colour stones
-
ఇక్కడి బీచ్‌ల్లో రంగురాళ్లు ఏరితే, భారీ జరిమానా!
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు సముద్ర తీరానికి, బీచ్‌లకు,అందమైన ద్వీపాలకు వెళతాం. బీచ్‌లకు వెళ్లామంటే గవ్వలు, రంగు రంగుల గులకరాళ్లు ఏరుకోవడం ఒక సరాదా. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఇదొక అలవాటు మారిపోయింది. కానీ ఈ అలవాటు ప్రకృతిని, పర్యావరణా సమతుల్యతను దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ఈ నేపథ్యంలోనే కెనరీ ఐలాండ్స్ కఠిన చర్యలకు దిగింది. పర్యావరణ పరిరక్షణకోసం స్పెయిన్‌కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లాంజరోటే, ఫుయెర్తెవెంట్యురా ద్వీపాల్లోని సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరడాన్ని నిషేధించింది. రాళ్లను సేకరించే టూరిస్టులకు రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బీచ్‌లు క్షీణించకుండా పర్యాటకులకు అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. మాస్ టూరిజం కారణంగా కానరీ ద్వీపాలు దెబ్బతింటున్నాయంటున్నారు అధికారులు. కానరీ దీవుల్లోని దీవులకు వచ్చే పర్యాటకులు తమతో పాటు రంగురాళ్లు, ఇసుకను తీసుకువెళతారట. పర్యాటకుల రాళ్లను తీసుకెళ్లే అలవాటుతో అక్కడి సహజ సమతుల్యత దెబ్బతింటోందని ఆ దేశం భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ఈ రాళ్లు,మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా అక్కడి అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు ఏటా తీరంవెంబడి భారీ స్థాయిలో ఇసుక, మట్టి కోల్పోతోందని వెల్లడించారు. కానరీ దీవులు ఏడు ప్రధాన ద్వీపాల సమూహం. ఇందులో టెనెరిఫే, గ్రాన్ కానరియా, లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా, లా పాల్మా, లా గోమెరా , ఎల్ హిరో. ఈ ద్వీపాలలో టెనెరిప్ ద్వీపం కానరీ దీవులలో అతిపెద్ద ద్వీపం. స్పెయిన్‌లోని అతిపెద్ద పర్వతం మౌంట్ టీడే ఇక్కడే ఉంది. -
విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మళ్లీ రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీకే వీధి మండలం సిగినాపల్లి క్వారీని నెలరోజుల కిందట పోలీసులు మూసివేయించారు. దీంతో అంతర రాష్ట్ర రంగురాళ్ల వ్యాపారుల ముఠాలు వేరే క్వారీలపై దృష్టి సారించాయి. జి.మాడుగుల మండలంలోని మారుమూల గడుతూరు పంచాయతీ కూటికొండలు, ఇదే క్వారీకి సమీపంలోని చింతపల్లి సరిహద్దు నిట్టాపుట్టు అటవీ ప్రాంతంలోను, అడ్డతీగల మండలం తపస్వీకొండ అటవీ ప్రాంతంలోను రంగురాళ్ల క్వారీలు వెలుగు చూశాయి. ఆయా క్వారీల వద్ద వ్యాపారులు మకాం వేసి, గిరిజనులను ప్రోత్సహిస్తుండడంతో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. విశాఖ, రాజమహేంద్రవరాల్లో విక్రయాలు కొంతమంది వ్యాపారులు పాడేరు, వి.మాడుగుల, నర్సీపట్నం మండలాల్లో మకాం వేసి, రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. స్థానికంగా రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని నేరుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్న పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాటిని జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లకు పెద్ద వ్యాపారులు తరలిస్తున్నారు. జి.మాడుగుల మండలం కూటికొండలు, అడ్డతీగల మండలం తపస్వికొండపై గల క్వారీల్లో విలువైన క్యాట్ ఐ రకం(పిల్లికన్ను రంగు) రంగురాళ్లు లభ్యమవుతున్నాయని తెలిసింది. కూటికొండలు రంగురాళ్ల క్వారీ వద్దకు మైదాన ప్రాంతాల్లోని వి.మాడుగుల, రావికమతం, జి.మాడుగుల మండలాలకు చెందిన వ్యాపారులు రోజూ వెళుతూ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరిపిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ డబ్బు ఆశతో గిరిజనులు లోతుగా తవ్వుతున్నారు. తపస్వికొండపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అడ్డతీగల ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానిక వ్యాపారులే అక్కడ రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తూ అక్కడ సేకరించిన వాటిని రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి తరలిస్తు పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నారు. రంగురాళ్ల తవ్వకాలను నిరోధిస్తాం జి.కె.వీధి మండలంలో సిగినాపల్లి వద్ద రంగురాళ్ల క్వారీని పూర్తిగా మూసివేశాం. డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశాం. కూటికొండలు, తపస్వికొండల వద్ద తనిఖీలు నిర్వహించి వెంటనే ఆయా క్వారీలను కూడా మూసివేస్తాం. రంగురాళ్ల తవ్వకాలు, వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగురాళ్ల వ్యాపారుల ముఠాల సంచారంపై దృష్టి పెడతాం. కొండలపై తవ్వకాలు జరిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. తవ్వకాలను ఎవరైనా ప్రోత్సహిస్తే తమకు సమాచారం ఇవ్వాలి. – సతీష్‌కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
విషయం తెలియడంతో తవ్వకాలు మొదలుపెట్టిన జనం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో
గొలుగొండ: విశాఖ జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో కొత్తగా రంగు రాళ్ల క్వారీ వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం గ్రామ సమీపంలో ఉన్న జిరాయితీ భూమిని చదును చేస్తుండగా చిన్న మెట్ట అంచున రంగురాయి బయటపడింది. కొందరు అనుభవజ్ఞులు ఇక్కడి మట్టిని పరిశీలించి రంగురాళ్లు ఉండే అవకాశముందని చెప్పడంతో.. ఆ విషయం తెలిసి వందలాదిమంది మంగళవారం అర్ధరాత్రి ఎక్కడికక్కడ తవ్వకాలు చేపట్టారు. బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ ధనుంజయ్‌నాయుడు సిబ్బందితో గ్రామానికి వెళ్లగా.. తవ్వకాలు చేపట్టిన వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగురాళ్లకు పుట్టినిల్లు గొలుగొండ మండలంలో ఏటా ఏదో ఒకచోట రంగురాళ్ల క్వారీలు బయటపడుతున్నాయి. 1996లో తొలిసారిగా పప్పుశెట్టిపాలెం క్వారీ బయటపడింది. ఆశకొద్దీ లోతుగా తవ్వడంతో ఏడాది కాలంలో క్వారీ కూలి 14 మంది చనిపోయారు. 1999లో కరక రంగురాళ్ల క్వారీని కనుగొన్నారు. ఇక్కడ 15 వరకు క్వారీలు వెలుగుచూడగా రూ.వేలకోట్ల విలువైన రంగురాళ్లు దొరికాయి. అప్పట్లో ఈ 15 క్వారీల్లో ప్రమాదాలు జరిగి 100 మంది వరకు మృత్యువాతపడ్డారు. దీంతో అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌ప్రకాశ్ క్వారీ ప్రాంతాలను మూయించారు. 2002లో సాలిక మల్లవరం, 2004లో పొగచట్లపాలెం, 2006లో దోనిపాలెం, 2008లో తిరిగి సాలిక మల్లవరం, 2009లో ఆరిలోవలో కొత్త క్వారీలు ఏర్పడ్డాయి. పప్పుశెట్టిపాలెంలో బుధవారం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీని రప్పించి క్వారీ ప్రాంతంలో తవ్వకందారులు తీసిన గోతులను మూయించివేశారు. -
అందరి చూపు.. రంగురాళ్ల వైపు!.. వారం రోజుల్లో కోట్ల వ్యాపారం
రంగురాళ్లంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖ ఏజెన్సీ.. అందులో నర్సీపట్నం ప్రాంతాలే. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విలువైన వైఢూర్యాలు ఇక్కడికి సమీపంలో లభ్యం కావడమే ఇందుకు కారణం. నెల రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తూ.. అప్పట్లో మూసివేసిన క్వారీలన్నీ తవ్వకాలకు అనువుగా మారడంతో అందరూ దృష్టీ దీనిపై పడింది. నెలరోజుల క్రితం సాక్షాత్తూ డీఎఫ్‌వో డ్రైవర్ ఆధ్వర్యంలో కొంతమంది రంగురాళ్ల తవ్వకాలకు యత్నించి దొరికిపోయిన సంఘటన మరువక ముందే వారం నుంచి గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సిగనాపల్లి, మేడూరు, గుర్రాలగొందిల్లో క్వారీలలో సైతం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రంగురాళ్ల వ్యాపారానికి నర్సీపట్నం కేంద్రంగా మారింది. వారం రోజుల్లో సుమారు రూ.5 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది. ఫారెస్టు, పోలీసు సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు రంగురాళ్ల తవ్వకాలు నిరాటంకంగా సాగిస్తున్నారు. కృష్ణాబజార్ ప్రాంతంలో ఒక రంగురాళ్ల వ్యాపారి ఇల్లే ఇందుకు కేంద్రంగా మారింది. – నర్సీపట్నం కోట్లు కురిపించే క్వారీలు.. చెంతనే ప్రమాదాలు విశాఖ ఏజెన్సీ తూర్పు కనుమల్లోని గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలో లభించే ఆకుపచ్చ వైఢూర్యాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి, గుర్రాలగొంది, మేడూరు క్వారీల్లో లభించే క్యాట్స్ ఐ రకాలకు కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రంగురాళ్ల తవ్వకాలకు అనువుగా మారాయి. నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు సమీప గ్రామాల్లోని కొంతమందికి డబ్బులు ఇచ్చి పప్పుశెట్టిపాలెం లీజు క్వారీకి సమీపంలో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు సాగిస్తున్నారు. జీకే వీధి మండలం సిగనాపల్లిలో కూడా రంగురాళ్ల తవ్వకాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. సిగనాపల్లి క్వారీలో సెల్‌సిగ్నల్స్ అందుబాటులో ఉండటం రంగురాళ్ల వ్యాపారులకు కలిసొచ్చింది. తవ్వకాలు జరుపుతున్న కూలీలు (ఫైల్) పోలీసు, అటవీ సిబ్బంది ఎవరు వచ్చినా ఇట్టే సమాచారం తెలుస్తుండడంతో సమయానుకూలంగా తవ్వకాలు సాగిస్తున్నారు. 1992–93లో పప్పుశెట్టిపాలెం క్వారీలో ముమ్మరంగా తవ్వకాలు జరపడంతో క్వారీ కూలి అప్పట్లో 15 మంది మృతి చెందారు. ఆ తర్వాత కరకలో రంగురాళ్ల క్వారీ కూలి ముగ్గురు మృతి చెందారు. కరక ప్రమాదం తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌ప్రకాష్ , జిల్లా పోలీసు, అటవీ అధికారులు రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అప్పటి నుండి కరక, పప్పుశెట్టిపాలెం ప్రాంతాల్లో తవ్వకాలకు అడ్డుకట్ట పడింది. ఇటీవల పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి క్వారీలో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న రంగురాళ్లను నర్సీపట్నం తరలిస్తున్నారు. చదవండి: (ఇక సొంత ఊరే.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్) నర్సీపట్నానికి చెందిన వ్యాపారి క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఈ వ్యాపారి వద్దకు వచ్చి రంగురాళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సిగనాపల్లి క్వారీలో లభ్యమైన రంగురాళ్లు సుమారు రెండు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. రంగురాళ్ల వ్యాపారుల ధన దాహనికి మరింత మంది అమాయకులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు, అటవీ, రెవెన్యూ అధికారులు రంగురాళ్ల తవ్వకాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదు రంగురాళ్ల తవ్వకాలు, స్మగ్లింగ్ జరిపితే వదిలే ప్రసక్తి లేదు. లీజు క్వారీల వద్ద తప్ప మిగిలిన చోట్ల తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి రంగురాళ్ల తవ్వకాలకు వెళ్ళ వద్దు. ఎవరైనా వ్యాపారులు డబ్బులిచ్చి తవ్వకాలు జరపమని ప్రోత్సహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. –మణికంఠ చందోలు, నర్సీపట్నం ఏఎస్పీ -
రంగురాళ్ల తవ్వకాలపై ఆరా
విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం):సాలికమల్లవరం రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు జరిగినట్టు వచ్చిన సమాచారంతో ఎస్ఐ నారాయణరావు, వీఆర్వో పడాల్ క్వారీ ప్రాంతాన్ని ఆదివారం పరిశీ లించారు. గ్రామ సమీపంలో జిరాయితీ భూమి లో గతంలో రంగురాళ్లు బయటపడ్డాయి.ఆదివారం కొంతమంది ఈ క్వారీలో మట్టిని తరలించి, సమీప తాండవ నది సమీపంలో నీటితో రంగురాళ్లు కడిగినట్టు వచ్చిన సమాచారంతో ఆ ప్రాంతాలను పరిశీలించారు. తాండవ నది పరిసరాలు అన్నింటిని పరిశీలించిన ఎస్ఐ, వీఆర్వోలు, సాలికమల్లవరంలో గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అయితే ఇక్కడ తవ్వకాలు జరగలేదని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై వీఆర్వో పడాల్‌ను సంప్రదించగా జిరాయితీ భూమిలో రంగురాళ్లు తవ్వినట్టు వచ్చిన సమాచారంతో తాండవ నది పరిసర ప్రాంతాలను పరిశీలించినట్టు చెప్పారు. ఎక్కడా తవ్వకాలు జరగలేదని తెలిపారు. -
నాగేటి సాలల్లో దోసిళ్లకొద్దీ ‘చరిత్ర’
సాక్షి, హైదరాబాద్ : అది ఓ గ్రామ శివారు ప్రాంతం.. గుట్ట దిగువన పంట చేలలో ఎన్నో రాతిముక్కలు. రాళ్లు కనిపించడంలో వింతేముంది అనుకుంటున్నారా.. అవన్నీ ఓ వైపు మొనదేలి గొడ్డలిని పోలి ఉన్నాయి. కొత్త రాతియుగంలో వేట, చెట్లు నరికేందుకు మానవులు వినియోగించిన గొడ్డళ్లే ఇవి. అయితే ఒకే ప్రాంతంలో వందల సంఖ్యలో ఎందుకున్నాయన్నది ప్రశ్న. దట్టమైన అడవి, కావల్సినన్ని నీటి వనరులు, ఆవాసానికి యోగ్యమైన గుట్టలు.. ఆ ప్రాంతం ఆదిమానవులకు అనువుగా ఉండేది. దీంతో వేల ఏళ్లపాటు మనుగడ సాగించి వారికి అవసరమైన రాతి పనిముట్ల తయారు చేసుకున్నారనేది చరిత్రకారుల వాదన. అందుకే ఇక్కడ తయారై వినియోగించని రాతి గొడ్డళ్లు విస్తారంగా లభిస్తున్నాయి. ఇదంతా క్రీ.పూ.3 వేల ఏళ్ల క్రితం నాటి సంగతట!.. ఈ ప్రాంతంలో భూమి దున్నుతున్నప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ, నలుపు... ఇలా ఎన్నో రంగుల్లో, రకరకాల ఆకృతుల్లో పూసలు దొరుకుతున్నాయి. వీటిలో కొన్ని మట్టితో తయారు కాగా, మరికొన్ని గాజుతో రూపొందినవి. ఇవి కుప్పపోస్తే దోసిళ్లకొద్దీ జమవుతున్నాయి. పూర్తిగా రూపొందినవి, అసంపూర్తిగా ఉన్నవి, పూసల తయారీకి అవసరమైన ముడి సామగ్రి... వీటిని గమనిస్తే ఈ ప్రాంతం పూసల తయారీకి కేంద్రమని తెలుస్తోంది. ఇందులో మట్టి పూసలు శాతవాహనుల కాలానికి సంబంధించి క్రీ.పూ. ఒకటో శతాబ్దానికి చెందినవి కాగా, గాజు పూసలు క్రీ.శ.ఒకటి శతాబ్ది తర్వాతవనేది చరిత్రకారుల మాట. విభిన్న కాలాల చరిత్ర... ఆ ప్రాంతంలో మందపాటి కాగు (కుండ కంటే పెద్దవి) పెంకులు, వాటిల్లో గాజు అంటిన గుర్తులు.. ఇవి గాజు బట్టీకి గుర్తులు. ఆ పక్కనే ముడి ఇనుము ముద్దలు. అవి ఇనుప బట్టీ ఆధారాలు. వెరసి గాజు, ఇనుప పరిశ్రమకు నెలవది. వెరసి.. 5 వేల పరిణామక్రమంలో మానవ మనుగడకు సజీవ సాక్షాలెన్నో. ఒకే ప్రాంతంలో ఇలా విభిన్న కాలాల చరిత్రను కళ్లకు కడుతున్న గ్రామమే సిద్దిపేట జిల్లాలోని కొండపాక. ఆదిమానవుల అడుగుజాడలు, శాతవాహనుల విజయగాధలు, కళ్యాణి చాళక్యుల నిర్మాణాలు, కాకతీయ రాజుల నాటి ఆలయాలు.... కొండపాక ఇప్పుడు చరిత్రకారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుత మండల కేంద్రంగా ఉన్న ఈ గ్రామం చారిత్రక ప్రాధాన్యముందన్న సంగతిని చాలాకాలం క్రితమే చరిత్రకారులు గుర్తించారు. అడపాదడపా పరిశోధనలు చేసి ఆధారాలు సేకరించారు. కానీ ఎక్కువ పర్యాయాలు ఆలయాలు కేంద్రంగానే ఇవి సాగాయి. కానీ శివారు ప్రాంతం మల్లన్నగుట్ట వద్ద మానవ పరిణామ క్రమంపై ఇప్పుడు వెలుగుచూస్తున్న ఆధారాలు కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నాయి. గతంలో కొందరు పరిశోధకులు ఈ దిశగా కొన్ని ఆధారాలు సేకరించగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొన్ని ఆధారాలు సేకరించి పరిశీలిస్తున్నారు. నాగేటి చాలు చెప్పే సంగతులెన్నో.... ఆదిమానవులు కూడా సమూహంగా జీవించారనేందుకు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కానీ, పనిముట్లను ఎవరికి వారుగా తయారు చేసుకుని వేట, వ్యవసాయం సాగించారు. అయితే, ఒకేచోట ఆయుధాలు తయారు చేసుకున్నట్లు చెప్పే ఆధారాలు చాలా తక్కువ. కానీ కొండపాక శివారు మల్లన్నగుట్ట కింద లభిస్తున్న రాతి పనిముట్లు... వేల యేళ్ల క్రితమే రాతి పనిముట్ల తయారీ కర్మాగారం నిర్వహించినట్లు తెలుస్తోందని ఆ బృందం సభ్యులు హరగోపాల్, వేముగంటి మురళి, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం సాగులో ఉండటంతో దున్నినప్పుడల్లా ఈ రాళ్లు వెలుగుచూస్తున్నాయన్నారు. వీటిల్లో గొడ్డళ్లు ఎక్కువగా ఉన్నాయని, రెండువైపులా పదునున్నవి కూడా ఇక్కడ కనిపించినట్లు వెల్లడించారు. ఇక చేలలో ఎక్కడ చూసినా రంగు పూసలు, నాటి గాజు ముక్కలు, గాజు అంటి ఉన్న కుండపెంకులు, టెర్రకోట బొమ్మల ముక్కలు, శాతవాహనుల కాలం నాటి భారీ ఇటుకలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. గతంలో హుస్నాబాద్ సమీపంలోని గాజుల బస్వాపూర్, భువనగిరి సమీపంలోని బస్వాపూర్‌లో గాజుల బట్టీలు వెలుగుచూశాయి. ఇక్కడ తవ్వకాలు జరిపితే బట్టీ నిర్మాణ శిథిలాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. సమీపంలోని గుట్టపై భారీ రాళ్లతో రూపొందించిన గూడు సమాధుల (డోల్మెన్స్) ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. ఇవి ఆదిమానవుల జాడకు సజీవ సాక్ష్యం. ఇక రాతి పనిముట్లు నూరేందుకు వినియోగించే గ్రూవ్స్ కూడా ఉన్నాయి. ఇక కాకతీయ సైనికులు (ఎక్కటీలు) నిర్మించిన త్రికూటాలయం, రుద్రేశ్వరాలయం, మల్లన్నగుట్టపై శిథిల దేవాలయాలు ఉన్నాయి. రుద్రదేవుడు, గణపతి దేవుడి కాలంలో వేయించిన శాసనాలు, కళ్యాణి చాళుక్యుల నాటి మరో శాసనం కూడా ఉంది. కానీ.. ఇప్పటి వరకు పురావస్తుశాఖ ఇక్కడ ఎలాంటి అధ్యయనం నిర్వహించలేదు. వ్యవసాయ పనులతో నాటి చారిత్రక ఆధారాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భవిష్యత్‌లో అక్కడ ఈ మాత్రం ఆధారాలు కూడా లభించే అవకాశం లేదు. -
రంగురాళ్ల వేట మొదలైంది !
గుడిమెట్ల (నందిగామ): వజ్రాలు, రంగురాళ్లకు ఈ ప్రాంతం అత్యంత ప్రసిద్ధిగాంచింది. అనాది నుంచి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల (రామన్నపేట), కృష్ణాతీరం వజ్రాల గనిగా వాసికెక్కింది. మనసు పెట్టి అన్వేషణ సాగిస్తే, ఏదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. సాధారణరకం మొదలుకొని రూ.లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమైన సందర్భాలు అనేకం ఉండటమే ఇందుకు నిదర్శనం. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా పరిటాల చెరువులోనే లభించిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. కొనసాగుతున్న అన్వేషణ.. గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాలు అధికంగా లభిస్తుండటంతో దశాబ్ధాల క్రితం చందర్లపాడులో వజ్రాల కర్మాగారం కూడా ఉండేది. రెండు దశాబ్ధాల క్రితం వరకు వజ్రాల వేట ముమ్మరంగా సాగేది. రాను రాను అన్వేషకుల సంఖ్య ఎక్కువ కావడంతో వీటి లభ్యత తగ్గిపోయింది. అయితే, ఇప్పటికీ ఆశావహులు తొలకరి జల్లులు కురిస్తే చాలు వజ్రాల వేటకు బయలుదేరుతారు. ఇందుకోసం వీరు ప్రధానంగా చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల శివార్లలో కృష్ణానది ఒడ్డును ఎంచుకుంటారు. ఇక్కడే తవ్వకాలు అధికంగా సాగిస్తారు. కొందరు ఏకంగా భోజనాలు సిద్ధం చేసుకొని వచ్చి మరీ అన్వేషణ సాగిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట కొనసాగించి చీకటి పడుతున్న వేళ ఇళ్లకు వెళ్లిపోతుంటారు. ఏటా తొలకరి జల్లుల సమయంలో ఇక్కడ వజ్రాల వేట ప్రారంభమవడం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి వజ్రాల వేట సాగిస్తుంటారు. ప్రతినిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. ఇక్కడ వజ్రాలతోపాటు రంగురాళ్లు కూడా అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. దీంతో కూలి ఖర్చుకు ఢోకా ఉండదని చెబుతారు. కొందరైతే వర్షాకాలంలో ఏకంగా వజ్రాల వేట కోసమే గుడిమెట్ల గ్రామంలో ఇళ్లు అద్దెకు తీసుకొని నెలలపాటు అక్కడే నివాసముంటారని గ్రామస్తులు చెబుతున్నారు. -
దాచేపల్లిలో రంగురాళ్ల వేట
దాచేపల్లి: దాచేపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోని శంకరపురం– భట్రుపాలెం గ్రామాల మధ్య ఉన్న కొండలో రంగురాళ్ల వేట యథేచ్ఛగా సాగుతోంది. వ్యాపారులు నియమించి మధ్యవర్తుల ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. కొండలో సూమారుగా 100కి పైగా సొరంగాలు తీశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో సొరంగం 50 నుంచి 70 అడుగుల లోతులో ఉండటం విశేషం. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ కిందికి దిగి కొందరు రాళ్ల వేట సాగిస్తున్నారు. రహస్యంగా రవాణా.. రంగురాళ్లను చాకచక్యంగా గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు విజయవాడ, ప్రకాశం జిల్లా తెలంగాణాలోని హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడెం, రాజస్థాన్, హిమచల్ప్రదేశ్కు తరలిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యపట్టణాలకు చెందిన వ్యాపారులు మధ్యవర్తుల సాయంతో ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. లోకల్ కార్మికులు 10, 20 కిలో చొప్పున రంగురాళ్లను మూటలుగా కట్టి ఆటోలు, కార్లలో తరలిస్తున్నారు. కాట్రపాడు, భట్రుపాలెం గ్రామాల పరిధిలోని కృష్ణా నది నుంచి కూడా తెలంగాణాలోకి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడే కోవర్టులు ఏర్పాటు చేసుకుని రవాణా సాగించడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. ఈ రాళ్లకు మస్త్ గిరాకీ.. శంకరపురం కొండలో నుంచి తీసే రంగురాళ్లకు గిరాకీ బాగానే ఉందని తెలుస్తోంది. దొరికిన రాళ్లలో అష్టముఖి, పంచముఖి ఆకారపు రాళ్లు తయారీకి పనికొచ్చేవి ఉంటే ఇక పండగే. వాటి ధర సుమారు రూ.10 వేలకు పైగా ఉంటుందని అంచనా. ఇతర వాటర్పీస్, గంజిరాళ్లయితే కిలో రాళ్లు రూ.5 వేల చొప్పున పలుకుతాయని తెలుస్తోంది. కొండ నుంచి తీసే సాధారణ రాళ్లు కూడా కిలో రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తారని తెలిసింది. ఒకే రాయి 5 కిలోల బరువు ఉంటే దానికి ప్రత్యేక పారితోషికాలట. సదరు రాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించి రాతి బొమ్మలు, కొయ్యబొమ్మలు, పూసల దండలు, ఆభరణాల మధ్యలో ధగధగ మెరిసే రాళ్లుగా మారుస్తారని సమాచారం. అధికారులకు అనధికార సవాల్.. దాచేపల్లి పరిసర ప్రాంతంలోని శంకరపురం, భట్రుపాలెం, దాచేపల్లి, కాట్రపాడు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపడుతూ అధికారులకు అనధికార సవాళ్లు విసురుతున్నారు. అటవీశాఖ పరిధిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతోనే తవ్వకాలను కట్టడి చేయలేకపోతున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉన్న అరకొర సిబ్బందితో నిఘా పెట్టడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. ఒకవేళ తనిఖీ చేసినా తవ్వకాలు చేపడుతున్న కూలీలు దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దమ్ముంటే తమన పట్టుకోమని సవాల్ విసురుతున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మరోవైపు ఆ శాఖ అధికారుల్లో కొందరు మామూళ్లకు అలవాటు పడి నిఘా సంగతి మరచిపోయారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరణాలు సంభవించాయి.. రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలో రంగురాళ్ల వేటకు సొరంగంలోకి వెళ్లిన ఓ కూలి మృతి చెందాడు. ఘటన బయటకు రాకుండా మధ్వవర్తులు జాగ్రత్తలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ కొండపై వందమందికిపైగా కూలీలు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాత్రిళ్లు టార్చిలైట్లు, జనరేటర్లనూ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఈ మూడేళ్లలో సుమారు వందల టన్నుల రంగురాళ్లు హద్దులు తరలివెళ్లాయనేది ఓ అనధికార అంచనా. తవ్వకాలు జరిపితే రౌడీ షీట్లు తెరుస్తాం.,. కొండల్లో అక్రమంగా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపే ఊరుకోం. సదరు వ్యక్తులు పట్టుబడితే రౌడీషీట్లు తెరుస్తాం. వారి వెనుక ఎంతటి వారైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. – అద్దంకి వెంకటేశ్వర్లు, ఎస్సై, దాచేపల్లి -
యథేచ్ఛగా రంగురాళ్ల వేట
* పల్నాడు అటవీ ప్రాంతంలో తవ్వకాలు * అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమాలు * ఆదివారం మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం * భట్రుపాలేనికి చెందిన టీడీపీ నేతలవిగా గుర్తింపు సాక్షి, గుంటూరు: పల్నాడులోని దాచేపల్లి, బెల్లంకొండ అటవీ భూముల్లో రంగు రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఏడాదిగా ఈ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ జూన్‌లో అటవీ అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకుని తవ్వకాలను నిలిపివేశారు. అయితే రాత్రిపూట రహస్యంగా టార్చిలైట్ల వెలుతురులో తవ్వకాలు జరిపించిన అధికార పార్టీ నేతలు పది రోజులుగా ఉధృతం చేశారు. రంగురాళ్ల తవ్వకాలు జరిగే ప్రాంతంలో మూడు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసినట్లు స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. ఇవి ఆదివారం అర్ధరాత్రి దగ్ధమైనట్లు తెలిసింది. ఈ ద్విచక్ర వాహనాలు దాచేపల్లి మండలం భట్రుపాలేనికి చెందిన అధికార పార్టీ నేతలవిగా చెబుతున్నారు. రంగురాళ్ళ కోసం తవ్వకాలు జరిపేది అధికార పార్టీ నేతలే అనడానికి ఇంతకంటే మరో ఉదాహరణ లేదు. స్థానిక అధికార పార్టీ నేతలు కొందరు హైదరాబాద్‌కు చెందిన దళారుల సహాయంతో తవ్వకాల్లో లభ్యమైన రంగురాళ్ల ముడిసరుకును నేరుగా రాజస్థాన్‌కు రవాణా చేస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. రంగురాళ్ల వేట అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఆవైపునకు తిరిగి చూడడం లేదు. పది రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరిగినప్పటికీ తమకేమీ తెలియనట్లు నిద్ర నటిస్తున్నారు. దాచేపల్లి మండలం శంకరాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పది రోజులుగా భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాలకు చెందిన కూలీలు గ్రూపులుగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ గ్రూపులన్నీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతల కనుసన్నల్లోనే రంగురాళ్ల వేట సాగిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా శంకరాపురం అడవుల్లో 15 నుంచి 20 అడుగుల లోతు సొరంగాలు తవ్వుతున్నారు. ఈ ప్రాంతంలో రంగు రాళ్ల ముడి రాయి అధికంగా దొరుకుతుంది. ఇక్కడ రంగు రాళ్లతోపాటు బంగారు ఆభరణాల్లో ఉపయోగించే ఖరీదైన జాతి రాళ్లు సైతం దొరుకుతుండటంతో మాఫియాగా తయారై తవ్వకాలు సాగిస్తున్నారు. అన్నీ తెలిసినా అటువైపు చూడని అధికారులు.. అటవీ ప్రాంతాల్లోని తండాల ప్రజలు బోరు వేసుకోవాలన్నా అనుమతుల కోసం ఇబ్బందులు పెట్టే అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. తవ్వకాల్లో ఓ కూలి ప్రమాదవశాత్తు మృతి చెందినప్పటికీ దాన్ని కూడా బయటకు పొక్కనీయకుండా గప్‌చుప్‌గా అంత్యక్రియలు కానిచ్చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. తాజాగా తవ్వకాలు జరిగే ప్రాంతంలో అధికార పార్టీ నేతలకు చెందిన మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం కావడంతో ఇప్పటికైనా పోలీస్, అటవీశాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తారా లేదా అనే చర్చనీ యాంశమైంది. -
గుట్టుగా రంగురాళ్ల తవ్వకం
చోద్యం చూస్తున్న అధికారులు నంగునూరు: రంగురాళ్లు తవ్వుతూ కొందరు వ్యాపారులు అక్రమ రవాణా చేస్తూ కాసులు గడిస్తున్నారు. రహదారికి సమీపంలోనే ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ఓ రైతు పొలంలో కొన్ని రోజులుగా రంగు రాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా తవ్వకాలు జరిపి రాళ్లను సేకరించి అనంతరం భూమిని చదును చేస్తున్నారు. అనంతరం ఆదే భూమిలో మొక్కలను నాటుతూ ప్రతి రోజు కూళీల చేత రాళ్లను వేరు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. భూమిలో నుంచి ఖనిజాలను తీయాలంటే తప్పనిసరిగా మైనింగ్ అధికారులు లేదా రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొందరు వ్యాపారులు తవ్వకాలు చేపట్టి రెండు రోజులకోమారు రంగు రాళ్లను దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. భూమిలో నుంచి తీసిన పెద్ద రాళ్లను వేరు చేసి కూలీల చేత తమకు కావలసిన సైజులో తయారు చేసి అటోలో తరలిస్తున్నారు. రోడ్డు పక్కనే అక్రమ పారం జరుగుతున్నా అధికారుల పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. -
భారీగా రంగురాళ్ల పట్టివేత
వైరా: ఖమ్మం జిల్లాలో భారీగా రంగురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 18 బస్తాల రంగురాళ్లను శనివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైరాలోని నవత రోడ్ ట్రాన్స్పోర్ట్కు కొణిజర్లకు చెందిన ఓ వ్యక్తి 18 బస్తాల రంగురాళ్లను తీసుకొచ్చాడు. మళ్లీ వచ్చి బుక్ చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. ట్రాన్స్పోర్ట్ గోదాములో రంగురాళ్లు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు గోదాములో తనిఖీలు చేపట్టి 18 బస్తాల రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రంగురాళ్ల ముఠాలో టీడీపీ నాయకులు!
విజయనగరం: రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో గురువారం జరిగింది. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ. 20 వేల నగదుతో పాటు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముఠాకు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు పరారిలో ఉన్నారు. పరారిలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. పట్టుబడ్డ వారిలో నర్సిపట్నంకు చెందిన టీడీపీ నాయకులు ఉన్నట్లు సమాచారం. రంగురాళ్లను విక్రయించిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
రూ.15 లక్షల నగదు, రంగురాళ్లు స్వాధీనం
కొత్తగూడెం : స్థానిక ఎన్నికలతో పాటు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కొత్తగూడెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారి సోదాల్లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.12 లక్షల నగదు బయటపడింది. ఆ నగదుకు సరైన ఆధారాలు లేకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని విచారిస్తున్నారు. మరోవైపు కొత్తగూడెం మండలం రామవరంలో 200 బస్తాల రంగురాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు లక్షల నగదును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.