
న్యూఢిల్లీ: తరుచు కాంగ్రెస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి అండగా నిలుస్తూ వస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్.. ఎట్టకేలకు రాహుల్ గాంధీకి జై కొట్టారు. ఆపరేషన్ సింధూర్ అంశం దగ్గర్నుంచి కాంగ్రెస్ ఒకటి చెబితే, శశిథరూర్ వ్యాఖ్య మరొకటిగా ఉండేది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్‌లో జరిగిన చర్చలో సీనియర్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు విపక్ష కాంగ్రెస్.
అదే సమయంలో కేంద్రానికి పదే పదే వత్తాసు పలుకుతున్న శిథరూర్ వరుస స్టేట్‌మెంట్లతో కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేశారు కూడా. అయితే తాజాగా విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అండగా నిలిచారు శశిథరూర్. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ చెబుతున క్రమంలో శశిథరూర్ మాత్రం రాహల్‌కే జై కొట్టడం కాస్త ఆసక్తిని పెంచింది.
ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం(ఆగస్టు 8వ తేదీ) బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్.
దీనికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నుంచి మాత్రం ఫుల్ సపోర్ట్ లభించింది. ఈ అంశాన్ని ప్రతీ రాజకీయ పార్టీ తీవ్రమైన అంశంగా పరిగణించాలి. మన ప్రజాస్వామ్యం చాలా విలువైనది,. ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా తీవ్రంగా పరిగణించల్సిన అంశం. అసమర్థత కావొచ్చు.. అజాగ్రత్త కావొచ్చు.. ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేసే ప్రక్రియ కావొచ్చు. ఇది మన విశ్వసనీయతను నాశనం చేసే ఒక ప్రక్రియ. దీనిపై ఈసీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు శశిథరూర్. ఈ మేరకు రాహుల్ స్పీచ్‌ను సైతం పో స్ట్ చేశారు.
These are serious questions which must be seriously addressed in the interests of all parties & all voters. Our democracy is too precious to allow its credibility to be destroyed by incompetence, carelessness or worse, deliberate tampering. @ECISVEEP must urgently act &… https://t.co/RvKd4mSkae
— Shashi Tharoor (@ShashiTharoor) August 8, 2025
కింది లింక్‌లో రాహుల్ వ్యాఖ్యలు చదివేయండి..