న్యూఢిల్లీ/మండీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మండీలో జూనియర్‌లను ర్యాగింగ్ చేసిన 10 మంది సీనియర్లను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరో 62 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్స్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించారు.
20 నుంచి 60 గంటలపాటు సమాజసేవ చేయాలని ఆదేశించినట్లు ఐఐటీ–మండీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ముగ్గురు విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లతోపాటు 10 మంది విద్యార్థులను తరగతి గదులు, వసతి గృహాల నుంచి డిసెంబర్‌దాకా సస్పెండ్ చేశారు. బీ.టెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పరిచయ కార్యక్రమాన్ని ఇటీవల కాలేజీలో నిర్వహించారు. ‘ఈ ఘటనలో 72 మంది సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment