బీచ్లలో డ్రెస్ కోడ్ | Dress code in Beaches | Sakshi
Sakshi News home page

బీచ్లలో డ్రెస్ కోడ్

Published Tue, Sep 2 2014 7:34 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

గోవా బీచ్

గోవా బీచ్

పణజి: గోవా బీచ్‌లలో వస్త్రధారణపై ఇటీవల కాలంలో చాలా తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతోంది.  నిన్నమొన్నటి వరకు యువతుల వస్త్రధారణపై వాడివేడిగా మంత్రుల స్థాయిలో చర్చ జరుగగా, ఇప్పుడు పురుషుల వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు. బీచ్లలో పురుషులకు కూడా వస్త్రధారణ కోడ్ ఉండాలని ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మైకేల్ లోబో మంగళవారం డిమాండ్ చేశారు.

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పురుషులకు వస్త్రధారణ  కోడ్ ఉండాలన్నారు. సరైన స్విమ్ సూట్ (ఈత కొట్టే సమయంలో వేసుకునేది) ధరించాలని, అసభ్యకరంగా కనిపించే లో దుస్తులను అనుమతించరాదని ఆయన అన్నారు. మగ యాత్రికులు కొందరు  అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని ఆయన చెప్పారు. సింగపూర్, దుబాయ్, మలేషియాలలో మాదిరి ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

గత నెలలో గోవా బీచ్లో యువతుల బికినీలపై నిషేధించాలని ఓ మంత్రి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో గోవా టూరిజం శాఖ కంగారు పడింది. గోవా బీచ్లో బికినీలపై నిషేధం లేదని ప్రకటించింది. అంతే కాకుండా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మనోహర్ పరిక్కర్  గోవా బీచ్ లలో బికినీ ధరించడంపై నిషేధం విధించడం లేదని  ఓ ప్రకటన చేయవలసి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement