హైదరాబాద్: ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న భార్యభర్తలకు వారి సౌకర్యార్థం... బదిలీలు చేయనున్నారు. భార్యభర్తలిద్దరూ తమ కుటుంబాలకు దగ్గరలోని ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వీలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న భార్యభర్తలు ఉద్యోగరీత్యా కుటుంబాలకు దూరంగా పనిచేయాలసి వచ్చేది. ప్రభుత్వ ఉద్యోగులిద్దరూ భార్యభర్తలు కావడంతో భర్త ఒకచోట, భార్య మరోప్రాంతంలో సంస్థలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ వారి కుటుంబాలకు దూరంగా ఉండవలసి రావడంతో నివాసానికి, పనిచేసే సంస్థలకు వెళ్లిరావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై పూర్తిస్థాయిలో పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులైన భార్యభర్తల సౌకర్యార్థం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలోని సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఈ తాజా ఉత్తర్వులు వర్తించవు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసే క్రమంలో ప్రభుత్వ సంస్థలలో సీనియారిటీ హోదా ప్రకారంగా ఆయా ప్రభుత్వ సంస్థలలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
ఉద్యోగ దంపతుల సౌకర్యార్థం బదిలీలు
Published Sat, May 21 2016 5:49 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
Advertisement
Advertisement