
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై గురువారం దాడి జరిగింది. ఛండీగఢ్ ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది ఒకరు ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల్ని, రైతు ఉద్యమాన్ని అవమానించేలా కంగనా మాట్లాడిందంటూ సదరు సిబ్బంది దాడి చేసినట్లు సమాచారం. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను కుల్వీందర్ కౌర్‌గా గుర్తించారు.
గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్‌కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారుల్ని కలిసి కంగన ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు.
దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ నిమిత్తం సీఐఎస్‌ఎప్ కమాండెంట్ కార్యాలయానికి తరలించారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
This is Kulwinder Kaur, the CISF officer posted at Chandigarh airport who slapped actor and BJP MP #KanganaRanaut today. pic.twitter.com/fTiQzwrf3x
— هارون خان (@iamharunkhan) June 6, 2024