Chandigarh airport
-
కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ : ఆమె బెంగళూరుకు బదిలీ
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న వివాదంలో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్విందర్ కౌర్‌కు ఊరట లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఉపసంహరించుకున్నఅనంతరం, బెంగళూరులోని CISF రిజర్వ్ బెటాలియన్‌కు బదిలీ చేశారు.చంఢీగడ్ ఎయిర్‌పోర్టులో రైతు ఉద్యమాన్ని కించపర్చారంటూ సీఐఎస్ఎఫ్ జవాను కుల్విందర్ కౌర్ కంగనాను చెంప దెబ్బ కొట్టారు. ఈ కేసులో ఆమె సస్పెన్షనకు గురైంది. తాజాగా ఆమెను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం.కాగా 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పార్లమెంట్‌కు ఎంపికైన కంగనాను గత నెలలో చంఢీగడ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కౌర్ చెంపదెబ్బ కొట్టడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అంతర్గత విచారణ తర్వాత కౌర్‌పై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో దాడి కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో విమర్శలతో పాటు ఆమెకు మద్దతు కూడా లభించింది. ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, తదితరులు ఆఫర్లు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కంగనను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కు జాబ్ ఆఫర్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఓ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. తాజాగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌కు గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే..కానిస్టేబుల్‌కి తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్ అంటూ తన పోస్ట్ లో తెలిపారు. కాగా గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాపై.. కంగనా అనుచిత చేసిన వ్యాఖ్యలను గానూ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢీల్లీ వెళ్తుండగా ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో నటి చెంప చెళ్లుమనిపించారు. ఆ ధర్నాలో తన తల్లి కూడా ఉందని, రైతులను అవమానించినందుకే తాను ఈపని చేసినట్లు కానిస్టేబుల్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆమెపై విచారణ జరుగుతోంది. -
కంగనకు కానిస్టేబుల్ చెంపదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశా అని చెప్పింది. పంజాబ్‌లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి’’ అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను కలిసి జరిగింది వివరించారు.కానిస్టేబుల్ వాదనేంటి?చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో.. ‘‘ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసినందుకే కంగనను కొట్టా. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారు. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మాది రైతు కుటుంబం. మా అన్న కూడా రైతు. కంగనా అలాగే రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా?’’ అని ఆవేశంగా మాట్లాడారు. -
ఎయిర్‌పోర్ట్‌లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. చండీఘర్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్‌గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్‌లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను కుల్వీందర్ కౌర్‌గా గుర్తించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024 -
కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది!
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై గురువారం దాడి జరిగింది. ఛండీగఢ్ ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది ఒకరు ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల్ని, రైతు ఉద్యమాన్ని అవమానించేలా కంగనా మాట్లాడిందంటూ సదరు సిబ్బంది దాడి చేసినట్లు సమాచారం. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను కుల్వీందర్ కౌర్‌గా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్‌కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారుల్ని కలిసి కంగన ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ నిమిత్తం సీఐఎస్ఎప్ కమాండెంట్ కార్యాలయానికి తరలించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. This is Kulwinder Kaur, the CISF officer posted at Chandigarh airport who slapped actor and BJP MP #KanganaRanaut today. pic.twitter.com/fTiQzwrf3x— هارون خان (@iamharunkhan) June 6, 2024 -
ఆ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు.. మోదీ కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో వెల్లడించారు. ‘గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా.. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం.’ అని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సెప్టెంబర్ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మన్ కీ బాత్‌లో భాగంగా వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మాట్లాడారు మోదీ. వాతావరణ మార్పు అనేది జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పించారు మోదీ. ఆయన దేశ మహోన్నతమైన కుమారుడిగా పేర్కొన్నారు. ఇటీవలే భారత్‌కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమన్నారు. టాస్క్‌ఫోర్స్ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. మరోవైపు.. అమరవీరుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న చూపు చూస్తోందని చెప్పేందుకే బీజేపీ పేరు మార్పునకు పూనకుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం భగత్ సింగ్ గ్రామం ఖట్కార్ కలాన్‌లోనే నిర్వహించారు. భగత్‌సింగ్ ఉపయోగించిన పసుపు టర్బన్స్‌ను సూచిస్తూ ప్రాంగణం మొత్తం పసువు రంగులతో నింపేశారు. అలాగే.. మార్చి 23న భగత్ సింగ్ వీరమరణం పొందిన రోజును సెలవుదినంగా ప్రకటించారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్ ఓకే -
తీవ్రమైన దుమ్ము.. విమానాలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: దుమ్ము, ఇసుక తుపాన్లతో దేశ రాజధాని, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. వాతావరణంలో దట్టమైన దుమ్ము పొరలు అలుముకోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా, వెలుతురు లేని కారణంగా ఛండీగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలను నిలిపివేశారు. అటు కాలుష్యంతో నిండిన గాలిని పీల్చుకొని ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రాజస్థాన్‌లో మొదలైన ఇసుక తుపాన్లతో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని దుమ్ము కొట్టుకు పోతోంది. మితిమీరిన కాలుష్యంతో ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని వాతావరణంలో ప్రమాదకర రీతిలో పీఎం (నలుసు పదార్థం) స్థాయులు ఉన్నాయనీ, ఇటువంటి గాలిని పీల్చితే శ్వాసకోస వ్యాధుల బారిన పడే అవకాశం ఉందనీ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దనీ ప్రజలకు సూచించింది. ఎండలు మండిపోతుండడంతో మరో వారంపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దుమ్ము, ధూళితో ఉక్కిరి బిక్కిరవుతున్న రాజధాని ప్రజలు 33 నుంచి 42 డిగ్రీల ఎండవేడితో చెమటలు కక్కుతున్నారు. కాగా, అక్కడ సాధారణం కన్నా 5 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
కొత్త టర్మినల్ ప్రారంభించిన మోదీ
చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చండీగఢ్ విమానాశ్రయంలో కొత్త టర్మనల్ ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందించనున్న ఈ టర్మినల్‌ను దేశానికి అంకితం చేశారు. కొత్త టర్మినల్ ద్వారా అటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని చెప్పారు. మొత్తం రూ.939 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్‌ను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) , చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ భాగస్వామ్యంలో నిర్మించాయి. దీని నిర్వహణ బాధ్యతలను మాత్రం చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ చూసుకోనుంది. ఈ టర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి, కేంద్రమంత్రి పీఅశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, మనోహర్ లాల్ ఖత్తర్ పాల్గొన్నారు.