tranfers
-
కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ : ఆమె బెంగళూరుకు బదిలీ
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న వివాదంలో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్విందర్ కౌర్‌కు ఊరట లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఉపసంహరించుకున్నఅనంతరం, బెంగళూరులోని CISF రిజర్వ్ బెటాలియన్‌కు బదిలీ చేశారు.చంఢీగడ్ ఎయిర్‌పోర్టులో రైతు ఉద్యమాన్ని కించపర్చారంటూ సీఐఎస్ఎఫ్ జవాను కుల్విందర్ కౌర్ కంగనాను చెంప దెబ్బ కొట్టారు. ఈ కేసులో ఆమె సస్పెన్షనకు గురైంది. తాజాగా ఆమెను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం.కాగా 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పార్లమెంట్‌కు ఎంపికైన కంగనాను గత నెలలో చంఢీగడ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కౌర్ చెంపదెబ్బ కొట్టడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అంతర్గత విచారణ తర్వాత కౌర్‌పై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో దాడి కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో విమర్శలతో పాటు ఆమెకు మద్దతు కూడా లభించింది. ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, తదితరులు ఆఫర్లు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
బదిలీలతో బరితెగింపు
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్ బృందం ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్ అధికారుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారు. మరో 94 మందికి సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
TS IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంవో సెక్రటరీగా చంద్ర శేఖర్ రెడ్డి(IFS)ని నియమించింది. బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, గద్వాల కలెక్టర్లు ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై కూడా బదిలీ వేటు పడింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మిత.. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్థానచలనం పొందారు. ► రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శశాంక నియామకం ►నల్గొండ కలెక్టర్‌గా దాసరి హరిచందన. ►మహబూబాబాద్ కలెక్టర్‌గా అద్వైత్ కుమార్. ►సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి. ►గద్వాల కలెక్టర్‌గా బీఎం సంతోష్ ►సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు ►నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ ►మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్‌గా మహేష్ ధత్ ఎక్కా.. ►పురావస్తు శాఖ డైరెక్టర్‌గా భారతీ హోళికేరి ►మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా డీ దివ్య నియామకం ►టీఏస్ డైరీ కార్పొరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మి ►ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్. ► ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ ►కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యా . ►మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎంఎం ఖానమ్. ►సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ. ►జీహెచ్ఎంసీ జోనల్ కమిషర్‌గా అభిలాష అభినవ్. ►హైదరాబాద్ లోకల్ బాడిస్ అడిషనల్ కలెక్టర్‌గా ఖదిరావన్. ►బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్ర వెంకటేష్ నియామకం. ►పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సల్తానియా. ►పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్. ►GAD పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్ రావు నియామకం. ►ఆయుష్ డైరెక్టర్‌గా ఎం ప్రశాంతి. ►ఫైనాన్స్, ప్లానింగ్ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ భాస్కర్. ►TSMSIDC ఎండీగా కర్ణన్. ►రిజిష్టర్ అండ్ కో - ఆ సొసైటీ డైరెక్టర్ హరిత. ఇక ఫైనాన్స్ సెక్రెటరీగా చేసిన రామకృష్ణ రావుకు ఎలాంటి పోస్ట్ కేటాయించలేదు ప్రభుత్వం. -
ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లపై హైకోర్టులో తుది విచారణ
సాక్షి, హైదరాబాద్: ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన 12 మంది అధికారులకు సంబంధించిన పిటిషన్‌పై తుది విచారణ జరుపుతోంది. గతంలో సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఎన్నికలు కమిషన్ వాదిస్తోంది. హైకోర్టులో తుది విచారణ జరుగుతుండటంతో తీర్పు ఎలా వస్తుందన్న దానిపై ఐఏఎస్ఉ, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఏపీ విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 376 మంది ఐఏఎస్, 258 మంది ఐపీఎస్, 149 ఐఎఫ్ఎస్ అధికారులను ప్రత్యూష్ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు పంపకాలు చేసింది. పునర్విభజన తర్వాత ఏపీకి వెళ్లేందుకు కొంతమంది అధికారులు ఇష్టపడటం లేదు. క్యాట్ తీర్పును అడ్డుపెట్టుకొని తెలంగాణలోనే పనిచేస్తున్నారు. వాస్తవానికి రూల్ 5(1) ప్రకారం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒప్పంద పత్రం రాసి ఉంటారు. అయితే తెలంగాణలో కొంతమంది అధికారులు ఏపీకి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్, జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏపీకి వెళ్లని ఐఏఎస్‌ల జాబితాలో హరికిరణ్, అనంతరామ్, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, శివశంకర్ లోహితి, ఎస్,ఎస్ రావత్, గుమ్మల శ్రీజన, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాదా్, డిప్యూటేషన్‌పై సెంట్రల్ బిష్టా ఉన్నారు. ఆమ్రాపాలి, అబిలాష్ బిస్టా డిప్యూటేషన్‌పై కేంద్రంలో పనిచేస్తున్నారు. ఏపీకి వెళ్లని ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కూడా ఉన్నారు. చదవండి: నేడు మరోసారి రాష్ట్రానికి అమిత్ షా.. మూడుచోట్ల ప్రసంగం గతంలో హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లారు. అక్కడ జాయిన్ అయి ముందస్తు రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చేశారు. సోమేష్ కుమార్ తీర్పుకు భిన్నంగా అభిషేక్ మహంతి కేసు ఉంది. ఉమ్మడి ఏపీ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా యువ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని కేంద్రం ఏపీకి కేటాయించింది. తనను తెలంగాణ కేడర్‌కి కేటాయించాలని ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన పరిపాలన ట్రిబ్యునల్ అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఏపీకి.. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణకు క్యాట్ ఆదేశాలిచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం మహంతిని రిలీవ్ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయనను విధుల్లోకి తీసుకోకుండా తాత్సారం చేసింది. ఈ వ్యవహారంపై మహంతి మరోమారు ట్రిబ్యునల్‌కి వెళ్లారు. క్యాట్ ఆదేశాలు అమలు చేయలేదంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌పై ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తూ.. అభిషేక్ మహంతికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. చాలాకాలంపాటు పోస్టింగ్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీగా బాధ్యతలు అప్పగించింది. నేడు తుది వాదనల తర్వాత తీర్పు ఎన్నికలలోపు వస్తుందా? రాదా.. ఎన్నికల కమిషన్ హైకోర్టుకు ఎలాంటి వాదనలు వినిపిస్తుందోనని ఆసక్తిగా మారింది. సోమేష్ కుమార్‌కు తీర్పుఇచ్చేనట్లు తీర్పు వస్తే 12 మంది ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది. -
ఏపీలో పలువురు ఎస్పీల బదిలీ
-
ఏపీ: వైద్య ఆరోగ్య శాఖలో నూతన శకం
సాక్షి, అమరావతి : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో పైరవీలు, పలుకుబడుల సంప్రదాయానికి సీఎం జగన్ సర్కార్ చెక్ పెట్టింది. అడ్డగోలు డిప్యుటేషన్లను రద్దు చేసింది. ఉద్యోగులు డీఎంహెచ్‌వో, ఆర్డీ, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితికి తావివ్వకుండా వైద్య శాఖ చరిత్రలో తొలి సారి ఆన్లైన్ బదిలీలను చేపట్టింది. ఏపీ వైద్య విధాన పరిషత్ మినహా అన్ని విభాగాల్లో ఐదేళ్లు ఒకే చోట పని చేసిన ఉద్యోగుల్లో 30 శాతం మందిని ఇటీవల బదిలీ చేశారు. సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, స్పౌజ్ కోటా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ పారదర్శకంగా బదిలీలు చేపట్టారు. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పోస్టింగ్‌లు వచ్చాయి. ఎలాంటి పైరవీలు లేకుండా రాష్ట్ర చరిత్రలో వైద్య శాఖలో తొలిసారి ఇలా బదిలీలు చేపట్టడం ఓ రికార్డు అని, చంద్రబాబు పాలనలో ఈ తరహాలో ఏనాడైనా బదిలీలు జరిగాయా అని వైద్య శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో అన్ని హోదాల్లో 3,710 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఐదేళ్లు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసుకున్న వారిలో 923 మంది, రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్న 117 మంది.. మొత్తంగా 1,040 మంది బదిలీ అయ్యారు. వీరిలో ఇప్పటికే 1,022 మంది బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేశారు. ప్రజారోగ్య విభాగంలో 104 క్యాడర్లలో 4,761 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. వీరిలో ఇప్పటికే మెజారిటీ శాతం మంది కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక నిర్ణయాలు.. ఉమ్మడి రాష్ట్ర ఆవిర్భావం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెనుమార్పులను సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకువస్తోంది. నాడు–నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మారుస్తోంది. రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో మరమ్మతులు చేస్తున్నారు. భవనాలు, ఉపకరణాలు సమకూరుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ, ఉద్యోగుల బదిలీలు, వారికి ఉద్యోగోన్నతుల్లోనూ నూతన శకాన్ని ప్రారంభించారు. గతంలో వైద్య శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు ప్రహసనంలా ఉండేవి. పాలకుల అండ ఉన్న వారికి మాత్రమే అగ్రతాంబూలం దక్కేది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసింది. -
పరస్పర బదిలీలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఒక లోకల్ కేడర్ నుంచి మరో సమాన లోకల్ కేడర్‌కు పరస్పర బదిలీకి అనుమతిచ్చింది. ఒకే శాఖలో సమాన హోదా పోస్టులు కలిగిన ఇద్దరు వ్యక్తులు, వేర్వేరు సమాన లోకల్ కేడర్‌లో పనిచేస్తుంటేనే పరస్పర బదిలీకి అర్హులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు (జీవో నం.21) జారీ చేశారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తైన తర్వాత ఉద్యోగవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీల కోసం ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా మార్చి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరిపాలన అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఏ దరఖాస్తునైనా తిరస్కరించేందుకు చాన్స్ ఉంది. ఇద్దరిలో ఒక్కరు బదిలీ అయి ఉండాలి ► పరస్పర బదిలీ కోరుకునే ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరైనా, కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుల్లో స్థాన చలనం పొంది ఉండాలి. ► ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు సమాన మేనేజ్మెంట్(ప్రభుత్వ/జెడ్పీ), సమాన హోదా, సమాన సబ్జెక్టు, సమాన మాధ్యమానికి లోబడి పరస్పర బదిలీకిఅర్హులు. జిల్లా పరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని అలాంటి ఇతర జిల్లా పరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థలకు మాత్రమే బదిలీ చేస్తారు. సీనియారిటీ వదులుకోవాల్సిందే.. ► పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ హక్కులను వదులుకోవడంతో పాటు కొత్త లోకల్ కేడర్లలో చివరి ర్యాంకును పొందేందుకు అంగీకారం తెలుపుతూ పరస్పర బదిలీ కోరే ఇద్దరు వ్యక్తులూ నిర్దేశిత నమూనాలో రాతపూర్వక హామీ ఇవ్వాలి. కొత్త లోకల్ కేడర్లలోని చివరి రెగ్యులర్ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంక్‌ను పరస్పర బదిలీపై వెళ్లే ఉద్యోగులకు కేటాయించనున్నారు. ► విజ్ఞప్తి మేరకు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ఉద్యో గులు ఎలాంటి టీఏ, డీఏలకు అర్హులు కారు. ► కోర్టు ఆదేశాల మేరకు పాత కేడర్లలో కొనసాగుతున్న ఉద్యోగులు, సస్పెన్షన్‌లో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు, పాత కేడర్లలో అనధికారికంగా గైర్హాజరవుతున్న వారు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఒక్కరికే సమ్మతి ఇవ్వాలి ► ఒక ఉద్యోగి ఇతర సమాన లోకల్ కేడర్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి మాత్రమే పరస్పర బదిలీకి సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. ► ఆన్లైన్ ద్వారా పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీని సంబంధిత శాఖకు జిల్లా/జోనల్ అధిపతి ద్వారా పంపించాలి. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే మరో దరఖాస్తుకు అవకాశం ఉండదు. సరైన సమాచారం ఇచ్చే విషయంలో పూర్తి బాధ్యత ఉద్యోగులదే. ► సంబంధిత విభాగాధిపతి దరఖాస్తులను పరిశీలించి సమగ్ర ప్రతిపాదనలను శాఖ కార్యదర్శికి సమర్పించాలి. సాధారణ పరిపాలన శాఖ అనుమతితో శాఖ కార్యదర్శి పరస్పర బదిలీలకు ఉత్తర్వులు జారీ చేస్తారు. దరఖాస్తు ఎలా చేయొచ్చు.. ఎలా చేయకూడదు ► స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులో ఉన్న ఉపాధ్యాయుడు సమాన స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులో ఉన్న మరో ఉపాధ్యాయుడి పోస్టు కోసమే దరఖాస్తు చేసుకోవాలి. ► స్కూల్ అసిస్టెంట్ (గణితం) తెలుగు మాధ్యమం పోస్టులోని ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులోని మరో ఉపాధ్యాయుడి పోస్టుకు దరఖాస్తు చేసుకోరాదు. ► రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులోని ఉద్యోగి అదే శాఖలోని మరో ఉద్యోగికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోరాదు. ► వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్ పోస్టులో ఉన్న ఉద్యోగి పంచాయతీరాజ్ శాఖలోని సూపరింటెండెంట్ పోస్టులోని మరో ఉద్యోగి పోస్టు కోసం దరఖాస్తు చేసుకోరాదు. -
వైరా మున్సిపాలిటీలో ఏడాదికి ముగ్గురు కమిషనర్లు బదిలీ
-
వామ్మో ఖైరతా‘బాధ’.. నేనక్కడ పనిచేయను నాయనో!
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): ఖైరతాబాద్.. హైదరాబాద్ నగరంలో వీవీఐపీలు నివాసముండే ప్రాంతం..అటువంటి ప్రాంతంలో తహసీల్దార్‌గా పనిచేయాలంటే కత్తిమీద సాములాంటిదే.. అందరికీ అనుకూలంగా ఉండాలి..అందరికీ అందుబాటులో ఉండాలి..అందరికీ పనులు చేసిపెట్టాలి.. అయితే నిబంధనలు అనేవి ఉంటాయి కదా.. అధికారులు వాటినే ఫాలో అవుతారు.. అవి నాయకులకు పట్టవు కదా..ఇవి కొందరికి నచ్చకపోవచ్చు..దీంతో తహసీల్దార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం.. ఆ తరువాత బదిలీ అస్త్రం వారిపై ప్రయోగించడం జరిగిపోవడం మామూలే.. ఇదీ ఖైరతాబాద్ మండలంలో నిత్యం జరుగుతున్న తంతు. ► ఖైరతాబాద్ మండలంలో తహసీల్దార్లు పట్టుమని పది నెలలు కూడా పని చేయకుండానే బదిలీ అవుతున్నారు. వివిధ కారణాలతో బదిలీ అవుతుండటంతో మండల పరిధిలో పాలన అధ్వానంగా మారుతోంది. ► బదిలీల వెనుక కొందరి ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మండల పరిధిలో సోమాజిగూడ, ఖైరతాబాద్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్లు వస్తాయి. అ మండలాన్ని ఎల్లారెడ్డిగూడ, ఖైరతాబాద్ యూసూఫ్‌గూడ విలేజ్ల పేరుతో విభజించి పాలన అందిస్తున్నారు. ► 2011 నుంచి రికార్డులు తీసుకుంటే ఒకే సంవత్సరంలో ముగ్గురు తహసీల్దార్లకు స్థాన చలనం కలిగింది.కొందరైతే నెల రోజులకే బదిలీ అయ్యారు. ► ఇటీవల బదిలీ అయిన జుబేద అనే తహసిల్దార్ ఆ పదవిలో పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయారు. అంతకుముందు పని చేసిన తహసిల్దార్ హసీనా ఏడాది గడువు పూర్తి చేసుకోకుండానే ట్రాన్స్ఫర్ అయ్యారు. ► దీంతో రెండు, మూడు నెలలకు, అయిదారు నెలలకు ఒకసారి తహసిల్దార్లు బదిలీలు ఎందుకు అవుతున్నారో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆరా తీసినట్లు కూడా తెలిసింది. పని ఒత్తిడి కూడా కారణమా..! ఖైరతాబాద్ మండల పరిధిలో ప్రముఖుల ఘాట్లు ఉన్నాయి. నెక్లెస్ రోడ్డుతో పాటు ఎన్టీఆర్ మార్గ్, ఇతరత్రా వీవీఐపీ ప్రాంతాలు కూడా అధికంగా ఉన్నాయి. వివిధ కార్యక్రమాల సందర్భంగా తహసీల్దార్లు నాలుగైదు రోజుల పాటు అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఇక్కడ ఉండేందుకు మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు పౌరుల సమస్యలతో పాటు అటు వీవీఐపీల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ► ఇటీవల ఓ తహసిల్దార్‌ను జిల్లా కలెక్టర్ ఆమె చేసిన నిర్వాకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లుగా తెలిసింది. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ బదిలీలు.. ► 2011 జనవరి 3న పి.లీల ఖైరతాబాద్ మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి అదే ఏడాది మే 28న బదిలీ అయ్యారు. ఆమె ఆ పదవిలో నాలుగు నెలలు కూడా ఉండలేదు. ► జె. శ్రీనివాస్ 2011 మే 29న బాధ్యతలు స్వీకరించగా రెండు నెలలు గడవకుండానే అదే ఏడాది జూలై 6వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎం. కృష్ణ జూలై 7న బాధ్యతలు స్వీకరించి 2012 జూలై 24న బదిలీ అయ్యారు. ► జె.శ్రీనివాస్ జూలై 25న బాధ్యతలు స్వీకరించి కేవలం ఒక్క రోజులోనే అంటే జూలై 26న బదిలీ అయ్యారు. ► వి. అనురాధ జూలై 27న బాధ్యతలు స్వీకరించగా 2013 జూన్ 6న బదిలీ అయ్యారు. ► సునీత 2013 జూన్ 7న బాధ్యతలు స్వీకరించి 20 రోజులు తిరగకముందే అదే ఏడాది 25వ తేదీన బదిలీ అయ్యారు. ►కె. వేణుగోపాల్‌రెడ్డి 2013 జూన్ 26న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరక్కుండానే ఆగస్టు 31న బదిలీ అయ్యారు. ► వంశీకృష్ణ 2013 సెప్టెంబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించి అయిదు నెలలు తిరగకుండానే 2014 ఫిబ్రవరి 11వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎం. శ్రీనివాసరావు 2014 ఫిబ్రవరి 10వ తేదీన బాధ్యతలు స్వీకరించగా నాలుగు నెలలు తిరగకుండానే అదే ఏడాది జూన్ 3వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎన్.శ్రీనివాస్‌రెడ్డి 2014 జూన్ 4వ తేదీన బాధ్యతలు స్వీకరించగా 2015 సెప్టెంబర్ 10న బదిలీ అయ్యారు. ఈయన ఒక్కరే ఏడాది కాలం పూర్తి చేసుకున్న తహసిల్దార్. ► టి.సైదులు 2015 సెప్టెంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్ళ పాటు సేవలు అందించి 2018 ఆగస్టు 17వ తేదీన బదిలీ అయ్యారు. ► కె. జానకి 2018 ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరగకుండానే 2018 అక్టోబర్ 16న బదిలీ అయ్యారు. ► పి. కృష్ణకుమారి 2018 అక్టోబర్ 17వ తేదీన బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే 2019 జూన్ 16న బదిలీ అయ్యారు. ► హసీన 2019 జూన్ 19న బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుముందే 2020 నవంబర్ 3న బదిలీ అయ్యారు. ► జుబేదా 2020 నవంబర్ 4న బాధ్యతలు స్వీకరించి 2021 ఆగస్టు 1వ తేదీన బదిలీ అయ్యారు. ఆమె తొమ్మిది నెలలు మాత్రమే విధుల్లో ఉన్నారు. ► ప్రస్తుత అన్వర్ ఖైరతాబాద్ మండల తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించారు. -
తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 35 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. వారి వివరాలు.. ⇒ కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్‌గా జకీర్ అహ్మద్ ⇒బెల్లంపల్లి కమీషనర్‌గా ఆకుల వెంకటేశ్ ⇒లక్స్‌ట్టిపేట్ కమిషనర్‌గా త్రియంబకేశ్వర్‌రావు ⇒నాగర్‌కర్నూల్ కమిషనర్‌గా గోనే అన్వేశ్ ⇒జగిత్యాల కమిషనర్‌గా జయంత్‌కుమార్‌రెడ్డి ⇒నిర్మల్ కమిషనర్‌గా నల్లమాల బాలకృష్ణ ⇒అమీన్పూర్ కమిషనర్‌గా సుజాత ⇒హాలియా కమిషనర్‌గా వేమనరెడ్డి ⇒తెల్లాపూర్ కమిషనర్‌గా వెంకట మణికరణ్ ⇒షాద్‌నగర్ కమిషనర్‌గా లావణ్య ⇒సంగారెడ్డి కమిషనర్‌గా శరత్చంద్ర ⇒GHMCలో డిప్యూటీ కమిషనర్‌గా ప్రశాంతి ⇒తాండూరు కమిషనర్‌గా శ్రీనివాస్‌రెడ్డి ⇒శంషాబాద్ కమిషనర్‌గా సబీర్ అలీ ⇒నర్సంపేట కమిషనర్‌గా విద్యాధర్ ⇒పరకాల కమిషనర్‌గా యాదగిరి ⇒పెద్దపల్లి కమిషనర్‌గా చదల తిరుపతి ⇒వేములవాడ కమిషనర్‌గా మట్టా శ్రీనివాస్‌రెడ్డి ⇒సత్తుపల్లి కమిషనర్‌గా కె.సుజాత ⇒ఇల్లందు కమిషనర్‌గా వీరేందర్ ⇒మందమర్రి కమిషనర్‌గా గద్దె రాజు ⇒వనపర్తి కమిషనర్‌గా మహేశ్వర్‌రెడ్డి ⇒GHMCలో డిప్యూటీ కమిషనర్‌గా రజనికాంత్‌రెడ్డి ⇒సదాశివపేట కమిషనర్‌గా స్పందన ⇒యెల్లారెడ్డి కమిషనర్‌గా అహ్మద్ ⇒హుజూర్నగర్ కమిషనర్‌గా బట్టు నాగిరెడ్డి ⇒కామారెడ్డి కమిషనర్‌గా గంగాధర్ ⇒యాదగిరిగుట్ట కమిషనర్‌గా జంపాల రజిత ⇒నందికొండ కమిషనర్‌గా పల్లారావు ⇒చిట్యాల కమిషనర్‌గా ప్రభాకర్ ⇒GHMC డిప్యూటీ కమిషనర్‌గా త్రిలేశ్వర్ ⇒GHMC డిప్యూటీ కమిషనర్‌గా ముకుంద్ రెడ్డి ⇒ఆమనగల్లు కమిషనర్‌గా శ్యాంసుందర్ -
రైల్వే బోర్డులో సంస్కరణలు
న్యూఢిల్లీ: రైల్వే బోర్డు త్వరలో పలు సంస్కరణలు చేపట్టనుంది. దీనిలో భాగంగా బోర్డు సభ్యుల సంఖ్యకు కోత విధించనుంది. బోర్డులో డైరెక్టర్, ఆపై స్థాయి అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేయాలని భావిస్తోంది. రైల్వేల నిర్వహణ తీరును మెరుగుపరచడం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వే బోర్డులో 200 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో డైరెక్టర్, ఆపై స్థాయి అధికారులుగా ఉన్న 50 మందిని (25 శాతం) రైల్వే జోన్లకు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు ఓ అధికారి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం బోర్డులో చాలా మంది సభ్యులు ఉన్నారని వీరంతా దాదాపు ఒకేలాంటి పనులు చేస్తున్నారని తెలిపారు. జోన్లలో సీనియర్ ఆఫీసర్ల కొరత కూడా ఉండటంతో వీరిని అక్కడికి బదిలీ చేయాలని భావిస్తున్నామన్నారు. వంద రోజుల ఎజెండాలో భాగంగా ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్వే బోర్డు చైర్మన్‌కు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. -
ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను రప్పించండి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పని చేస్తున్న తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో సంఘం నగర శాఖ కార్య వర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి ఐదేండ్లు దాటినప్పటికీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. నేటికీ 450 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారని చెప్పారు. చాలీచాలని వేతనంతో వారు అక్కడ ఉండలేక, రాష్ట్రానాకి రాలేక నిత్యం మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చి ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి ఆ రాష్ట్రంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏ, ఐఆర్ ఇవ్వాలని ఆయన సీఎం కేసీఆర్‌ను కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, నగర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్యదర్శి అతిక్ పాషా, కోశాధికారి అండ్రూస్, సహ అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు రాజేందర్, వెంకటేష్, యాదమ్మ, ముజీబ్, వందన, కస్తూరి పాల్గొన్నారు. -
ఉద్యోగ దంపతుల సౌకర్యార్థం బదిలీలు
హైదరాబాద్: ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న భార్యభర్తలకు వారి సౌకర్యార్థం... బదిలీలు చేయనున్నారు. భార్యభర్తలిద్దరూ తమ కుటుంబాలకు దగ్గరలోని ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వీలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న భార్యభర్తలు ఉద్యోగరీత్యా కుటుంబాలకు దూరంగా పనిచేయాలసి వచ్చేది. ప్రభుత్వ ఉద్యోగులిద్దరూ భార్యభర్తలు కావడంతో భర్త ఒకచోట, భార్య మరోప్రాంతంలో సంస్థలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ వారి కుటుంబాలకు దూరంగా ఉండవలసి రావడంతో నివాసానికి, పనిచేసే సంస్థలకు వెళ్లిరావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పూర్తిస్థాయిలో పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులైన భార్యభర్తల సౌకర్యార్థం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎమ్డీఏ పరిధిలోని సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఈ తాజా ఉత్తర్వులు వర్తించవు. జీహెచ్ఎంసీ, హెచ్ఎమ్డీఏ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసే క్రమంలో ప్రభుత్వ సంస్థలలో సీనియారిటీ హోదా ప్రకారంగా ఆయా ప్రభుత్వ సంస్థలలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.