కొత్త టర్మినల్ ప్రారంభించిన మోదీ
చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చండీగఢ్ విమానాశ్రయంలో కొత్త టర్మనల్ ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందించనున్న ఈ టర్మినల్ను దేశానికి అంకితం చేశారు. కొత్త టర్మినల్ ద్వారా అటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని చెప్పారు.
మొత్తం రూ.939 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) , చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ భాగస్వామ్యంలో నిర్మించాయి. దీని నిర్వహణ బాధ్యతలను మాత్రం చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ చూసుకోనుంది. ఈ టర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి, కేంద్రమంత్రి పీఅశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, మనోహర్ లాల్ ఖత్తర్ పాల్గొన్నారు.