mandi
-
‘క్షమించండి’ అని వేడుకున్నా.. కంగనాపై ఆగని విమర్శలు
ధర్మశాల : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మూడు వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ‘తప్పుగా మాట్లాడాను. క్షమించండి’ అని వేడుకున్నా అటు విపక్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఆగడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా రద్దు చేసిన మూడూ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాజాగా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఖంఢించారు. కంగనా మాటలు నిరాధారామైనవని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచిని దెబ్బ తీసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోదీ చేస్తున్న మంచిని దెబ్బతీయొద్దు‘‘కంగనా రనౌత్ స్టేట్మెంట్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనికిరాని, నిరాధారమైన,అసంబద్ధమైన ప్రకటనలు, పంజాబ్ రైతులు పంజాబ్, పంజాబీ సంక్షేమం కోసం మోదీ చేస్తున్న అన్ని మంచి పనులను, అందిస్తున్న సంక్షేమాన్ని దెబ్బ తీసేలా కంగనా వ్యవహరిస్తున్నారు’’ అని షెర్గిల్ మండిపడ్డారు. #WATCH | Delhi: On his tweet on actor & BJP MP Kangana Ranaut, party's national spokesperson Jaiveer Shergill says, "I am grateful to the BJP for distancing themself from the comments of Kangana Ranaut. But as a Punjabi, I must say that Kangana Ranaut's consistent rant, useless,… pic.twitter.com/jVa5qKJpe7— TIMES NOW (@TimesNow) September 25, 2024పంజాబ్, పంజాబ్ రైతులతో ప్రధాని మోదీకి ఉన్న బంధం విడదీయరానిది. మా పార్టీ ఎంపీ కంగనా చేసిన బాధ్యతా రహితమైన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆ బంధాన్ని అంచనా వేయొద్దని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలిమంగళవారం కంగనా తన నియోజకవర్గం మండిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ‘రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలి. రైతులే దానిని డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.వ్యాఖ్యలు.. ఆమె వ్యక్తిగతంఆమె మాటలపై బీజేపీ దూరం పాటించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వెల్లడించారు. పార్టీ తరుఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అధికారం లేదని, ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కంగనా క్షమాపణలు చెప్పారు. అయినా బీజేపీ నేతలు మాత్రం కంగనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షెర్గిల్ సైతం ఖండించారు. చదవండి : సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు -
వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలన్న కంగనా.. కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన దురుసు వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఈ చట్టాలు తిరిగి అమలు చేసేందుకు రైతులే డిమాండ్ చెయ్యాలని తెలిపారు.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గం మండిలో ఆమె మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తిరిగి తీసుకురావాలని కోరారు. ‘ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. కానీ మూడు వ్యవసాయ చట్టాలు తిరిగి అమలు చేయాలి. ఇందుకు రైతులు స్వయంగా డిమాండ్ చేయాలి. ఈ చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల నిరసనల కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేశాభివృద్ధిలో రైతులే మూల స్థంభం. వారి ప్రయోజనాల కోసం చట్టాలను తిరిగి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.అయితే కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ ఎప్పటికీ అది జరగనివ్వదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మాట్లాడుతూ.. ‘మూడు నల్ల రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ 750 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము దీనిని ఎప్పటికీ అనుమతించం’ అని పేర్కొన్నారు.కాగా 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు 2020 నవంబరు 26 నుంచి నిరసనలు మొదలుపెట్టారు. ఆందోళనల్లో అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఎట్టకేలకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూ 2021 నవంబరు 19న దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. అనంతరం ఈ నేపథ్యంలో తమ నిరసనలను రైతులు నిలిపివేశారు. -
కంగనా ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీంతో పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. మండి లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కంగనా ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను రద్దు చేయాల్సిందేనని కిన్నౌర్‌కు చెందిన లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను(రామ్ నేగి) వేసిన నామినేషన్ పత్రాన్ని అసంబద్ధంగా తిరస్కరించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కంగనా రనౌత్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆదేశాలు జారీ చేశారు. మండీ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లాయక్ రామ్ నేగి తాను పోటీచేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ, తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు చెల్లవని, అందుకే కంగనా రనౌత్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.లాయక్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారికి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించారు. విద్యుత్, నీరు, టెలిఫోన్ తదితర శాఖల నుంచి ఎలాంటి బకాయిలు లేవని చూపేందుకు ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒకరోజు సమయం ఇచ్చారు. అయితే నేగి ఈ సర్టిఫికెట్లను గడువులోగా సమర్పించినప్పటికీ, రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించినట్లు నేగి ఆరోపిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం.. నేగి దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా తిరస్కరించినట్లు రుజువైతే, మండీ లోక్‌సభ ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి రనౌత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
కంగనకు కానిస్టేబుల్ చెంపదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశా అని చెప్పింది. పంజాబ్‌లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి’’ అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను కలిసి జరిగింది వివరించారు.కానిస్టేబుల్ వాదనేంటి?చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో.. ‘‘ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసినందుకే కంగనను కొట్టా. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారు. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మాది రైతు కుటుంబం. మా అన్న కూడా రైతు. కంగనా అలాగే రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా?’’ అని ఆవేశంగా మాట్లాడారు. -
కంగనా విజయం.. ఆనందంతో తల్లి, సోదరి నృత్యం
బాలీవుడ్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌ను ఓడించారు.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమె విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో మండీ ప్రజలు ఆనందంతో నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కంగనా సోదరి రంగోలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో తల్లితో పాటు డ్యాన్స్ చేస్తున్న రంగోలి కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలలో కంగనా బంధువులు, అభిమానులు కూడా ఉన్నారు. ఈ విజయం తర్వాత కంగనా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దానిలో ఆమె మండీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
లోక్‌సభ ఎలక్షన్స్.. తొలి ప్రయత్నంలోనే గెలుపొందిన బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ (ఫోటోలు)
-
బ్యాగ్ సర్దుకోవాలన్నారు.. కంగనా గెలిచి చూపించింది
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన నటి 'కంగనా రనౌత్' విజయం సాధించింది.కంగనా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై తప్పకుండా విజయం సాధిస్తానని చెబుతూనే ఉంది. అన్నట్టుగానే ఇప్పుడు ఈమె సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో కంగనాను బ్యాగ్ సర్దుకుని బయలుదేరాలి అని ఎగతాళి చేశారు. ఈ వ్యాఖ్యలను కంగనా తీవ్రంగా విమర్శించారు.ఒక మహిళ గురించి ఇంత తక్కువ మాట్లాడటం వల్ల కలిగే పరిణామాలను వారు తప్పకుండా చవిచూడాల్సి వస్తుంది. ఈ రోజు రాబోయే ఫలితాలే దానికి నిదర్శనం అని కంగనా అన్నారు. ప్రారంభం నుంచి బీజేపీ ప్రభుత్వం గెలుస్తుందని, మరోమారు మోదీ ప్రధాని అవుతారని కంగనా చెబుతూనే ఉంది. -
విజయం దిశగా కంగనా? మండీ క్వీన్ ఇంట్లో సంబరాలు
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల ఫలితాల ట్రెండ్ వెలువడుతోంది. రాష్ట్రంలోని హాట్ సీట్ అయిన మండీపైనే అధికంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ హాట్ సీటు నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె తొలిసారి ఎన్నికల పోరులో దిగారు. ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్‌లో వెనుకంజలో ఉన్నా, ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌ను ఆమె అధిగమిస్తూ వస్తున్నారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు. వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్ హిమాచల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ జెండా ఎగురవేయనుంది. మండీ లోక్‌సభ సీటు నుంచి కంగనాకు గెలవనున్నారనే అంచనాలున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఒక సీటు కాంగ్రెస్‌కు దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల ఫలితాల్లో కంగనా విజయపథాన దూసుకుపోతుండటంతో ఆమె ఇంటిలో సంబరాల వాతావరణం నెలకొంది. -
Lok Sabha Election 2024: ఏడో విడతలో 5 హాట్ సీట్లు
సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. చివరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాల్లో ఐదు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ హాట్ సీట్లపై ఫోకస్... వారణాసి... మోదీ మేజిక్ కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించిన ఆయన ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో తొలిసారి ప్రధాని అభ్యరి్థగా ఇక్కడ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా ఓట్లతో నెగ్గిన ఆయన 2019లో మెజారిటీని 4.8 లక్షల ఓట్లకు పెంచుకున్నారు. ఈసారి దాన్ని రికార్డు స్థాయికి పెంచడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ ప్రధానిని ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. రాయ్ ఒకప్పుడు బీజేపీ నేతే కావడం విశేషం. బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన వారణాసిలో 1991 నుంచి బీజేపీ పాతుకుపోయింది. 2004లో కాంగ్రెస్ గెలిచినా మళ్లీ 2009లో బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ విజయం సాధించారు.హమీర్పూర్.. అనురాగ్ విన్నింగ్ షాట్!ఇది బీజేపీ కంచుకోట. 1989 నుంచి ఏకంగా 10సార్లు కాషాయ జెండా ఎగిరింది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. ఆ విజయ పరంపరను ధుమాల్ కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కొనసాగిస్తున్నారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన ఠాకూర్ 2019లో ఏకంగా 4 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అది ఆయనకు వరుసగా నాలుగో విజయం. కాంగ్రెస్ నుంచి సత్పాల్ రైజాదా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. వాటిలో 4 స్థానాలు హమీర్పూర్ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి.మండీ... కింగ్ వర్సెస్ క్వీన్ ఆరుసార్లు సీఎంగా చేసిన దివంగత కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్ రాజ కుటుంబానికి ఈ స్థానం కంచుకోట. ఆయన, భార్య ప్రతిభా సింగ్ ఇద్దరూ ఇక్కడి నుంచి మూడేసిసార్లు గెలవడం విశేషం! 2014, 2019ల్లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ గెలిచి కాంగ్రెస్ హవాకు అడ్డుకట్ట వేశారు. 2021లో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభా సింగ్ స్వల్ప మెజారిటీతో నెగ్గారు. ఈసారి బీజేపీ నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ప్రతిభకు బదులు ఆమె కుమారుడు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆయన ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కంగన, విక్రమాదిత్య పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. కంగనా నాన్ లోకల్ అని, వరదలప్పుడు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదని కాంగ్రెస్ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది.డైమండ్ హార్బర్... అభిషేక్ హవా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 నుంచి తృణమూల్ అడ్డాగా మారింది. గత రెండు ఎన్నికల్లోనూ పార్టీ వారసునిగా చెబుతున్న సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విజయం సాధించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్‌కు బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ (బాబీ) గట్టి పోటీ నేపథ్యంలో ఈసారి విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. అభిషేక్ హ్యాట్రిక్ కొడతారా, డైమండ్ హార్బర్‌పై కాషాయ జెండా ఎగురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సీపీఎం కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.పట్నా సాహిబ్... రవిశంకర్‌కు సవాల్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన పటా్నసాహిబ్ పేరుతో 2008లో ఏర్పాటైన లోక్‌సభ స్థానం. 2009, 2014ల్లో బీజేపీ నుంచి నెగ్గిన బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేశారు. దాంతో ఆయన్ను ఢీకొనేందుకు బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో శత్రుఘ్నపై భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అన్షుల్ అవిజిత్ నుంచి రవిశంకర్ ప్రసాద్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. అన్షుల్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు. కాంగ్రెస్‌తో పాటు దాని భాగస్వామి ఆర్జేడీకి కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకుంది. దాంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కఠిన పరీక్షగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంగనా- విక్రమాదిత్య.. గెలుపోటముల లెక్కలివే?
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానానికి గట్టిపోటీ ఏర్పడనుంది. ఎందుకంటే ఇక్కడ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. సాధారణ ఓటరును తమవైపు తిప్పుకోవడంలో ఏ పార్టీ విజయం సాధిస్తే అది పార్లమెంటు వరకూ చేరుకోగలుగుతుంది.మోదీ మ్యాజిక్, మాజీ సీఎం జైరాం ఠాకూర్ మద్దతు, స్టార్డమ్ మొదలైనవి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌కు కలసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంది. అలాగే అతని తండ్రి, ఆరుసార్లు రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర కె సింగ్ అభిమానులు విక్రమాదిత్యకు అండగా నిలుస్తారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎవరు గెలిచినా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కుతుందనే అంచనాలున్నాయి.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార పర్వంలో పరస్పర మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. విక్రమాదిత్య తండ్రి దివంగత వీరభద్ర సింగ్, తల్లి ప్రతిభా సింగ్‌లు మండీ నియోజక వర్గం నుండి మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 2021 వరకు ఈ నియోజక వర్గంలో జరిగిన 20 ఎన్నికల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ 14 సార్లు, బీజేపీ ఐదుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలుపొందాయి. ప్రస్తుతం మండీ నియోజకవర్గంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులు, కిన్నౌర్, లాహౌల్-స్పితి, సిమ్లాలోని రాంపూర్, చంబాలోని భర్మౌర్ స్థానాల్లో ఆధిక్యత సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మే 24న మండిలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు (బుధవారం) కులు, సుందర్‌నగర్‌లలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. -
Lok Sabha election 2024: కింగ్ వర్సెస్ క్వీన్
హిమాచల్‌ప్రదేశ్‌లో రాజవంశీయుల కంచుకోట అయిన మండి లోక్‌సభ స్థానంలో ‘కింగ్’, ‘క్వీన్’ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. క్వీన్ తదితర సినిమాలతో అలరించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. రాంపూర్ బుషహర్ రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్యసింగ్ కాంగ్రెస్ అభ్యరి్థగా ఆమెతో తలపడుతున్నారు. దాంతో ఇక్కడ విజయం రెండు పారీ్టలకు ప్రతిష్టాత్మకంగా మారింది...తొలి నుంచీ రాజులే... పారీ్టలేవైనా మండిలో రాజకుటుంబీకుల హవాయే కొనసాగుతూ వస్తోంది. రెండు ఉప ఎన్నికలతో సహా 19సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 13సార్లు రాజ కుటుంబీకులే గెలిచారు. కాంగ్రెస్‌కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీ నుంచి కంగనా బరిలో దిగడంతో తనయుడు విక్రమాదిత్య సింగ్‌ను బరిలో దించారు. ఆయన సిమ్లా (రూరల్) నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి వీరభద్రసింగ్ ఏకంగా ఆరుసార్లు రాష్ట్ర సీఎంగా చేశారు. తల్లిదండ్రులిద్దరూ మండి లోక్‌సభ స్థానం నుంచి మూడేసిసార్లు నెగ్గారు. 2021 మండి ఉపఎన్నికలో తల్లి కోసం విక్రమాదిత్య విస్తృతంగా ప్రచారం చేశారు.కంగనాకు ఆదరణ... కంగనాకు ఊహించని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు జైరాం ఠాకూర్ మద్దతుతో పాటు మండి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ బీజేపీ చేతిలోనే ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలు. తొలుత ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత మహేశ్వర్ సింగ్ తర్వాత మనసు మార్చుకున్నారు. కార్గిల్ యుద్ధ వీరునిగా స్థానికంగా బాగా ఆదరణ ఉన్న బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషాల్ ఠాకూర్, కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తదితరులు కంగనాకు మొదటినుంచి మద్దతిస్తున్నారు.పరస్పర విమర్శలు... పరస్పర విమర్శల్లో కంగనా, విక్రమాదిత్య ఇద్దరూ హద్దులు దాటిపోయారు. ఎన్నడూ లేనంతగా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కంగనాకు ఎలాంటి విజన్ లేదని, ఆమె కేవలం పొలిటికల్ టూరిజం చేస్తున్నారని విక్రమాదిత్య ఎద్దేవా చేస్తుంటే, ఆయనను ‘చోటా పప్పు’ అంటూ కంగనా ఎగతాళి చేస్తున్నారు. రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సంయుక్త కిసాన్ మంచ్ విక్రమాదిత్యకు మద్దతిస్తోంది. హిమాచల్‌లో విపత్తు వేళ బాధితుల పట్ల కంగనా సానుభూతి చూపలేదని, మండిని కనీసం సందర్శించలేదని విమర్శలున్నాయి. ఒక్కసారి చాన్సిస్తే నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని కంగనా అంటున్నారు. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరచడం, ఆగిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పర్యాటకాన్నీ ప్రోత్సహిస్తానని హామీ ఇస్తున్నారు. మండీని స్మార్ట్ సిటీగా మారుస్తానని విక్రమాదిత్య వాగ్దానం చేస్తున్నారు.‘మండి’ ప్రస్థానం.. మండిని ఒకప్పుడు మండి మహాసు నియోజకవర్గంగా పిలిచేవారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో 13,77,173 మంది ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏకంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లుండటం విశేషం. వీరభద్రసింగ్ 1971లో తొలిసారి ఇక్కడి నుంచి గెలిచారు. 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేక వెల్లువలో ఓటమి చవిచూసినా 1980లో మళ్లీ విజయం సాధించారు. 1989లో బీజేపీ, 1991, 1996ల్లో కాంగ్రెస్, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాయి. 2004లో ప్రతిభా సింగ్ తొలిసారి గెలిచారు. 2009లో మళ్లీ వీరభద్రసింగ్ విజయం సాధించారు. ఆయన సీఎంగా కావడంతో 2013లో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభాసింగ్ నెగ్గారు. 2014, 2019ల్లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు. 2021లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ ప్రతిభా సింగ్ గెలిచారు. -
‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ సమయంలో పలువురు నేతల ప్రత్యర్థి అభ్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన విక్రమాదిత్య సింగ్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కంగనా వెళుతున్న ఆలయాలను శుద్ధి చేయాల్సి న అవసరం ఉందన్నారు. టకోలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.దేవ్ సమాజానికి చెందిన కంగనా తన సోషల్ మీడియా ఖాతాలో ఆహారపు అలవాట్ల గురించి చెబుతుంటారని, ఇది దేవ్ సమాజంవారికి తలవంపులుగా మారాయన్నారు. ఆమె దేవ్ సమాజపు పరువు తీస్తున్నారని ఆరోపించారు. దేవభూమిలో ఉంటున్నవారికి ఇక్కడి దేవనీతిపై ఎంతో నమ్మకం ఉందన్నారు.తన తండ్రి వీరభద్ర సింగ్ ఆరు సార్లు సీఎం అయ్యారని, అది ప్రజల ఆశీర్వాదమని, కంగనా మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించే బదులు ప్రధాని మోదీని పదవి నుంచి తప్పుకోవాలని కోరాలన్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌కు చాలా ఏళ్లుగా సీఎంగా ఉన్నారని, ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మూడోసారి ప్రధాని కావాలని కలలు కంటున్నారని విక్రమాదిత్య సింగ్ వ్యాఖ్యానించారు.నటి కంగనా ముంబైలో ఒక కాలు, హిమాచల్‌లో ఒక కాలు పెడుతూ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారని, ఆమె అతి త్వరలో మునిగిపోతారన్నారు. కంగనాకు జూన్ 4 తర్వాత తిరిగి ముంబైలో సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. మండి ప్రజలకు నాపైన ఉన్న ప్రేమే ఇంత దూరం తీసుకువచ్చిందని కంగనా పేరొన్నారు.మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. అయితే మండి ప్రాంతంలో ఇప్పటికి కూడా భ్రూణహత్య ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.#WATCH | Himachal Pradesh: Ahead of filing nomination, BJP candidate from Mandi, Kangana Ranaut says "The people of Mandi and their love for me have brought me here. Women in our country are making a mark in every field but incidents of feticide in Mandi were high a few years… pic.twitter.com/MTi9WndTgH— ANI (@ANI) May 14, 2024తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను మండి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.#WATCH | Himachal Pradesh: After filing her nomination, BJP candidate from Mandi Lok Sabha constituency, Kangana Ranaut says "Today I have filed nomination from Mandi LS seat. It is a matter of pride for me to have the opportunity to contest from Mandi...I have been successful in… pic.twitter.com/qh1DnIMi0A— ANI (@ANI) May 14, 2024 -
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేస్తున్నారు. హిమాచల్‌లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్‌లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
Lok Sabha Elections 2024: మండిలో కంగన రోడ్ షో
సిమ్లా: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో శుక్రవారం రోడ్ షో చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘మీ అక్కాచెల్లెళ్లకు, కూతుళ్లకు వెల కట్టేవాళ్లు ఎప్పటికీ మీవాళ్లు కాలేరు. ఇక్కడ తపస్సు చేసిన మాండవ రుషి నుంచి ఈ పట్టణానికి మండి అని పేరొచి్చంది. అలాంటి పేరును కూడా కించపరుస్తున్నారు’ అని రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి అన్నారు. ‘మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది’ అని కంగనాపై సుప్రియ ఇన్‌స్ట్రాగాంలో పెట్టిన పోస్టు దుమారం రేపడం తెలిసిందే. -
నా నామినేషన్ తట్టుకోలేక కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు: కంగనా
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి బీజేపీ తమ లోక్‌సభ అభ్యర్థిగా కంగనా రనౌత్‌ను ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా ఈ బాలీవుడ్ నటి పేరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానికి నటి కౌంటర్ ఇవ్వడం, ఈసీ నోటీసులు.. వంటి పరిణామాలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కంగనా మండిలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మండిలో తన నామినేషన్‌ను జీర్ణించుకోలేక కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీ నుంచి నామినేషన్ వేసిన తరువాత చాలా సంతోషించినట్లు తెలిపారు. తిరిగి సొంత ప్రదేశానికి రావడాన్ని ఎవరూ సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిందువల్లో శక్తిని నిర్మూలించడం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మండిలో ప్రతి ఏడాది మహాశివరాత్రి నాడు అతిపెద్ద మేళా నిర్వహిస్తారని, అలాంటి ప్రాంత మహిళలపై కాంగ్రెస్ నేతలు అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మండికి రిషి మాండవ్య పేరు పెట్టారని, ఋషి పరాశరుడు తపస్సులో కూర్చున్న రిషి మాండవ్య పేరు పెట్టారని, అంతటి పవిత్ర ప్రదేశం మండి అని పేర్కొన్నారు. చౌకబారు నేతల నుంచి ఇంతకన్నా మనం ఏం ఆశించగలమని కంగనా ప్రశ్నించారు. #WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha seat, actor Kangana Ranaut says, "... Congress could not accept my nomination from Mandi. They started doing cheap politics. Their leader Rahul Gandhi talks about destroying the 'shakti' in Hindus. Their spokesperson… pic.twitter.com/D53fySekCz — ANI (@ANI) March 29, 2024 -
కంగనా రనౌత్‌పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. ‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్‌ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్‌కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్‌కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు. ‘స్టార్డమ్తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఇటీవల తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్‌గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్ అన్నారు. -
‘కంగన’కు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాలో బాలీవుడ్ నటి కంగనారనౌత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగనకు కాషాయ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంగన గతంలో ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టు ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. పేదరికం, సమస్యలు, నేరాలు లేని హిమాచల్‌ప్రదేశ్ నుంచి తాను పోటీ చేయబోనని, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సమస్యలున్న రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని గతంలో ఎక్స్‌లో చేసిన పోస్టులో కంగన తెలిపింది. అక్కడి సమస్యలను పరిష్కరించి రాజకీయ రంగంలోనూ రాణి అవుతానని పేర్కొంది. అయితే తాజాగా ఆదివారం (మార్చ్ 24) బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హిమాచల్‌లోని మండి నుంచి కంగనకు పార్టీ టికెట్ దక్కింది. మండి నుంచి బీజేపీ ఎంపీ టికెటివ్వడంపై కంగన స్పందించింది. ఇది తాను గౌరవంగా భావిస్తున్నానని, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాజాగా ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టింది. మండి నుంచి పోటీ చేయనన్న పాత ట్వీట్‌ను చూపిస్తూ తాజా ప్రకటనపై కంగనను సోషల్‌మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా, బీజేపీ ఐదో జాబితాలో కంగనతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు బీజేపీ ఎంపీ టికెట్లు దక్కాయి. Just two years back when somebody said you will fight elections from mandi.. you said u want a state with complexities u can work on and won't fight from mandi now u are eating ur own words 😭 pic.twitter.com/GVJt91faFE — ح (@hmmbly) March 24, 2024 ఇదీ చదవండి.. వరుణ్‌కు మొండిచెయ్యి.. జితిన్‌కు పట్టం -
ఐఐటీ మండీలో ర్యాగింగ్ ఘటన
న్యూఢిల్లీ/మండీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మండీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన 10 మంది సీనియర్లను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరో 62 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్స్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించారు. 20 నుంచి 60 గంటలపాటు సమాజసేవ చేయాలని ఆదేశించినట్లు ఐఐటీ–మండీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ముగ్గురు విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లతోపాటు 10 మంది విద్యార్థులను తరగతి గదులు, వసతి గృహాల నుంచి డిసెంబర్‌దాకా సస్పెండ్ చేశారు. బీ.టెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పరిచయ కార్యక్రమాన్ని ఇటీవల కాలేజీలో నిర్వహించారు. ‘ఈ ఘటనలో 72 మంది సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కేరళలో మండి బిర్యానీ తిని యువతి మృతి.. వారంలో రెండో ఘటన
కేరళలోని కొట్టాయంలో ఇటీవల(డిసెంబర్ 29) ఓ ఈవెంట్లో ఆహారం తిని నర్సు అస్వస్థతకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించినట్లు వార్తలు వినిపించాయి. ఈ ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని 20 ఏళ్ల యువతి మృతిచెందింది. ఈ ఘటన కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించి అనుమానాస్పద కేసుగా అనుమానిస్తున్నారు. వివరాలు.. కాసర్గోడ్ సమీపంలోని పెరుంబళకు ఎందిన అంజు శ్రీ పార్వతి డెసెంబర్ 31న రొమేనియా అనే రెస్టారెంట్ల నుంచి మండి బిర్యానీ (కుజిమంతి/కుళిమంతి) ఆర్డర్ చేసుకుంది. బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలంతో బాలిక తీసుకున్న ఆహారం, ఆమెకు అందించిన చికిత్సపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన హోటళ్ల లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్ఏ) కింద రద్దు చేస్తామని తెలిపారు. చదవండి: Video: బాప్రే..! డ్రెస్ బటన్లలో కొకైన్.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ -
మళ్లీ బీజేపీ వైపే హిమాచల్ ఓటర్లు
మండి: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో మాదిరిగా మళ్లీ బీజేపీకే అధికారమివ్వాలని హిమాచల్ ఓటర్లు నిశ్చయించుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండికి చెందిన బీజేపీ యువజన విభాగం కార్యకర్తలనుద్దేశించి ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. అననుకూల వాతావరణం కారణంగా మండిలోని పడ్డల్ మైదాన్‌లో భారతీయ జనతా యువమోర్చా ఏర్పాటు చేసిన ‘యువ విజయ్ సంకల్ప్ ర్యాలీ’కి హెలికాప్టర్ ద్వారా చేరుకోవడం సాధ్యం కాకపోవడంతో ఆయన ఆన్లైన్లోనే ప్రసంగించారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చాలన్న సంప్రదాయాన్ని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఓటర్లు పక్కనబెట్టారని ఆయన చెప్పారు. అదేవిధంగా, బీజేపీ పాలన, అభివృద్ధి పనులను చూసి హిమాచల్ ఓటర్లు, యువత కూడా మరోసారి బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ యువత ప్రాతినిథ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఫార్మా హబ్‌గా రూపుదాలుస్తోందని, డ్రోన్ విధానం రూపకల్పనలో ముందుందని చెప్పారు. -
తినాలంటే జైలుకి పోవాల్సిందే (ఫోటోలు)
-
జైలు భోజనం ఎప్పుడైనా రుచి చూశారా?.. ఈ ఫొటోలు చూస్తే వెళ్లకుండా ఉండరేమో.!
నిజామాబాద్ : కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త థీమ్‌లతో తమ బిజినెస్‌లను ప్రారంభిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నూతనంగా ఓ మండీ హోటల్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు జైలు థీమ్‌తో ఈ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇనుప చువ్వలతో కూడిన గదులు, బొమ్మ తుపాకులు, బేడీలు ఏర్పాటు చేశారు. అలాగే ఆహారం సప్లయ్ చేసే వారికి ఖైదీ దుస్తులును ఏర్పాటు చేశారు. మండీలోకి వెళ్లగానే ముందుగా ఒక పోలీస్, మరో పక్క ఖైదీ దుస్తులతో స్వాగత ప్రతిమలను ఏర్పాటు చేశారు. జైలు గదుల్లా ఏర్పాటు చేసి అందులో ఆహార ప్రియులకు వడ్డిస్తున్నారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ మండీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. -
నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’
సాక్షి, పహాడీషరీఫ్: నగర వాసులను నోరూరిస్తోంది మండీ బిర్యానీ. ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ బిర్యానీని ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జల్పల్లి, ఎర్రకుంట, షాయిన్‌నగర్, పహాడీషరీఫ్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ మండీ హోటల్స్(మతామ్) పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అరబిక్ భాషలో మండీ అంటే బిర్యానీ అని, మతామ్ అంటే హోటల్ అని అర్థం. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు. చదవండి: మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ ! పౌష్టిక విలువలు పుష్కలం మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు.ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి: బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఒకే పాత్రలో తినడమే ప్రత్యేకత సాధారణంగా హోటల్‌కు వెళ్లి ఎవరి ప్లేట్లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు గ్రూప్‌గా వచ్చి సంయుక్తంగానే ఒకే ప్లేట్లో ఆరగిస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు. నగరంలోని కళాశాలల విద్యార్థులు ఐదారుగురు కలిసి వచ్చి తినడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ హోటళ్లన్నీ అరబ్ స్టైల్‌ను అనుసరిస్తున్నాయి. ఏ మతామ్లోకి వెళ్లినా ఐదారుగురు కలిసి భోజనం చేసేలా చిన్న చిన్న గదులను నిర్మించి వాటిని పరదాలతో అందంగా ముస్తాబు చేసి ఉంచారు. మండీ తయారు చేసే విధానం.. మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్/చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు. అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు. ఇలా బియ్యం ఉడికి మండీగా మారిన అనంతరం దానిలో ఖాజు, బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్, ఖర్జూరను కలుపుతారు. ఉడికిన మాంసం ముక్కలను మంటపై కొద్దిగా కాలుస్తారు. అనంతరం ప్లేట్లో మండీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉంచి వినియోగదారులకు ఇస్తారు. ఆహారాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసేందుకు అరబ్ దేశానికి చెందిన వంట మాస్టర్లనే వినియోగిస్తున్నారు. ప్రధాన రోహదారుల్లో వెలుస్తున్న హోటళ్లు ఎర్రకుంట ప్రధాన రహదారికిరువైపులా వెలిసిన మతామ్లతో ఆ రహదారిని ప్రస్తుతం మండీ రోడ్డుగా పిలుస్తున్నారు. ఎర్రకుంట బారా మల్గీస్ నుంచి మొదలుకొని షాహిన్‌నగర్ హైవే హోటల్ వరకు దాదాపు 30 మండీ మతామ్‌లు వెలిశాయటే ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. -
Bypolls 2021 Results: జాతీయ స్థాయిలో కమలానికి షాక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటుకు గురైంది. పేలవమైన ప్రదర్శనతో కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, దివంగత వీరభద్రసింగ్ సింగ్ సతీమణి ప్రతిభాసింగ్ మండీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. మండీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. గత ఎన్నికల్లో మండీలో దాదాపు 4,05,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ప్రతిభాసింగ్.. కార్గిల్ యుద్ధవీరుడు, బీజేపీ అభ్యర్థి, బ్రిగేడియర్ ఖుషాల్ ఠాకూర్‌ను ఓడించారు. 7,490 ఓట్ల మెజారిటీతో ప్రతిభాసింగ్ విజయం సాధించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సొంత జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో గెలిచి కాంగ్రెస్ తన సత్తా చాటింది. దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతం, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి. దాద్రానగర్ హవేలీలో బీజేపీ అభ్యర్థి మహేష్ గవిట్‌పై శివసేన మహిళా అభ్యర్థి కలాబెన్ దేల్కర్ విజయం సాధించారు. గతంలో గెలిచిన ఖండ్వా లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కాపాడుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌నారాయణ్ సింగ్ పూర్ణీపై బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ విజయం సాధించారు. ఈయన 82వేల మెజారిటీతో గెలిచారు. ఇక హిమాచల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హిమాచల్‌లో ఉప ఎన్నికలు జరిగిన ఫతేపూర్, అర్కీల్లో గతంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఈసారీ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. గతంలో బీజేపీ ఖాతాలో ఉన్న జబ్బల్–కోత్ఖాయ్ స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ మహిళా అభ్యర్థి నీలం సెరాయిక్‌కు కేవలం 2,644 ఓట్లు పడ్డాయి. వచ్చే ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి తాజా ఫలితాలు శరాఘాతంలా తగిలాయి. పశ్చిమ బెంగాల్లో దీదీ హవా పశ్చిమ బెంగాల్లో దిన్హటా, గోసాబా, శాంతిపూర్, ఖర్దాహ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటినీ అధికార తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో తమ సీట్ల సంఖ్యను 215కు పెంచుకుంది. ఈ నాలుగు స్థానాల్లో కలిపి మొత్తంగా తృణమూల్‌కు 75.02 శాతం ఓట్లు పడగా బీజేపీకి కేవలం 14.48 శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 38.13 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఇప్పుడు 15 శాతంలోపునకు పడిపోవడం గమనార్హం. దిన్హటాలో బీజేపీ అభ్యర్థి అశోక్ మండల్‌పై టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహ ఏకంగా 1,64,089 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గోసాబాలో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా మొండల్ బీజేపీ అభ్యర్థిపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచారు. దిన్హటా, గోసాబా, ఖర్దాహ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ విద్వేష రాజకీయాలను ప్రజలు ఉమ్మడిగా ఎలా ఓడిస్తారో ఈ ఫలితాలు చూస్తే తెలుస్తుందని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో చెరొకటి కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో గెలిచాయి. సిండ్గీ స్థానం నుంచి బరిలో నిల్చిన కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ మనగులిని బీజేపీ అభ్యర్థి రమేశ్ భూషనూర్ మట్టికరిపించారు. హంగల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్ కంటే అధికంగా ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానె విజయం సాధించారు. ఈ రెండు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను జేడీ(ఎస్) బరిలో నిలిపినా వారు కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. హింగల్లో ఓటమి.. రాష్ట్ర కొత్త సీఎం బొమ్మైకి కాస్త ఇబ్బందికరంగా మార్చింది. తన నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే హంగల్ ఉంది. మధ్యప్రదేశ్‌లో రెండు ఇటు, ఒకటి అటు రాష్ట్రంలో 3 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్న స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, ఒక స్థానంలో బీజేపీ ఓడి కాంగ్రెస్‌కు అప్పజెప్పింది. ఈసారి జోబాట్(ఎస్సీ), పృథ్వీపూర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా, గతంలో గెలిచిన రాయ్‌గావ్(ఎస్టీ)లో బీజేపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కల్పనా వర్మ గెలిచారు. అస్సాంలో అన్నీ బీజేపీ కూటమికే అస్సాంలో ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కూటమి పార్టీలు తమ వశం చేసుకున్నాయి. భవానీపూర్, మరియానీ, తోరా స్థానాల్లో బీజేపీ గెలిచింది. గోసాయ్‌గావ్, తముల్పూర్లలో యూపీపీఎల్ విజయఢంకా మోగించింది. ఐదు స్థానాల్లో పోలైన మొత్తం ఓట్లలో 54 శాతం బీజేపీ, యూపీపీఎల్లకే పడ్డాయి. ► మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ కూటమి మొత్తం మూడు సీట్లనూ కైవసం చేసుకుంది. రాజబాలా, మేరింగ్కెంగ్ లలో ఎన్పీపీ గెలవగా, మాఫ్లాంగ్ ఈ కూటమిలోని యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో పడింది. ► బిహార్‌లో రెండు చోట్లా జేడీ(యూ) అభ్యర్థులే విజయబావుటా ఎగరేశారు. కుషేశ్వర్ ఆస్తాన్(ఎస్సీ) స్థానం నుంచి అమన్ భూషణ్ హజారీ, తారాపూర్ నుంచి రాజీవ్ కుమార్ సింగ్‌లు గెలిచారు. ► రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ ఒక స్థానాన్ని కాపాడుకోవడంతోపాటు మరో సీటు గెల్చుకుంది. ఈసారి ధరియావాద్, వల్లభ్నగర్ల్లో కాంగ్రెస్ గెలిచింది. ► మహారాష్ట్రలోని నాందేఢ్ జిల్లాలోని దెగ్లూ్లర్(ఎస్సీ) స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జితేశ్ రావ్‌సాహెబ్ గెలిచారు. ► హరియాణా రాష్ట్రంలోని ఎల్లెనాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా విజయం సాధించారు. ► మిజోరంలో తురియల్ స్థానంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) అభ్యర్థి లాల్దాంగ్లియానా గెలిచారు. ► ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు(ఎస్సీ) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 90,533 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి పి.సురేశ్ ఓటమిని చవిచూశారు. ► తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23,855 ఓట్ల మెజారిటీతో గెలిచారు.