బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న వివాదంలో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్విందర్ కౌర్‌కు ఊరట లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఉపసంహరించుకున్నఅనంతరం, బెంగళూరులోని CISF రిజర్వ్ బెటాలియన్‌కు బదిలీ చేశారు.
చంఢీగడ్ ఎయిర్‌పోర్టులో రైతు ఉద్యమాన్ని కించపర్చారంటూ సీఐఎస్ఎఫ్ జవాను కుల్విందర్ కౌర్ కంగనాను చెంప దెబ్బ కొట్టారు. ఈ కేసులో ఆమె సస్పెన్షనకు గురైంది. తాజాగా ఆమెను బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ చేయడం గమనార్హం.
కాగా 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పార్లమెంట్‌కు ఎంపికైన కంగనాను గత నెలలో చంఢీగడ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కౌర్ చెంపదెబ్బ కొట్టడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అంతర్గత విచారణ తర్వాత కౌర్‌పై ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో దాడి కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో విమర్శలతో పాటు ఆమెకు మద్దతు కూడా లభించింది. ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, తదితరులు ఆఫర్లు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment