
బెంగళూరు: విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.
తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.
గతేడాది కూడా ఇదే తరహాలో,..
ప్రస్తుత రన్యారావు కేసుకు, గతేడాది చెన్నైలో జరిగిన బంగారం స్మగ్మింగ్ కేసుకు పోలికలు ఉండటంతో ఆ కోణంలో విచారణ ఆరంభించారు అధికారులు. గత సంవత్సరం సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య 12 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి తరలిస్తూ అధికారులకు పట్టుబడింది. అయితే తాను ఒక ఫ్రెండ్ వలలో చిక్కుకునే బంగారం స్మగ్మింగ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ఇప్పుడు ఈ కేసును కూడా అదే కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇందులో ఎవరు పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. తాను ట్రాప్ లో చిక్కుకునే ఈ కథ నడిపినట్లు ఆమె పేర్కొనడంతో దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
ఆమె ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్..
ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.
కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment