కంగనాను కొట్టిన మహిళకు బంపరాఫర్‌.. ప్రముఖ సింగర్‌ పోస్ట్‌ వైరల్! | Bollywood singer offers to CISF personnel who slapped Kangana Ranaut | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: 'రూ.100 కే వస్తుందంటే నువ్వేం చేస్తావ్'.. కంగనాపై ప్రముఖ సింగర్‌ పోస్ట్‌!

Jun 7 2024 3:47 PM | Updated on Jun 7 2024 3:58 PM

Bollywood singer offers to CISF personnel who slapped Kangana Ranaut

ఇప్పుడు దేశవ్యాప్తంగా నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పైనే ఉంది. తాజాగా ఆమెపై సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిపోయింది.  కంగనా ఎంపీగా గెలవడంతో చెంపదెబ్బ కొట్టిన మహిళా ఉద్యోగిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే రైతుల ధర్నాను ఉద్దేశించి కంగనా గతంలో కామెంట్స్ చేసినందుకే తాను కొట్టినట్లు సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వెల్లడించింది. 

ఇదే విషయాన్ని కంగనా కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఈ ఘటనపై కంగనా మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నానని, అయితే పంజాబ్‌లో పెరిగిపోతున్న ఉగ్రవాదులను ఏం చేయాలో అర్థం కావడం లేదని వీడియో రిలీజ్ చేసింది. ఈ ఘటనపై అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

జాబ్ ఇస్తానని హామీ

తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందించాడు. కంగనాపై చేయి చేసుకున్న ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్‌ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు. ఆమెతో తనకు  ఒప్పుకుంటే తగిన ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. 

తాను హింసకు ఎప్పుడూ మద్దతు ఇవ్వను.. కానీ ఆమె కోపాన్ని నేను కచ్చితంగా అర్థం చేసుకున్నానని తెలిపారు. సీఐఎస్‌ఎఫ్‌ ఆమెపై చర్యలు తీసుకున్నట్లయితే.. తనకు ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నా.. జై హింద్. జై జవాన్. జై కిసాన్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఎవరైనా మీ మదర్‌ రూ.100కు అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే నువ్వు ఏం చేస్తావ్? ఆయన ప్రశ్నించారు. గతంలో కంగనా రైతుల ధర్నాను ఉద్దేశించి రూ.100 కోసం వచ్చారంటూ కామెంట్స్‌ చేసింది. ఒకప్పుడు బిల్కిస్ బానో విషయంలోనూ కంగనా చేసిన పోస్టును షేర్ చేశాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement