ్డి స్వగ్రామమైన బొల్లేపల్లిలో 10వ తరగతి విద్యార్థులకు గురువారం పరీక్షల మెటీరియల్ అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తన భూమిని పేదలకు పంచటంతో పాటు, భూమితోనే పేదలకు భుక్తి,విముక్తి లభిస్తుందన్న విశ్వాసంతో సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు.
హైదరాబాద్ రాష్ట్రంలో 4వేల గ్రామాల్లో రైతు రాజ్యాలు ఏర్పాటు చేసిన ఘనత రావి నారాయణరెడ్డికే దక్కిందని ప్రతిభారెడ్డి అన్నారు. ఆయన జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని నేటి యువత సమాజం కోసం త్యాగం, అన్యాయాలు, అక్రమాలపై పోరాటాలకు వెనకకాడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొని ప్రతిభారెడ్డిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment