Vishal Dadlani
-
కంగనను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కు జాబ్ ఆఫర్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఓ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. తాజాగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌కు గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే..కానిస్టేబుల్‌కి తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్ అంటూ తన పోస్ట్ లో తెలిపారు. కాగా గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాపై.. కంగనా అనుచిత చేసిన వ్యాఖ్యలను గానూ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢీల్లీ వెళ్తుండగా ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో నటి చెంప చెళ్లుమనిపించారు. ఆ ధర్నాలో తన తల్లి కూడా ఉందని, రైతులను అవమానించినందుకే తాను ఈపని చేసినట్లు కానిస్టేబుల్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆమెపై విచారణ జరుగుతోంది. -
కంగనాను కొట్టిన మహిళకు బంపరాఫర్.. ప్రముఖ సింగర్ పోస్ట్ వైరల్!
ఇప్పుడు దేశవ్యాప్తంగా నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పైనే ఉంది. తాజాగా ఆమెపై సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. కంగనా ఎంపీగా గెలవడంతో చెంపదెబ్బ కొట్టిన మహిళా ఉద్యోగిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే రైతుల ధర్నాను ఉద్దేశించి కంగనా గతంలో కామెంట్స్ చేసినందుకే తాను కొట్టినట్లు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వెల్లడించింది. ఇదే విషయాన్ని కంగనా కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఈ ఘటనపై కంగనా మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నానని, అయితే పంజాబ్‌లో పెరిగిపోతున్న ఉగ్రవాదులను ఏం చేయాలో అర్థం కావడం లేదని వీడియో రిలీజ్ చేసింది. ఈ ఘటనపై అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాబ్ ఇస్తానని హామీతాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందించాడు. కంగనాపై చేయి చేసుకున్న ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు. ఆమెతో తనకు ఒప్పుకుంటే తగిన ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తాను హింసకు ఎప్పుడూ మద్దతు ఇవ్వను.. కానీ ఆమె కోపాన్ని నేను కచ్చితంగా అర్థం చేసుకున్నానని తెలిపారు. సీఐఎస్ఎఫ్ ఆమెపై చర్యలు తీసుకున్నట్లయితే.. తనకు ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నా.. జై హింద్. జై జవాన్. జై కిసాన్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఎవరైనా మీ మదర్ రూ.100కు అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే నువ్వు ఏం చేస్తావ్? ఆయన ప్రశ్నించారు. గతంలో కంగనా రైతుల ధర్నాను ఉద్దేశించి రూ.100 కోసం వచ్చారంటూ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు బిల్కిస్ బానో విషయంలోనూ కంగనా చేసిన పోస్టును షేర్ చేశాడు. -
KK Singer Death: సింగర్ కేకే మృతిపై అక్షయ్, ఆర్ రెహమాన్ ఆవేదన
ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మంగళవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన హాఠాన్మరణం సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. సిద్ధూ మూసేవాలా హత్యోదంతం జరిగిన రెండు రోజులకే మరో ప్రముఖ గాయకుడి అకాల మరణం యావత్ సినిమా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఆయన మృతి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేకే మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కెరీర్లో కేకే కూడా ఒక భాగం. నేను చేసిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో పాటలకు స్వరాన్ని అందించారు. Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK — A.R.Rahman (@arrahman) June 1, 2022 ఆయన ఆలపించిన ‘తూ బోలా జైసే’ పాట వల్లే ఎయిర్ లిఫ్ట్ మూవీ క్లైమాక్స్ చక్కగా వచ్చింది. గత రాత్రి జరిగిన ఘటన నిజంగా షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ సింగర్ విశాల్ దడ్లానీ తీవ్ర దిగ్భ్రాంతీ వ్యక్తం చేస్తున్నారు. కేకే మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆయన వరుస ట్వీట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రలకు, సన్నిహితలకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘స్నేహితులకు, మీడియా మిత్రలకు నా విన్నపం ఏంటంటే. కేకే గురించి మాట్లాడమని గాని, స్టేట్మెంట్ ఇవ్వమని గాని నన్ను అడగకండి ప్లీజ్. ఎందుకంటే ప్రస్తుతం ఆయన గురించి నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. నాకంత శక్తి కూడా లేదు’ అంటూ రాసుకొచ్చారు. A request to friends from the media. Please don't call me for statements about #KK. I can't speak about him in the past tense, I simply don't have the strength for that. 🙏🏽 — VISHAL DADLANI (@VishalDadlani) June 1, 2022 వీరితో పాటు పలువకు బాలీవుడ్ హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా కేకే 1968లో ఢిల్లీలో జన్మించారు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా వంటి తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కలతాలోని నజ్రుల్ మంచ్ వద్ద మంగళవారం రాత్రి ప్రదర్శన ఇచ్చిన అనంతరం కేకే అస్వస్థతకు గురి కాగా, ఆయన్ను సీఎంఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు. కాని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించడం తెలిసిందే. కేకే మృతిని అసహజ మరణం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. So sad to hear about KK’s death. He sang the first song of my first film. A great friend since then. Why so early, KK, why? But you have left behind a treasure of a playlist. Very difficult night. ॐ शांति। Artists like KK never die. pic.twitter.com/MuOdAkEOJv — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 31, 2022 When beautiful voices are stopped in full flow, the universe loses a lifeline. In shock over the tragic deaths of two singing legends #sidhumoosewala & #KK. Numbed at the unfathomable loss 🙏 #RIPLegends. #RIPKK #RIPLegend #KKPassesAway #KrishnakumarKunnath #SidhuMooseWalaDeath pic.twitter.com/j7POeYmMBq — Suniel Shetty (@SunielVShetty) June 1, 2022 View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
కరోనా బారిన పడిన ప్రముఖ సింగర్..
Vishal Dadlani Tested Positve For Covid 19: దేశంలో కరోనా మెలిమెల్లిగా తన పంజా విసురుతోంది. ఏ రోజుకీ ఆరోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ మహామ్మారి విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్లో అనేకమంది ప్రముఖులు కొవిడ్ బారిన పడ్డారు. ఈ కరోనా పాజిటివ్ వచ్చిన తారల జాబితాలోకి తాజాగా ప్రముఖ బీటౌన్ సింగర్ విశాల్ డడ్లానీ చేరాడు. తనకు కొవిడ్ 19 సోకినట్లు సోషల్ మీడియా వేదకిగా శుక్రవారం (జనవరి 7) వెల్లడించాడు. తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా ఫొటో షేర్ చేశాడు విశాల్ డడ్లానీ. ఈ పోస్ట్‌లో 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కరోనా బారిన పడ్డాను. నాకు తెలిసినంత వరకూ మాస్క్ లేకుండా నేను ఎవరినీ కలవలేదు. శానిటైజ్ చేయని వస్తువులను తాకలేదు. కరోనా నిబంధనలు పాటించాను. గత వారం 10 రోజులుగా నన్ను సంప్రదించినవారు కొవిడ్ పరీక్షలు చేంయుచుకోండి' అని విశాల్ తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన విశాల్ అభిమానులు, పరిశ్రమకు చెందినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'గెట్ వెల్ సూన్' అని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by VISHAL (@vishaldadlani) ఇదీ చదవండి: బుల్లితెర హీరోయిన్‌కు కొవిడ్.. అవి నమ్మొద్దని సలహా -
‘రియా కోసం అతడి గుండె రక్తమోడుతోంది’
ముంబై: బాలీవుడ్ ప్రముఖ సింగర్ విశాల్ దద్లానీపై గాయని సోనా మహాపాత్ర విమర్శలు గుప్పించారు. కాలానికి, మనుషులకు తగ్గట్లుగా ఆయన మనసు మారిపోతూ ఉంటుందని వంగ్యాస్త్రాలు సంధించారు. కాగా నటి తనూ శ్రీ దత్తా నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణ నేపథ్యంలో బాలీవుడ్లో మీటూ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోనా సహా పలువురు ఆమె మద్దతుగా నిలబడ్డారు. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ జడ్జి, సంగీత దర్శకుడు అను మాలిక్ తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అనూ మాలిక్‌కు వ్యతిరేకంగా సోనా బలంగా తన గొంతు వినిపించారు. బాధితుల పక్షాన నిలబడ్డారు. అయితే అనూ మాలిక్‌తో అదే వేదికను పంచుకున్న సింగర్ విశాల్ దద్లానీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన విషయం విదితమే. అనేక పరిణామాల అనంతరం వీరిద్దరికి బెయిలు లభించగా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఈ విషయం గురించి గురువారం ట్విటర్లో ప్రస్తావించిన విశాల్.. ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్కాతమ్ముళ్ల అందమైన భవిష్యత్తును నాశనం చేశారంటూ మండిపడ్డాడు. తన రాజకీయ గురువులను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా చేశాడంటూ ఆరోపించాడు.(చదవండి: ‘బెల్ట్ తీసి కొట్టేవాడు.. వేళ్లు విరిచేవాడు’) ఈ విషయంపై స్పందించిన ఓ నెటిజన్.. గురువుల మెప్పు పొందేందుకు మీటూ ఉద్యమం గురించి నోరు తెరవని నువ్వు ఇప్పుడిలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుమాలిక్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని మీకు డబ్బు గురించి ఆలోచనే తప్ప ఇంకేమీ పట్టదంటూ ఘాటుగా విమర్శిస్తూ సోనా మహాపాత్రను ట్యాగ్ చేశారు. ఇందుకు బదులుగా.. ‘‘ మన అవసరాన్ని, సౌలభ్యాన్ని బట్టి ఏది సరైంది, ఏది కాదు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. రియా చక్రవర్తి కోసం దద్లానీ గుండె రక్తమోడుతోంది. కానీ ఇండియన్ ఐడల్‌లో ఆయన సహచరుడు అనూ మాలిక్ గురించి ఎంతో మంది మహిళలు ఆరోపణలు చేసినప్పుడు మాత్రం ఎలాంటి న్యాయన్యాయాలు గుర్తుకురాలేదు’’ అంటూ విమర్శించారు. “What is right is often forgotten by what is convenience.” Dadlani’s heart bleeds for Rhea Chakraborty & 🤟🏾🙏🏾.None of this justice bent came into play for Vishal when endless women called out his #IndianIdol colleague Anu Malik. @IndiaMeToo .#WontBeForgotten #India #WillRemember https://t.co/tHwsaXKdhC — Sona Mohapatra (@sonamohapatra) December 10, 2020 -
పోలీసులను పిలవాలనుకున్నా..
న్యూఢిల్లీ : సోనీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 11 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న నేహాకక్కర్‌ను కంటెస్టెంట్ ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న విశాల్ దడ్లాని తాజా ఎపిసోడ్‌పై ట్విటర్లో ఘాటుగా స్పందించారు. 'కంటెస్టెంట్ చేసిన పనికి పోలీసులను పిలుద్దామని నేహాకక్కర్కు చెప్పాను. కానీ ఆమె ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపోవాలంటూ తనను వారించిందని' పేర్కొన్నాడు. అయితే కంటెస్టెంట్ చేసిన పనిని నెటిజన్లు తీవ్రంగా తప్పు పడుతూ విశాల్ దడ్లానికి వరుస ట్వీట్లు చేశారు. 'విశాల్ జీ ! మీరు కంటెస్టెంట్ చేసిన పనికి అతని చెంపను పగలగొట్టాల్సింది. ఆ పని చేసేందుకు అతనికి ఎంత దైర్యం, అతన్ని ఊరికే వదిలేయద్దు అంటూ' ట్వీట్ చేశాడు. 'నిజంగా కంటెస్టెంట్ తన హద్దు మీరి ప్రవర్తించాడని, ఇటువంటి చర్యలు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని' మరొకరు ట్వీట్ చేశారు. 'కేవలం టీఆర్పీ రేటింగ్ కోసమే షో నిర్వాహకులు కావాలనే కంటెస్టెంట్‌తో ఆ పని చేయించారని, ముందు షో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే బాగుండేదని' పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. వీటిపై విశాల్ దడ్లాని స్పందిస్తూ.. కంటెస్టెంట్ చేసిన పనికి పోలీసులను పిలవాలని చెప్పానని, నేహాకక్కర్ అందుకు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. కానీ అతనికి మానసిక చికిత్స అవసరం ఎంతో ఉందని తెలిపాడు. మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలని షో నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. చదవండి : (వైరల్ : జడ్జిని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్) I suggested that the Police be called, but Neha decided to let the guy off the hook. He definitely needs psychiatric help, and we will try to help him get that, if we can. #IndianIdol11 https://t.co/CiCLy7u787 — VISHAL DADLANI (@VishalDadlani) October 20, 2019 -
భారత బిగ్గెస్ట్ సీఈవోలు వారే : ఐశ్వర్య రాయ్
న్యూఢిల్లీ : 'హౌజ్ వైఫ్' అనే పదం వినడానికి ఎంత తేలికగా ఉన్నా... ఆ బాధ్యతలు నిర్వర్తించడం ఎంత కష్టమో ప్రతి ఒక్క అమ్మాయికి తెలిసే ఉంటుంది. ఇంటి బాధ్యతల్ని ఎప్పడికప్పుడూ నెరవేరుస్తూ.. పిల్లలకు, భర్తకు, అత్తామామలకు ఎలాంటి లోటు రాకుండా రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది. చాలా మంది మగాళ్లు హౌజ్ వైఫేగా అంటూ తేల్చి పడేస్తూ ఉంటారు. కానీ వారే కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరించే కంటే ఎక్కువ బాధ్యతలు వ్యవహరిస్తారట. తాజాగా ఈ విషయాన్ని ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒప్పుకున్నారు. భారత్‌లో అతిపెద్ద సీఈవోలు హౌజ్ వైఫ్‌లేనని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. తన తాజా సినిమా ఫన్నీ ఖాన్ ప్రమోట్ చేసుకోవడానికి ఓ డ్యాన్స్ షోలో పాల్గొన ఆమె ఈ ప్రకటన చేశారు. ‘హౌజ్ వైఫ్‌లే భారత్‌లో అతిపెద్ద సీఈవోలు. వారికి మనం అత్యంత ఉన్నతమైన గౌరవం, ప్రశంస ఇవ్వాలి. మన దేశంలో, ప్రపంచంలో ఉన్న హౌజ్ వైఫ్‌లందరికీ ఎంతో గౌరవంతో, ప్రశంసతో చేతులెత్తి నమస్కరిస్తున్నా’ అని తెలిపారు. ఐశ్వర్య రాయ్ చేసిన ఈ ప్రకటనకు, సింగర్ విశాల్ డాడ్లని కూడా మద్దతిచ్చారు. ఆ డ్యాన్స్ షోలో ఆయన కూడా జడ్జి. ఐశ్వర్య రాయ్ కూడా మిగతా హౌజ్‌వైఫ్‌ల మాదిరి ప్రపంచంలో అత్యంత సుందరమైన మహిళల్లో ఒకరు అని విశాల్ కొనియాడారు. ‘నా మ్యూజిక్ టూర్ల సమయంలో ఒకసారి అమితాబ్ జీ మమ్మల్ని డిన్నర్ పార్టీకి ఆహ్వానించారు. ప్రపంచంలో అత్యంత సుందరి అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆమె స్వహస్థాలతో మాకు డిన్నర్ వడ్డించింది. ఆ పార్టీకి సిబ్బంది అంతా వెళ్లాం. ప్రతి ఒక్కరికీ ఆమెనే సర్వ్ చేసింది. మేము అందరం తిన్న తర్వాతనే, ఐశ్వర్య భోజనం చేసింది’ అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఐశ్వర్య తన వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల తన ఆరేళ్ల కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్ ట్రిపులో పాల్గొనడమే. ఐశ్వర్య వర్క్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తన కూతురు కోసం కూడా కాస్త సమయాన్ని వెచ్చిస్తూ.. ఆరాధ్యతో కలిసి ఈఫిల్ టవర్, డిస్నీల్యాండ్ సందర్శించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి కూడా. 2007లో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 20న ఈ కపుల్ తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తన లేటెస్ట్ మూవీ ఫన్నీ ఖాన్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నెక్ట్స్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ నటించబోతున్నారు. -
33సార్లు క్షమాపణ చెప్పాడు!
న్యూఢిల్లీ: జైన దిగంబార సాధువు తరుణ్ సాగర్ హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడంపై ట్విట్టర్లో విమర్శలు చేసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ ఊహించనిరీతిలో వివాదాలకు కేంద్రమయ్యాడు. ట్విట్టర్లో అతడి విమర్శలు దుమారం రేపాయి. జైన దిగంబర బాబాను విమర్శిస్తావా? అంటూ చాలామంది ఆయనను వేలెత్తిచూపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం విశాల్ విమర్శలను ఖండించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సహా చాలామంది నెటిజన్లకు ఆయన క్షమాపణ చెప్పారు. ఏ మతం వారిని కించపరచడం, ఏ మతవిశ్వాసాలను గాయపరచడం తన ఉద్దేశం కాదని, మతాన్ని పరిపాలనను జోడించకూడదనే ఉద్దేశంతోనే తాను వ్యాఖ్యలు చేశానని విశాల్ వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలు జైనుల మనోభావాలను దెబ్బతీస్తే.. అందుకు మనస్ఫూర్తిగా క్షమించాలని వినమ్రంగా కోరాడు. ట్విట్టర్లో తనను విమర్శించిన చాలామందికి విశాల్ క్షమాపణలు చెప్తూపోయారు. తాను చేసిన ఒక్క ట్వీట్ మీదనే ఆయన ఏకంగా 33సార్లు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విశాల్ ప్రకటించాడు. ఇన్నాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారుడిగా, కార్యకర్తగా విశాల్ దద్లానీ కొనసాగారు. ఏకంగా కేజ్రీవాల్ తనను తప్పుపట్టడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటానని విశాల్ తెలిపారు. మరోవైపు ప్రముఖ జైన దిగంబర ముని తరుణ్ సాగర్ విశాల్ దద్లానీ విమర్శలపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అసమ్మతి తెలిపే హక్కు ఉంటుందని, విమర్శలను తాను పట్టించుకోబోనని తెలిపారు. -
క్షమాపణ చెప్పిన గాయకుడు
ముంబై: వివాదంలో చిక్కుకున్న గాయకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్) నాయకుడు విశాల్ దద్లానీ రాజకీయాల నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించారు. జైన దిగంబర బాబా తరుణ్ సాగర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ‘నేను చేసిన వ్యాఖ్యలతో నా జైను స్నేహితులు, అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ మనోభావాలు దెబ్బతిన్నాయి. క్రియాశీల రాజకీయాలకు, కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాన’ని విశాల్ ట్వీట్ చేశారు. హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 26న దిగంబర బాబా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిపై విశాల్ ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. శాసనసభను ఉద్దేశించి ప్రసంగించిన దిగంబర బాబా ఫొటో పోస్ట్ చేసి.. ‘ఇలాంటి వాళ్లకు ఓటు వేస్తే... ఇలాంటి న్యూసెన్స్ కు బాధ్యులవుతారు. మంచి రోజులు రావు. చెడ్డ రోజులే వస్తాయ’ని ట్వీట్ చేశాడు. విశాల్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ తప్పుబట్టారు. తరుణ్ సాగర్ చాలా మంచి గురువు అని, ఆయన జైనులకే కాదు అందరికీ గురువు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. It feel bad that I hurt my Jain friends & my friends @ArvindKejriwal & @SatyendarJain .I hereby quit all active political work/affiliation. — VISHAL DADLANI (@VishalDadlani) 27 August 2016