beaches
-
మెక్సికో నగరాల్లో మొసళ్ల సంచారం
మెక్సికో సిటీ: మెక్సికో దేశంలోని తీర ప్రాంత నగరాల్లో ఇటీవల మొసళ్ల సంచారం ఒక్కసారిగా పెరిగింది. సముద్ర తీరాల వెంబడి తక్కువ లోతు నీళ్లలో ఉండే మొసళ్లు ఇటీవలి వరుస తుపాన్లు, వరదలతో జనారణ్యంలోకి వచి్చపడుతున్నాయి. టాంపికో, సియుడాడ్ మడెరో, అల్టమిరా నగరాల్లో తిరుగుతూ ప్రజలను భయకంపితుల్ని చేసిన కనీసం 200 మొసళ్లను పట్టుకుని, వాటి ఆవాసాలకు తీసుకెళ్లి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. నీటి కొరత ఏర్పడినా, వరదలు వచి్చనా అవి ఇలా జనం మధ్యకు వచ్చేస్తుంటాయని, ఇదో సమస్యగా మారిందని అధికారులు అంటున్నారు. మెక్సికోలో మొసళ్లు రక్షిత జీవులు. అందుకే ప్రజలు చంపడానికి బదులుగా బంధించి అధికారులకు సమాచారమిస్తుంటారు. -
ఒడిషాలోని బీచ్‌ల గురించి తెలిస్తే.. ఇపుడే ‘ఛలో’ అంటారు
బీచ్‌లు అనగానే మనకు సాధారణంగా గోవా, వైజాగ్ లాంటి ప్రదేశాలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. కానీ భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం, 480 కి.మీ పొడవైన అందమైన తీర ప్రాంతం ఉన్న ఒడిషా కూడా అందమైన బీచ్‌లకు ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం. అందమైన తీరప్రాంతం, పురాతన దేవాలయాలు, గిరిజన సంస్కృతి ,వన్యప్రాణుల అభయా రణ్యాలున్నాయి ఇక్కడ. ఓడిషాలోని 7 అందమైన బీచ్‌ల గురించి తెలుసుకుందాం.<Odisha beaches are underrated. pic.twitter.com/ac50CVe6xC— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 1. పూరి బీచ్ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి పూరీ బీచ్. బీచ్ ప్రేమికులు ,ఆధ్యాత్మిక అన్వేషకులు ఒడిషాలో దీన్ని టాప్ బీచ్‌గా భావిస్తారు. సముద్ర తీరం, గోల్డెన్ ఇసుక ఇక్కడి ప్రత్యేకం. అంతేకాదు అద్భుతమైన సూర్యోదయాలు ,సూర్యాస్తమయ దృశ్యాలను అస్సలు మిస్ కాకూడదు. సమీపంలోని జగన్నాథ ఆలయం మరో పెద్ద ఆకర్షణ.And early morning vibe is damn good in Odisha ⛱️ .❤️❤️#odisha#beaches #indiasbestkeptsecret #JaiJagannatha #Konark pic.twitter.com/HgnTriP7hZ— Adarsh Jyoti (@AdarshJyoti1) May 21, 20242. అస్తరంగ బీచ్పూరీ నగరానికి దగ్గరగా ఉన్న మరో బీచ్, అస్తరంగ బీచ్. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టూ పెద్దగా ఫిషింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ బీచ్ పక్షులను వీక్షించడానికి బాగా ఇష్టపడే ప్రదేశం.పర్యాటకులు అక్కడ వివిధ రకాల వలస పక్షుల జాతులను చూడ్డానికి వస్తారు.3 ఉన్నట్టుండి మాయమయ్యే చాందీపూర్ బీచ్ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ దేశంలోనే అరుదైన బీచ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ చూడటానికి ఇతర బీచ్‌ల మాదిరే. కానీ నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఈ బీచ్ అకస్మాత్తుగా మాయమైపోతుందిట. ఈ బీచ్‌లో భారీ అలలు ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు నీరు సుమారు 5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో అది అక్కడికి వచ్చేవారిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతుంది. మనం చూస్తున్నంత సేపు కనిపించిన సముద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కనపడకుండా పోతుండటం విశేషం. మోనాజైట్ , టైటానియం అధికంగా ఉండే నల్ల ఇసుక, సరుగుడు చెట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పిక్నిక్లు పక్షులను చూడటం ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.4. గోపాల్పూర్ బీచ్ఒడిశాలోని దక్షిణ భాగంలో ఉన్న గోపాల్పూర్ బీచ్. ప్రశాంతత, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. తెల్లటి ఇసుక, కొబ్బరి చెట్లతో గోపాల్పూర్ బీచ్ ఒడిషాలో సందర్శించడానికి ఉత్తమమైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడ ఈత కొట్టవచ్చు, చేపలు పట్టవచ్చు.అందుకే ఇది చాలా పాపులర్ అయింది. ఇక్కడ నౌకాశ్రయం కూడా ఉంది.5. రాంచండీ బీచ్, కోణార్క్కోణార్క్ పట్టణానికి దగ్గరగా ఉన్న రాంచండి బీచ్ . UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయానికి ఆనుకొని ఉన్నందున బీచ్ అందాలతోపాటు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈబీచ్ వద్ద ఈత, సన్‌బాత్, బోటింగ్ ఫిషింగ్ లాంటివి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.6. బలిఘై బీచ్, పూరిపూరీ నగరానికి దగ్గరగా ఉన్న బలిఘై బీచ్ స్పష్టమైన నీలి జలాలకు ప్రసిద్ధి. చుట్టూ పచ్చని అడవులు, బంగాళాఖాతం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఒంటె , గుర్రపు స్వారీలతోపాటు, బీచ్‌లో తాజా సీఫుడ్ , ప్రాంతీయ వంటకాలను విక్రయించే అనేక చిన్న ఫుడ్ సెంటర్లలో ఆస్వాదించవచ్చు.7. తలసరి బీచ్తలసరి పేరు రెండు ఒడియా పదాలైన తల ( పామ్ లేదా తాటి)సరి(వరుస) నుండి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లు ఎక్కువ ఉండటం వల్లే ఈ పేరు వచ్చిందని చెబుతారు. తాలా అనే పదానికి లయ అని కూడా అర్థం, ఇది తీరానికి వ్యతిరేకంగా వచ్చే సముద్రపు అలలలో ప్రతిబింబిస్తుందని భావిస్తారు.సువర్ణరేఖ నది తలసరి బీచ్ ఆకర్షణను రెట్టింపుచేస్తుంది. దీనితోటు ఇసుక దిబ్బలు, ఎర్ర పీతలు ఆరో ఆకర్షణ. ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న బిచిత్రపూర్లోని ఫిషింగ్ పల్లెలు, మడ చెట్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి. -
ఏపీలో కనువిందు చేసే ఆకర్షణీయమైన బీచ్‌లు (ఫొటోలు)
-
ఇక్కడి బీచ్‌ల్లో రంగురాళ్లు ఏరితే, భారీ జరిమానా!
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు సముద్ర తీరానికి, బీచ్‌లకు,అందమైన ద్వీపాలకు వెళతాం. బీచ్‌లకు వెళ్లామంటే గవ్వలు, రంగు రంగుల గులకరాళ్లు ఏరుకోవడం ఒక సరాదా. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఇదొక అలవాటు మారిపోయింది. కానీ ఈ అలవాటు ప్రకృతిని, పర్యావరణా సమతుల్యతను దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ఈ నేపథ్యంలోనే కెనరీ ఐలాండ్స్ కఠిన చర్యలకు దిగింది. పర్యావరణ పరిరక్షణకోసం స్పెయిన్‌కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లాంజరోటే, ఫుయెర్తెవెంట్యురా ద్వీపాల్లోని సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరడాన్ని నిషేధించింది. రాళ్లను సేకరించే టూరిస్టులకు రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బీచ్‌లు క్షీణించకుండా పర్యాటకులకు అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. మాస్ టూరిజం కారణంగా కానరీ ద్వీపాలు దెబ్బతింటున్నాయంటున్నారు అధికారులు. కానరీ దీవుల్లోని దీవులకు వచ్చే పర్యాటకులు తమతో పాటు రంగురాళ్లు, ఇసుకను తీసుకువెళతారట. పర్యాటకుల రాళ్లను తీసుకెళ్లే అలవాటుతో అక్కడి సహజ సమతుల్యత దెబ్బతింటోందని ఆ దేశం భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ఈ రాళ్లు,మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా అక్కడి అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు ఏటా తీరంవెంబడి భారీ స్థాయిలో ఇసుక, మట్టి కోల్పోతోందని వెల్లడించారు. కానరీ దీవులు ఏడు ప్రధాన ద్వీపాల సమూహం. ఇందులో టెనెరిఫే, గ్రాన్ కానరియా, లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా, లా పాల్మా, లా గోమెరా , ఎల్ హిరో. ఈ ద్వీపాలలో టెనెరిప్ ద్వీపం కానరీ దీవులలో అతిపెద్ద ద్వీపం. స్పెయిన్‌లోని అతిపెద్ద పర్వతం మౌంట్ టీడే ఇక్కడే ఉంది. -
PM Modi Lakshadweep Visit: ప్రకృతిలో పరవశించిన నమో (ఫొటోలు)
-
బీచ్‌లకు రక్షకురాలిగా 96 ఏళ్ల బామ్మ!
చెన్నైలోని బీచ్‌లను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయాలంటే అందరికీ భయం. దానికి కారణం కామాక్షి సుబ్రమణియన్. బీచ్‌లకు రక్షకురాలిగా ‘అమ్మమ్మ’గా అందరూ పిలుచుకునే కామాక్షి గత 40 ఏళ్లుగా చెన్నైలోని బీచ్‌లను కాపాడుతోంది. ఈ పనికి అందరూ పెట్టిన పేరు ‘మిషన్ కామాక్షి’. 1930లో మద్రాసులో ఒక ఘటన జరిగింది. అక్కడి బెసెంట్ నగర్ బీచ్ (ఎలియెట్స్ బీచ్)లో ఒక బ్రిటిష్ అమ్మాయి స్నానం చేస్తూ మునిగిపోబోయింది. ఒడ్డున ఉన్న కాజ్ ష్మిడ్ అనే డెన్మార్క్ నావికుడు అది గమనించాడు. వెంటనే సముద్రంలోకి పరిగెత్తి ఆ అమ్మాయిని కాపాడబోయాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండింది. అమ్మాయిని ఒడ్డుకు తోసేశాడు. తాను మాత్రం సముద్రంలో మునిగిపోయాడు. అమ్మాయి ఆ సంగతి గురించి కిక్కురుమనకుండా సాయంత్రం జరిగిన పార్టీకి హాజరైంది. కాని నాటి గవర్నర్‌కు ఎలాగో సంగతి తెలిసింది. ఆయన ఆగ్రహంతో ఆ అమ్మాయి మీద కేకలేసి కాజ్ ష్మిడ్ సాహసానికి గుర్తుగా ష్మిడ్ మెమోరియల్ కట్టించాడు. చాలా తమిళ సినిమాల్లో ఈ మెమోరియల్ కనిపిస్తుంది. అయితే ఇది అనేక ఏళ్లపాటు శిథిలావస్థలో ఉండింది. కార్పొరేషన్ వారిని వేధించి, వెంటబడి దానిని పునరుద్ధరించిన వ్యక్తి కామాక్షి సుబ్రమణియన్. ఇవాళ ష్మిడ్ మెమోరియల్ ఎంతో చక్కగా పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంది. ఏ సాయంత్రం బీచ్‌కు వెళ్లినా ఆ చుట్టుపక్కల నవ్వుతూ కామాక్షి సుబ్రమణియన్ కనిపిస్తుంది. బీచ్ ఒడ్డు మనిషి కామాక్షి సుబ్రమణియన్ బెసెంట్ నగర్లో పుట్టి పెరిగింది. బెసెంట్ నగర్ అడయార్ పక్కనే ఉంటుంది. పెళ్లయ్యాక భర్తతో 1980 వరకూ ఢిల్లీలో ఉండిపోయింది కామాక్షి. భర్త రాష్ట్రపతి భవన్లో కార్యదర్శిగా పని చేసేవాడు. ‘ఆ సమయంలో నా భర్త వల్ల బ్యూరోక్రసిలో ఎలాంటి అలక్ష్యం జరుగుతుందో, తెలిసీ తెలియక ఎన్ని మతలబులు చోటు చేసుకుంటాయో తెలుసుకున్నాను’ అంటుంది కామాక్షి. భర్త రిటైర్ అయ్యాక చక్కా వచ్చి బెసెంట్ నగర్లో నివాసం ఏర్పాటు చేసుకున్న కామాక్షి ఆ రోజుల్లో దట్టంగా ఉన్న చెట్లను కొందరు వంట చెరుకు కోసం కొట్టడం బాల్కనీలో నుంచి గమనించేది. ఆ చెట్లు కొట్టేస్తే నీడ ఏం కాను? అందుకని వారు రావడంతోటే పెద్దగా అరుస్తూ తరిమి కొట్టేది. ‘అలా నా పౌర సేవ మొదలైంది’ అని గుర్తు చేసుకుంది కామాక్షి. ఆమెకు రోజూ బీచ్‌కు వెళ్లడం అలవాటు అలా బీచ్ మీద ప్రేమ ఏర్పడింది. 96 ఏళ్ల వయసులో ‘నగర పౌరులకు హక్కులుంటాయి. పబ్లిక్ స్థలాలు వారి ఆహ్లాదం కోసం. పార్కులు వారికి కావాలి. పేవ్మెంట్లు కావాలి. బీచ్ శుభ్రంగా ఉండాలి. వాటి కోసం నేను పోరాటం చేస్తాను’ అంటుంది కామాక్షి. ఆ మధ్య జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 174 వ వార్డులో ఇండిపెండెంట్‌గా నిలుచుంది కామాక్షి. పత్రికలు ఆమె గురించి విస్తృతంగా రాశాయి. ‘పార్టీ జెండా కింద నిలబడితే పార్టీ పనులన్నీ సమర్థించాలి. నేను అలా చేయలేను’ అందామె. అందుకే ఓడిపోయింది కూడా. కాని నేటికీ ఆమె పౌరుల హక్కుల కోసం పని చేస్తూనే ఉంది. ‘బెసెంట్ నగర్ బీచ్ దగ్గర వాకింగ్ ట్రాక్‌ను అడ్డుకుంటూ పబ్లిక్ టాయిలెట్లు కడుతున్నారు. దానిని అడ్డుకోవడానికి ధర్నా చేస్తున్నాను’ అని ధర్నాకు కూచుందామె. కార్పొరేషన్ అధికారులకు ఆమెను చూస్తే భయం. ఎవరో ఒకరు భయపెట్టకపోతే పనులెలా జరుగుతాయి? 96 ఏళ్లలో కామాక్షి అన్ని పనులు చేస్తుంటే మనం ఎన్ని పనులు చేయాలి? (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్‌లు
-
విశాఖ తీరంలో కొత్త అందాలు
-
విశాఖలో కొత్త బీచ్ లు
-
తీరానికి అందాల హారం! బీచ్‌లలో ఆధునిక సదుపాయాలు.. పోటీలు షురూ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్‌ల సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఆప్టా) చర్యలు చేపడుతోంది. బీచ్‌లను ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్‌కు అనుగుణంగా పర్యావరణ హితంగా, అందంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో ఆధునిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉత్తమ ప్రాజెక్టు డిజైన్ల కోసం ఆర్కిటెక్ట్ పోటీలను నిర్వహిస్తోంది. ఆర్కిటెక్ట్ సంస్థలతోపాటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ (సీవోఏ)లో రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ)లో రిజిస్టర్డ్ ప్లానర్లు, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల (వ్యక్తిగత/బృందాలుగా)నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలించి ఉత్తమ ఆర్ఎఫ్పీలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించి ప్రోత్సహించనుంది. టెక్నికల్ బిడ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఇచ్చింది. పూర్తి వివరాలను https://tourism.ap.gov.in/tenders వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభివృద్ధి ప్రణాళిక ఇలా... తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో సుమారు 1,500 మీటర్లు చొప్పున అభివృద్ధి చేయనున్నారు. ఈ బీచ్‌లను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతోపాటు స్థానికులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, వ్యూ పాయింట్లు, పిల్లల కోసం ఆట స్థలాలు, టూరిస్ట్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ రిసెప్షన్ సెంటర్, రెస్క్యూ, వైద్య సౌకర్యాలు, ల్యాండ్ స్కేపింగ్, సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తారు. మరోవైపు పశ్చిమగోదారి జిల్లా పేరుపాలెంలో 104 ఎకరాల్లో, పల్నాడు జిల్లా నాగులవరంలో 250 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. వీటిల్లో బీచ్ కాటేజీలు, హోటళ్లు, రిసార్ట్స్, సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, ఎగ్జిబిషన్లు, థీమ్ పార్క్, వ్యూ పాయింట్లు, టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వంటివి ఆధునిక సౌకర్యాలో ఏర్పాటు చేయనున్నారు. నగదు బహుమతులు ఇలా.. ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి వచ్చిన మొదటి మూడు ఉత్తమ ఎంపికలకు రూ.1,50,000, రూ.1,00,000, రూ.75,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తారు. సీవోఏ రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్, ఐటీపీఐ రిజిస్టర్డ్ ప్లానర్ నుంచి వచ్చిన ఉత్తమ డిజైన్లకు రూ.1,00,000, రూ.75,000, రూ.55,000 చొప్పున, విద్యార్థి విభాగంలో విజేతలకు రూ.50,000, రూ.40,000, రూ.30,000 చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేస్తారు. ప్రతిభగల ఆర్కిటెక్ట్‌లకు ఆప్టాతో కలిసి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
సముద్ర తీరాల్లో టూరిజం రిసార్ట్స్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు సముద్ర తీరం వెంబడి పెద్దఎత్తున రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు. పర్యాటక రంగానికి మన రాష్ట్రం పర్యాయ పదం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త టూరిజం పాలసీ రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని, అందువల్ల ఈ రంగంలో ఉన్న టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజం అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, సదుపాయాలు వంటివన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని వివరించారు. 12 ప్రాంతాల్లో స్టార్ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేస్తున్నామని, వాటర్ టూరిజం, ఎకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తెలుగు వంటకాలకు గుర్తింపు కోసం ఫుడ్ ఫెస్టివల్ తెలుగు వంటకాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని, శాఖాహార, మాంసాహార వంటకాలను ప్రజలకు పరిచయం చేస్తామని చెప్పారు. పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలో 9 కంట్రోల్ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. -
స్పెయిన్‌ను వణికించిన మినీ సునామీ
-
సముద్రంలో మునిగి నలుగురి మృతి
పరవాడ/కొత్తపల్లి (పిఠాపురం)/అన్నవరం (ప్రత్తిపాడు): సముద్రంలో మునిగి ఆదివారం నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. విశాఖ జిల్లాలో ముగ్గురు మృతిచెంది, ఒకరు గల్లంతు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతిచెంది, మరో ఇద్దరు గల్లంతయ్యారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలోని పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008లో పదో తరగతి చదువుకున్న దాదాపు 120 మంది విద్యార్థులు ఆదివారం ఉదయం తిక్కవానిపాలెం తీరంలో కలుసుకున్నారు. సాయంత్రం వరకు ఆడిపాడి సందడి చేశారు. అనంతరం ఇంటి ముఖం పట్టారు. అయితే వెన్నెలపాలెనికి చెందిన పైలా మహేష్ (28), మాసవరపు నరేష్ (27), సిరపరపు రామకృష్ణ (28), లాలం నరసింగరావు (27) సముద్ర స్నానానికి వెళ్లారు. కాస్త లోపలికి వెళ్లడంతో అలలు వారిని లాగేశాయి. మహేష్, నరేష్, రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలో ఒడ్డుకు కొట్టుకొచ్చారు. తోటి స్నేహితులు వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ముగ్గురూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గల్లంతైన మరో యువకుడు నరసింగరావు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తూ.గో. జిల్లాలో నైజీరియన్ మృతి... పెద్దాపురం మండలం సూరంపాలెంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే నైజీరియాకు చెందిన ఇమ్మానుయేలు ఒబెరా (21) ఆదివారం స్నేహితులతో కలిసి ఉప్పాడ బీచ్‌లో స్నానం చేస్తుండగా గల్లంతై మృతి చెందాడు. కాగా, తొండంగి మండలం దానావాయిపేటలో సముద్ర స్నానానికి దిగి కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన సల్మాన్ మదీనా (17) గల్లంతయ్యాడు. -
గోవా బీచులు మొత్తం దేశంలోనే..
ఇవేవో కొత్త తరహా బీచులు అనుకుని వెంటనే వెళ్లి చూసొద్దామని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే..! గోవా బీచులు మొత్తం దేశంలోనే అధిక మోతాదులో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయి. ఈ బీచుల్లో అత్యధిక స్థాయిలో ప్లాస్టిక్ అవశేషాలు, చెత్త కేంద్రీకృతమైనట్లు కొచ్చిలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీష్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీఎంఎఫఆర్ఐ) తాజా అధ్యయనం తేల్చింది. గోవా బీచుల్లోని ప్రతీ మీటరు ఇసుకలో 25.47 గ్రాముల ప్లాస్టిక్ అవశేషాలున్నట్లు కనుగొన్నారు. దీనితో పాటు భారత్‌లోనే అత్యధికంగా ఇక్కడి బీచుల్లోనే ప్రతీ మీటరుకు 205.75 గ్రాములు/ఎం2- చొప్పున నైలాన్ చేపల వలలు, గాజు, ఈ-వ్యర్థాలు, స్టయిరోఫోమ్, థర్మోకోల్లతో కూడిన చెత్తా, చెదారం ఉన్నట్లు వెల్లడించింది. గోవా ఆ తర్వాతి స్థానాల్లో కర్నాటక, గుజరాత్.... దేశవ్యాప్తంగా 7,516 కి.మీ మేర ఉన్న తీరప్రాంతంలోని బీచుల్లో 12 మంది సభ్యుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. గోవాలోని 12 బీచులతో సహా, 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 254 బీచుల్లో పరిశీలన జరిపారు. ఇందులోని చెత్తా, చెదారాన్ని ఆరు కేటగిరీ కింద వర్గీకరించారు. గోవా తర్వాత కర్ణాటకలోని 33 బీచుల్లో ప్లాస్టిక్, నైలాన్ వలలు, ఇతర వ్యర్థాలు ఎక్కువ మోతాదులో ఉన్నట్లు వెల్లడైంది. అక్కడి బీచుల్లో ప్రతీ మీటర్‌కు 21.91 గ్రాములు/ఎం2 చొప్పున చెత్త, ప్లాస్టిక్ అవశేషాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ జాబితాలో తరవాతి స్థానంలో గుజరాత్‌లోని 12 బీచులు ఉన్నాయి. ఇక్కడ సగటున 12.62 గ్రాములు/ఎం2 వ్యర్థాలు ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తంగా కర్నాటక బీచుల్లో 178.44 గ్రాములు/ఎం2, గుజరాత్ బీచుల్లో 90.56 గ్రాములు/ఎం2 పరిమాణంలో వ్యర్థాలున్నాయి. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లలోని బీచుల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఒడిశాలోని బీచుల్లోనే తక్కువ స్థాయిలో ప్లాస్టిక్ అవశేషాలున్నట్లు బయటపడింది. ఏయే రూపాల్లో.... ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రధానంగా ప్లాస్టిక్ కవర్లు, క్యారీబ్యాగులు, డిటర్జెంట్ సబ్బులు సాచెట్లు, పాల ప్యాకెట్లు, టూత్‌పేస్ట్, నూనె, ఇతర సౌందర్య సాధనాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల రూపంలో ఉంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, అవశేషాలతో బీచులకే కాకుండా సముద్ర జీవజాతులకు కూడా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్ర పక్షులు, తాబేళ్లు, వేల్ చేపలు, పగడపు దిబ్బలపై ప్రభావం చూపుతున్నాయి. ‘నిత్యావసర సరుకులు మొదలుకుని మిగతా వస్తువుల వరకు అన్నింటికీ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. వాడేసిన తర్వాత బయట పడేసిన ఈ ప్లాస్టిక్ అంతా నదుల మీదుగా సముద్రాలను చేరుతోంది. వేడితో పాటు తేమ వాతావరణం కారణంగా బీచుల్లో విసిరేసిన ప్లాస్టిక్ చెత్త కాస్తా మైక్రో ప్లాస్టిక్‌ల కింద మారి సముద్రంలోకి చేరుతోంది’ అని సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన పరిశోధకుడు పి.కళాధరన్ తెలిపారు. సముద్రంలోని ప్లాస్టిక్ అవశేషాల ప్రభావం మొత్తం ఏడు రకాల తాబేళ్లపై పడుతున్నట్లు, ఏడువందలకు పైగా సముద్రం జీవజాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు మరో పరిశీలనలో వెల్లడైంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'
కాలిఫోర్నియాః అక్కడి తీర ప్రాంతాలు ఇప్పుడు సందర్శకులకు, పర్యటకులకు రెడ్ కార్పెట్ తో భయాన్ని గొల్పుతున్నాయి. రెడ్ కార్పెట్ అంటే సాదర స్వాగతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నీటిలో కాలుష్య ప్రభావమో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులో కానీ జలచరాలు కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు చేరుకుంటుండటంతో ఎర్రని ట్యూనా పీతలతో నిండిన తీరం రెడ్ కార్పెట్ ను తలపిస్తోంది. వేలకు వేలుగా ఎర్ర పీతలు దక్షిణ కాలిఫోర్నియా బీచుల్లో చేరడం న్యూ పోర్ట్ బీచ్ సందర్శకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా కనిపించే ఆ దృశ్యాన్ని కొందరు వింతగా చూస్తుంటే... అక్కడి మునిసిపల్ సిబ్బంది మాత్రం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయలేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఇలాగే సుమారు మూడు అంగుళాల పొడవైన ఎర్ర పీతలు కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అయితే కొందరి కష్టం మరి కొందరికి ఆనందం అన్నట్టు.. శాండియాగోకి దగ్గరలో ఉన్న ఇంపీరియల్ బీచ్ లో పక్షుల ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది. ఓ స్పెషల్ బఫెట్ ను వాటి ముందు పెట్టినట్లు బీచ్ ఒడ్డుకు చేరిన పీతలను తినేందుకు ఉత్సాహంగా పక్షులు అక్కడికి చేరుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి చేరిన పీతలను అక్కడే వదిలేయాలా, తిరిగి సముద్రంలోకి పంపించాలా అన్న విషయంపై అధికారులు తలమునకలౌతున్నారు. గత 15 సంవత్సరాలనుంచి ఇలా ఎర్ర పీతలు సముద్ర తీరాల్లోకి కొట్టుకు వస్తున్నట్లు పురపాలక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క క్రితం సంవత్సరంలోనే బాల్బోవా ఐస్ ల్యాండ్, చైనా కోవ్ ప్రాంతాల్లో కార్మికులు, స్వచ్ఛంద సభ్యులు కలసి ఎనిమిది టన్నుల దాకా ఒడ్డుకు చేరిన పీతలను పట్టుకొన్నట్లు లాస్ ఏంజిల్స్ దగ్గరలోని ఆరెంజ్ కౌంటీ న్యూపోర్ట్ నగరం చెప్తోంది. ఇలా నీటినుంచి జలచరాలు బయటకు వచ్చేయడానికి తీవ్ర వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. -
బీచ్‌లలో డ్రెస్ కోడ్
పణజి: గోవా బీచ్‌లలో వస్త్రధారణపై ఇటీవల కాలంలో చాలా తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతోంది. నిన్నమొన్నటి వరకు యువతుల వస్త్రధారణపై వాడివేడిగా మంత్రుల స్థాయిలో చర్చ జరుగగా, ఇప్పుడు పురుషుల వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు. బీచ్‌లలో పురుషులకు కూడా వస్త్రధారణ కోడ్ ఉండాలని ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మైకేల్ లోబో మంగళవారం డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పురుషులకు వస్త్రధారణ కోడ్ ఉండాలన్నారు. సరైన స్విమ్ సూట్ (ఈత కొట్టే సమయంలో వేసుకునేది) ధరించాలని, అసభ్యకరంగా కనిపించే లో దుస్తులను అనుమతించరాదని ఆయన అన్నారు. మగ యాత్రికులు కొందరు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని ఆయన చెప్పారు. సింగపూర్, దుబాయ్, మలేషియాలలో మాదిరి ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో గోవా బీచ్‌లో యువతుల బికినీలపై నిషేధించాలని ఓ మంత్రి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో గోవా టూరిజం శాఖ కంగారు పడింది. గోవా బీచ్‌లో బికినీలపై నిషేధం లేదని ప్రకటించింది. అంతే కాకుండా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మనోహర్ పరిక్కర్ గోవా బీచ్ లలో బికినీ ధరించడంపై నిషేధం విధించడం లేదని ఓ ప్రకటన చేయవలసి వచ్చింది. -
సముద్ర తీరాల్లో అలర్ట్
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఏ యేడాదికాయేడాది ఎండలు మండుతూనే ఉన్నాయి. భానుడి దెబ్బకు జనం విలవిల్లాడాల్సిన పరిస్థితి. వరుణుడు కరుణించని దృష్ట్యా, ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది కూడా పరిస్థితి అలాగే ఉంది. అయితే, అగ్ని నక్షత్రం ముగియగానే కనమరుగు కావాల్సిన ఎండలు, ఇంకా తమ ప్రతాపాన్ని చూపిస్తుండడం వాతావరణ పరిశోధకులను విస్మయంలో పడేస్తున్నాయి. అగ్ని నక్షత్రం ముగిసి ఇరవై రోజులకు పైగా అవుతున్నా, నైరుతీ రుతు పవనాల సీజన్ ఆరంభమైనా భానుడి ప్రతాపం ఏ మాత్రం తగ్గడం లేదు. మూడు రోజులుగా అయితే, చెన్నై, కడలూరు, వేలూరు, తిరుచ్చి, మదురై, తూత్తుకుడి, పుదుచ్చేరి ప్రజానీకాన్ని భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఈ సమయంలో కెరటాలు సైతం ఉవ్వెత్తున ఎగసి పడుతుండడం చూసి వాతావరణ పరిశోధకులే అయోమయూనికి లోనవుతున్నారు. ఉత్కంఠ: భానుడి ప్రతాపం ఓ వైపు, సముద్రంలో అలజడి మరో వైపు వెరసి మున్ముందు రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చెన్నై నుంచి కడలూరు తీరం వరకు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. మహాబలిపురం, కోవలం, చదరంగ పట్నం, కడపాక్కం, వన పాక్కం, ఉయ్యలికుప్పుం, పుదుపట్నం, కడలూరుల్లో పది అడుగుల మేరకు కెరటాలు ఎగసి పడుతున్నాయి. దీంతో జాలర్లు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల సముద్రపు నీరు గ్రామాల్లోకి చొరబడకుండా నిర్మించిన అడ్డు గోడల్ని దాటుతూ అలలు ఎగసి పడుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రపు నీళ్లు తమ గ్రామాల్లోకి రాకుండా జాలర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న సైజు పడవలను భద్ర పరుస్తున్నారు. బుధవారం కొన్ని గ్రామాల జాలర్లు కడలిలోకి చేపల వేటకు వెళ్లడానికి సాహసించ లేదు. బంగాళా ఖాతంలో గాలుల ప్రభావం అధికంగా ఉన్న దృష్ట్యా, కెరటాలు ఎగసి పడుతున్నాయని, ఈ ప్రభావం క్రమంగా పెరిగిన పక్షంలో గాలిలో తేమ పెరిగి వాతావరణం చల్లబడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరింతగా అలలు ఎగసి పడేందుకు అవకాశం ఉందని, సముద్ర తీరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. జాలరి గల్లంతు : కెరటాలు ఎగసి పడుతుండడంతో కన్యాకుమారిలో పడవ బోల్తా పడింది. బుధవారం సాయంత్రం కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాథపురం తీరాల్లోను అలలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. కన్యాకుమారి పల్లంతురైకు చెందిన సోదరులు జాన్ జోసెఫ్, జేసురాజ్లు తమ చిన్న పడవతో కడలిలోకి వేటకు వెళ్లారు. అలల తాకిడికి పడవ బోల్తా పడడంతో ఇద్దరు సముద్రంలో పడ్డారు. దీన్ని గుర్తించిన సమీపంలోని కొన్ని పడవల్లో ఉన్న జాలర్లు వారిని రక్షించే యత్నం చేశారు. అయితే, జేసురాజ్నుమాత్రం రక్షించ గలిగారు. జాన్ జోసెఫ్ జాడ కానరాలేదు. -
సాగర తీరంలో.. చల చల్లగా..