బీచ్‌లు అనగానే మనకు సాధారణంగా గోవా, వైజాగ్ లాంటి ప్రదేశాలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. కానీ భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం, 480 కి.మీ పొడవైన అందమైన తీర ప్రాంతం ఉన్న ఒడిషా కూడా అందమైన బీచ్‌లకు ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం. అందమైన తీరప్రాంతం, పురాతన దేవాలయాలు, గిరిజన సంస్కృతి ,వన్యప్రాణుల అభయా రణ్యాలున్నాయి ఇక్కడ. ఓడిషాలోని 7 అందమైన బీచ్‌ల గురించి తెలుసుకుందాం.<
Odisha beaches are underrated. pic.twitter.com/ac50CVe6xC
— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024
1. పూరి బీచ్
ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి పూరీ బీచ్. బీచ్ ప్రేమికులు ,ఆధ్యాత్మిక అన్వేషకులు ఒడిషాలో దీన్ని టాప్ బీచ్‌గా భావిస్తారు. సముద్ర తీరం, గోల్డెన్ ఇసుక ఇక్కడి ప్రత్యేకం. అంతేకాదు అద్భుతమైన సూర్యోదయాలు ,సూర్యాస్తమయ దృశ్యాలను అస్సలు మిస్ కాకూడదు. సమీపంలోని జగన్నాథ ఆలయం మరో పెద్ద ఆకర్షణ.
And early morning vibe is damn good in Odisha ⛱️ .❤️❤️#odisha#beaches #indiasbestkeptsecret #JaiJagannatha #Konark pic.twitter.com/HgnTriP7hZ
— Adarsh Jyoti (@AdarshJyoti1) May 21, 2024
2. అస్తరంగ బీచ్
పూరీ నగరానికి దగ్గరగా ఉన్న మరో బీచ్, అస్తరంగ బీచ్. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టూ పెద్దగా ఫిషింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ బీచ్ పక్షులను వీక్షించడానికి బాగా ఇష్టపడే ప్రదేశం.పర్యాటకులు అక్కడ వివిధ రకాల వలస పక్షుల జాతులను చూడ్డానికి వస్తారు.
3 ఉన్నట్టుండి మాయమయ్యే చాందీపూర్ బీచ్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ దేశంలోనే అరుదైన బీచ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ చూడటానికి ఇతర బీచ్‌ల మాదిరే. కానీ నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఈ బీచ్ అకస్మాత్తుగా మాయమైపోతుందిట. ఈ బీచ్‌లో భారీ అలలు ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు నీరు సుమారు 5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో అది అక్కడికి వచ్చేవారిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతుంది. మనం చూస్తున్నంత సేపు కనిపించిన సముద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కనపడకుండా పోతుండటం విశేషం. మోనాజైట్ , టైటానియం అధికంగా ఉండే నల్ల ఇసుక, సరుగుడు చెట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పిక్నిక్‌లు పక్షులను చూడటం ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
4. గోపాల్‌పూర్ బీచ్
ఒడిశాలోని దక్షిణ భాగంలో ఉన్న గోపాల్‌పూర్ బీచ్. ప్రశాంతత, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. తెల్లటి ఇసుక, కొబ్బరి చెట్లతో గోపాల్‌పూర్ బీచ్ ఒడిషాలో సందర్శించడానికి ఉత్తమమైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడ ఈత కొట్టవచ్చు, చేపలు పట్టవచ్చు.అందుకే ఇది చాలా పాపులర్ అయింది. ఇక్కడ నౌకాశ్రయం కూడా ఉంది.
5. రాంచండీ బీచ్, కోణార్క్
కోణార్క్ పట్టణానికి దగ్గరగా ఉన్న రాంచండి బీచ్ . UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయానికి ఆనుకొని ఉన్నందున బీచ్ అందాలతోపాటు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈబీచ్ వద్ద ఈత, సన్‌బాత్, బోటింగ్ ఫిషింగ్ లాంటివి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.
6. బలిఘై బీచ్, పూరి
పూరీ నగరానికి దగ్గరగా ఉన్న బలిఘై బీచ్ స్పష్టమైన నీలి జలాలకు ప్రసిద్ధి. చుట్టూ పచ్చని అడవులు, బంగాళాఖాతం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఒంటె , గుర్రపు స్వారీలతోపాటు, బీచ్‌లో తాజా సీఫుడ్ , ప్రాంతీయ వంటకాలను విక్రయించే అనేక చిన్న ఫుడ్ సెంటర్లలో ఆస్వాదించవచ్చు.
7. తలసరి బీచ్
తలసరి పేరు రెండు ఒడియా పదాలైన తల ( పామ్ లేదా తాటి)సరి(వరుస) నుండి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లు ఎక్కువ ఉండటం వల్లే ఈ పేరు వచ్చిందని చెబుతారు. తాలా అనే పదానికి లయ అని కూడా అర్థం, ఇది తీరానికి వ్యతిరేకంగా వచ్చే సముద్రపు అలలలో ప్రతిబింబిస్తుందని భావిస్తారు.
సువర్ణరేఖ నది తలసరి బీచ్ ఆకర్షణను రెట్టింపుచేస్తుంది. దీనితోటు ఇసుక దిబ్బలు, ఎర్ర పీతలు ఆరో ఆకర్షణ. ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న బిచిత్రపూర్‌లోని ఫిషింగ్ పల్లెలు, మడ చెట్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment