చండీగఢ్ విమానాశ్రయంలో అనూహ్య ఘటన
వెనువెంటనే ఆ మహిళా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘‘ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశా అని చెప్పింది. పంజాబ్‌లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి’’ అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను కలిసి జరిగింది వివరించారు.
కానిస్టేబుల్ వాదనేంటి?
చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో.. ‘‘ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసినందుకే కంగనను కొట్టా. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారు. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మాది రైతు కుటుంబం. మా అన్న కూడా రైతు. కంగనా అలాగే రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా?’’ అని ఆవేశంగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment