Vishal Dadlani Tested Positve For Covid 19: దేశంలో కరోనా మెలిమెల్లిగా తన పంజా విసురుతోంది. ఏ రోజుకీ ఆరోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ మహామ్మారి విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌లో అనేకమంది ప్రముఖులు కొవిడ్ బారిన పడ్డారు. ఈ కరోనా పాజిటివ్ వచ్చిన తారల జాబితాలోకి తాజాగా ప్రముఖ బీటౌన్ సింగర్ విశాల్ డడ్లానీ చేరాడు. తనకు కొవిడ్ 19 సోకినట్లు సోషల్ మీడియా వేదకిగా శుక్రవారం (జనవరి 7) వెల్లడించాడు. తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా ఫొటో షేర్ చేశాడు విశాల్ డడ్లానీ.
ఈ పోస్ట్‌లో 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కరోనా బారిన పడ్డాను. నాకు తెలిసినంత వరకూ మాస్క్ లేకుండా నేను ఎవరినీ కలవలేదు. శానిటైజ్ చేయని వస్తువులను తాకలేదు. కరోనా నిబంధనలు పాటించాను. గత వారం 10 రోజులుగా నన్ను సంప్రదించినవారు కొవిడ్ పరీక్షలు చేంయుచుకోండి' అని విశాల్ తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన విశాల్ అభిమానులు, పరిశ్రమకు చెందినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'గెట్ వెల్ సూన్' అని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కామెంట్ చేశాడు.
ఇదీ చదవండి: బుల్లితెర హీరోయిన్‌కు కొవిడ్.. అవి నమ్మొద్దని సలహా
Comments
Please login to add a commentAdd a comment