సిమ్లా: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో శుక్రవారం రోడ్ షో చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబట్టారు.
‘‘మీ అక్కాచెల్లెళ్లకు, కూతుళ్లకు వెల కట్టేవాళ్లు ఎప్పటికీ మీవాళ్లు కాలేరు. ఇక్కడ తపస్సు చేసిన మాండవ రుషి నుంచి ఈ పట్టణానికి మండి అని పేరొచి్చంది. అలాంటి పేరును కూడా కించపరుస్తున్నారు’ అని రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి అన్నారు. ‘మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది’ అని కంగనాపై సుప్రియ ఇన్‌స్ట్రాగాంలో పెట్టిన పోస్టు దుమారం రేపడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment