కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ.. కుల్విందర్‌ కౌర్‌ అరెస్ట్‌ CISF constable who allegedly slapped Kangana Ranaut has been arrested. Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ.. కుల్విందర్‌ కౌర్‌ అరెస్ట్‌

Published Fri, Jun 7 2024 3:48 PM | Last Updated on Fri, Jun 7 2024 5:15 PM

Kulwinder Kaur Arrested Who Slapped Kangana Ranaut

బీజేపీ ఎంపీ కంగనా రౌనత్‌ను కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లో కంగనను చెంపదెబ్బ కొట్టిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ పోలీస్‌ శాఖ సస్పెండ్‌ చేసింది. ఆపై ఆమెను అరెస్ట్‌ చేసింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం..బీజేపీ నేత, మండీ లోక్‌సభ ఎంపీ కంగన రనౌత్‌ చండీగఢ్‌ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగు పెట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్తున్న కంగనను కుల్విందర్‌ కౌర్‌ చెంప పగలగొట్టింది. 

రైతు చట్టాలకు వ్యతిరేకంగా
2020లో మోదీ ప్రభుత్వం రైతుల మేలు కోసమేనని చెబుతూ మూడు వ్యవసాయ చట్టాల్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చెపట్టారు. దీంతో తలొగ్గిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.

సింగర్‌ రిహానా మద్దతు
ఆ సమయంలో ప్రముఖ సింగర్‌ రిహానా భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించారు. ‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’ అంటూ రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ ప్రచురించిన కథనాన్ని రిహానా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ నెట్టింట్లో ట్రెండ్‌ అవ్వడంతో పలువురు ప్రముఖ  ఆమెకు మద్దతుగా నిలిచారు.  

నోరు పారేసుకున్న కంగనా రనౌత్‌
రిహానా ట్వీట్‌పై కంగనా రనౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదు ఉగ్రవాదులు. దేశాన్ని ముక్కలు చేసి చైనా కాలనీగా మార్చాలని అనుకుంటున్నారు. అందుకే దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. మేం మాదేశాన్ని అమ్ముకోవాలనుకోవడం లేదు’ అంటూ రిహానాపై కంగానా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ట్వీట్‌ చేశారు.

టైమ్‌ మ్యాగజైన్‌లో బిల్కిస్‌
దీనికి తోడు టైమ్‌ మ్యాగజైన్‌ ప్రతి ఏటా ఆయా దేశాలకు 100మంది అత్యంత ప్రభావశీలురు జాబితాను విడుదల చేస్తోంది. 2019లో టైమ్‌ మ్యాగజైన్‌ .. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సమీపంలోని షషీన్‌ బాగ్‌లో వందలాది మహిళలు 100 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ ఉద్యమాన్ని షషీన్‌ బాగ్‌ దాదీగా పేరొందిన 82 ఏళ్ల (నాడు) బిల్కిస్‌ ముందుండి నడిపించారు. 

బిల్కిస్‌ను ప్రస్తావిస్తూ 
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో బిల్కిస్‌ పాల్గొన్నారని,  ఆమె రోజువారీ కిరాయి ప్రాతిపదికన అందుబాటులో ఉంటారని ఓ ట్విటర్‌ యూజర్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఉద్యోమంలో పాల్గొనందుకు ఆమెకు ఆహారం, బట్టలు, అవార్డ్‌లు, పాకెట్‌ మనీ ఇస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆట్వీట్‌ను కంగాన రీట్వీట్‌ చేస్తూ “హ హ హ ఆమె అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్‌లో కనిపించిన అదే దాదీ. ఆమె రూ.100 రూపాయలకే ధర్నాలో పాల్గొన్నారని అర్ధం వచ్చేలా ట్వీట్‌ చేశారు.  

ప్రతీకారం తీర్చున్న కుల్విందర్‌ కౌర్‌
ఈ నేపథ్యంలో నాడు కంగానా చేసిన వ్యాఖ్యలపై సీఐఎస్‌ఫ్‌ కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ప్రతీకారం తీర్చున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్‌ ఎయిర్‌ పోర్ట్‌లోకి వచ్చిన కంగనాను కుల్విందర్‌ కౌర్‌ చెంప చెళ్లుమనిపించారు.

అందుకే కొట్టా
అనంతరం రైతులను కంగనా అవమానించినందుకే ఆమె చెంపపై కొట్టినట్లు కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులు రూ.100 కోసం అక్కడ కూర్చున్నారని ఆమె (కంగనా) స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటుందా? ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ కూడా అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది అని రైతు కుటుంబానికి చెందిన కౌర్ అన్నది. కాగా, కంగనాను కొట్టినందుకు సీఐఎస్‌ఎఫ్‌ విభాగం ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. విధుల నుంచి తొలగించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement