ముంబై: బాలీవుడ్ నటి, బీజేపీఎంపీ కంగనా రనౌత్‌ను మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ‘కొందరు ఓట్లు వేస్తారు. కొందరు చెంపదెబ్బలు కొడతారు. కంగనా విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆమెపై నాకు సానుభూతి ఉంది.
ఆమె ఇప్పుడు ఒక ఎంపీ. ఎంపీపై దాడి జరగకూడదు. ఆ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ చెబుతున్నట్లు ఆమె తల్లి గనుక రైతుల ధర్నాలో ఉంటే కోపం వస్తుంది. రైతుల పోరాటానికి వ్యతిరేకంగా కంగన మాట్లాడింది. నాకు రైతుల పట్ల గౌరవం ఉంది’అని సంజయ్‌రౌత్ అన్నారు.
ఛండీగఢ్ ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా కంగనా రనౌత్‌ను సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం సంచలనం రేపింది. కంగన రైతుల పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడినందునే తాను కొట్టినట్లు కానిస్టేబుల్ తెలిపింది.
కాగా, గతంలో మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉన్నప్పుడు కంగన శివసేనకు వ్యతిరేకంగా తరచూ సవాళ్లు విసురుతూ ఉండేది. ఒక దశలో ముంబైలోని కంగనా స్టూడియో భవనాన్ని మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ కూల్చివేశారు.
Comments
Please login to add a commentAdd a comment