
బీహార్‌లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్‌కలి సమీపంలో వేగంగా వస్తున్న వస్తున్న ఒక కారు..బైక్‌ను ఢీకొని, మరో లేన్‌లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం తొమ్మిదిమంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల్లో గాయకుడు ఛోటూ పాండే కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి మోహానియా డీఎస్పీ దిలీప్ కుమార్ మాట్టాడుతూ స్కార్పియో వాహనం ససారం నుంచి వారణాసి వైపు వెళుతున్నదని, ఆ వాహనంలో ఎనిమిదిమంది ఉన్నారని తెలిపారు. మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్ 2లోని దేవ్‌కలి సమీపంలో, ఆ కారు ఒక బైక్‌ను ఢీకొని, డివైడర్‌ను దాటి.. మరో లేన్‌లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్నదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment