బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్ మహిళ కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. చండీఘర్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్‌గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్‌లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను కుల్వీందర్ కౌర్‌గా గుర్తించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024
Comments
Please login to add a commentAdd a comment