బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఓ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. తాజాగా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌కు గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే..కానిస్టేబుల్‌కి తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్ అంటూ తన పోస్ట్ లో తెలిపారు.
కాగా గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాపై.. కంగనా అనుచిత చేసిన వ్యాఖ్యలను గానూ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢీల్లీ వెళ్తుండగా ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో నటి చెంప చెళ్లుమనిపించారు. ఆ ధర్నాలో తన తల్లి కూడా ఉందని, రైతులను అవమానించినందుకే తాను ఈపని చేసినట్లు కానిస్టేబుల్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆమెపై విచారణ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment