పేద క్రీడాకారులకు అండగా ఉంటా
Published Mon, Aug 1 2016 12:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హన్మకొండ చౌరస్తా : ప్రతిభ ఉండి పేదరికంతో క్రీడలకు దూరమైన క్రీడాకారుల అభ్యున్నతికి తనవంతుగా చేయూత అందిస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ టెన్నికాయిట్ అసోసియేషన్ సౌజన్యంతో వరంగల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు నాయిని రాజేందర్‌రెడ్డి బహుమతులను ప్రదా నం చేశారు. బాలుర విభాగంలో తేజురాజ్ విజేతగా నిలవగా, రన్నరప్‌గా జంపన్న నిలిచారు. వరంగల్‌కు చెందిన కౌశిక్ నాలుగో స్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో విజేతగా ప్రియాంక నిలవగా, రన్నరప్ స్థానాన్ని శిరీష సాధించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మీకాంతం, సద్గురు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఉపాధ్యక్షుడు గోకారపు శ్యాం, కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్, మంచాల స్వామిచరణ్, అలువాల రాజ్‌కుమార్, సంపత్‌కుమార్, సీతారాం, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కేశవమూర్తి, కార్పొరేటర్ టి.విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement