
పాట్నా: ముస్లింల ఓటు బ్యాంకు ముందు ఇండియా కూటమి అవసరమైతే ముజ్రా డ్యాన్స్ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రధాని బిహార్‌ను అవమానించారని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరపున బిహార్‌లోని ససరంలో ఆదివారం(మే26) ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఖర్గే మాట్లాడారు.
ప్రధాని తనను తాను తీస్‌మార్‌ఖాన్ అనుకొంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రజలే తీస్‌మార్‌ఖాన్‌లని గుర్తుంచుకోవాలన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలు ఏమీ మాట్లాడటానికి కూడా ఉండదన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రజలు వర్సెస్ మోదీయే తప్ప రాహుల్ వర్సెస్ మోదీ కానే కాదన్నారు.