
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉందన్నారు. వ్యవసాయ సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధరకుగాను 1,72,000వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. 2020-21లో రైతులకు 75వేల కోట్ల రూపాయలు కేటాయించామని.. దీని వల్ల 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇక ఈ ఏడాది రైతు రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 40వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా మరో 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానిస్తమన్నారు. అస్సాం, బెంగాల్‌లో పని చేస్తున్న టీ కార్మికుల కోసం1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment