బీచ్‌లో రంగురాళ్లు, పగడాలు ఏరితే జరిమానా
పర్యావరణ సమతుల్యతకు ముప్పు: కెనరియా ఐలాండ్స్
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు సముద్ర తీరానికి, బీచ్‌లకు,అందమైన ద్వీపాలకు వెళతాం. బీచ్‌లకు వెళ్లామంటే గవ్వలు, రంగు రంగుల గులకరాళ్లు ఏరుకోవడం ఒక సరాదా. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఇదొక అలవాటు మారిపోయింది. కానీ ఈ అలవాటు ప్రకృతిని, పర్యావరణా సమతుల్యతను దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ఈ నేపథ్యంలోనే కెనరీ ఐలాండ్స్ కఠిన చర్యలకు దిగింది.
పర్యావరణ పరిరక్షణకోసం స్పెయిన్‌కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లాంజరోటే, ఫుయెర్తెవెంట్యురా ద్వీపాల్లోని సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరడాన్ని నిషేధించింది. రాళ్లను సేకరించే టూరిస్టులకు రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బీచ్‌లు క్షీణించకుండా పర్యాటకులకు అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు.
మాస్ టూరిజం కారణంగా కానరీ ద్వీపాలు దెబ్బతింటున్నాయంటున్నారు అధికారులు. కానరీ దీవుల్లోని దీవులకు వచ్చే పర్యాటకులు తమతో పాటు రంగురాళ్లు, ఇసుకను తీసుకువెళతారట. పర్యాటకుల రాళ్లను తీసుకెళ్లే అలవాటుతో అక్కడి సహజ సమతుల్యత దెబ్బతింటోందని ఆ దేశం భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ఈ రాళ్లు,మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా అక్కడి అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు ఏటా తీరంవెంబడి భారీ స్థాయిలో ఇసుక, మట్టి కోల్పోతోందని వెల్లడించారు.
కానరీ దీవులు ఏడు ప్రధాన ద్వీపాల సమూహం. ఇందులో టెనెరిఫే, గ్రాన్ కానరియా, లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా, లా పాల్మా, లా గోమెరా , ఎల్ హిరో. ఈ ద్వీపాలలో టెనెరిప్ ద్వీపం కానరీ దీవులలో అతిపెద్ద ద్వీపం. స్పెయిన్‌లోని అతిపెద్ద పర్వతం మౌంట్ టీడే ఇక్కడే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment