‘కంగన’కు బీజేపీ టికెట్‌.. నటి పాత ట్వీట్‌ వైరల్‌ | Kangana Old Tweet Resurfaces On Contesting From Himachal Pradesh | Sakshi
Sakshi News home page

‘కంగన’కు బీజేపీ టికెట్‌.. నటి పాత ట్వీట్‌ వైరల్‌

Mar 25 2024 10:48 AM | Updated on Mar 25 2024 11:00 AM

Kangana Old Tweet Resurfaced On Contesting From Himachalpradesh - Sakshi

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాలో బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగనకు కాషాయ పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంగన గతంలో ఎక్స్‌(ట్విటర్‌)లో చేసిన పోస్టు ఒకటి తాజాగా వైరల్‌గా మారింది.

పేదరికం, సమస్యలు, నేరాలు లేని హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి తాను పోటీ చేయబోనని, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సమస్యలున్న రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని గతంలో ఎక్స్‌లో చేసిన పోస్టులో కంగన తెలిపింది. అక్కడి సమస్యలను పరిష్కరించి రాజకీయ రంగంలోనూ రాణి అవుతానని పేర్కొంది. అయితే తాజాగా ఆదివారం (మార్చ్‌ 24) బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హిమాచల్‌లోని మండి నుంచి కంగనకు పార్టీ టికెట్‌ దక్కింది. 

మండి నుంచి బీజేపీ ఎంపీ టికెటివ్వడంపై కంగన స్పందించింది. ఇది తాను గౌరవంగా భావిస్తున్నానని, పార్టీ హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాజాగా ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టింది. మండి నుంచి పోటీ చేయనన్న పాత ట్వీట్‌ను చూపిస్తూ తాజా ప్రకటనపై కంగనను సోషల్‌మీడియాలో తెగ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా, బీజేపీ ఐదో జాబితాలో కంగనతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు బీజేపీ ఎంపీ టికెట్లు దక్కాయి.     

ఇదీ చదవండి.. వరుణ్‌కు మొండిచెయ్యి.. జితిన్‌కు పట్టం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement