stone quarry
-
తమిళనాడులో భారీ పేలుడు
చెన్నై: తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా, 12 మందికి గాయాలైనట్లు సమాచారం. విరుదునగర్ జిల్లా కారియాపట్టీలోని ఓ క్వారీలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.Tamil Nadu | At least three people died in an explosion that occurred in a stone quarry near the Kariapatti area of Virudhunagar district, this morning. Rescue operation is underway: Virudhunagar Fire and Rescue Department,— ANI (@ANI) May 1, 2024 -
రాళ్ల క్వారీలో కూలిన బతుకులు
ఐజ్వాల్: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో.. కడపటి వార్తలు అందేసరికి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాళ్ల కింద చిక్కుకున్న మరికొందరు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నయ్‌థియాల్ జిల్లాలోని మౌదర్హ్ అనే గ్రామంలో ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాళ్ల క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు జరుగుతున్నాయి. మృతులంతా బీహారీ కూలీలని అధికారులు ప్రకటించారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. సోమవారమే ఈ రాళ్ల క్వారీ కూలిపోయింది. కార్మికులు మధ్యాహ్న భోజన అనంతరం పనుల్లో మునిగిపోగా.. ఈ ప్రమాదం జరిగింది. కూలీలలో 12 మందితో పాటు హిటాచి డ్రైవర్లు క్వారీ లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వలంటీర్లు తరలివచ్చారు. రాష్ట్ర విపత్తు నివారణ బృందాలతో పాటు సరిహద్దు భద్రతా దళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆపరేషన్ చేపట్టాయి. -
రామస్వామిపేటపై క్రషర్ల పంజా..
శృంగవరపుకోట /వేపాడ విజయనగరం : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ క్రషర్ల యజమానులకు కొమ్ముకాస్తోంది. దీంతో ఆ ఊరి వాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు కూడా లభించడం లేదు. వేపాడ మండలంలోని రామస్వామిపేట పరిధిలో 8 క్రషర్లు, 14 క్వారీలు ఉన్నాయి. నిరంతరాయంగా జరుగుతున్న బ్లాస్టింగ్లు, స్టోన్ క్రషింగ్‌తో వాయు, శబ్ధ, జల కాలుష్యంతో గ్రామం వణుకుతోంది. గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న స్టోన్ క్రషర్లు, క్వారీల నుంచి వచ్చే దుమ్ముతో పచ్చని పొలాలు, చెట్లు తెల్లగా మారి రూపు కోల్పోతున్నాయి. పంట భూములు చవుడు నేలలుగా మారుతున్నాయి. జలాలు కాలుష్యం కావడంతో గ్రామస్తులు, పశువులు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. క్వారీల్లో జరుగుతున్న పేలుళ్లకు భవనాల గోడలు బీటలుదేరుతున్నాయి. గ్రామాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న క్రషర్లు, క్వారీలను మూయించాలని ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులు చేసిన ప్రజా ఉద్యమాలు పెట్టుబడివర్గాలు విసిరే కరెన్సీ నోట్ల మధ్య నిలబడలేకపోయాయి. బందలు స్వాహా.. స్టోన్ క్రషర్ల యజమానులు 52/1లో ఉన్న నక్కలబందను ఆక్రమించారు. ఇదే తీరుగా మెరకబంద, పొట్టేలు బంద, మంగలి బందల్ని ఆక్రమించి మాయం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో సాగునీటి వనరులు మాయమయ్యే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. నక్కల బంద ఆక్రమణపై వివరణ కోరగా తహసీల్దార్ డీవీ రమణ తన దృష్టికి సమస్య రాలేదంటూ బదులిచ్చారు. పొల్యూషన్ రిపోర్టు .. ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2017 జూలైలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేసింది. రెండు రోజుల తర్వాత అన్ని క్రషర్లు నిబంధనలు పాటిస్తున్నాయి.. గ్రీన్‌బెల్ట్ పెంచుతున్నారు... బోర్డు నిబంధనలు ఉల్లంఘించలేదు.. వర్షాల వల్ల గాలిలో దుమ్ము శాతాన్ని లెక్కకట్టలేక పోయాం.. గాలి కలుషితం ఐతే చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పి చేతులు దులిపేసుకుని నేటి వరకు తిరిగి చూడలేదు. స్వచ్ఛమైన గాలి కరువు రాయి బుగ్గితో తెల్లని ధూళి పడి పచ్చని పొలాలు పాడైపోతున్నాయి. గాలి ఎప్పుడు వీచినా దుమ్ము, ధూళి ఉంటోంది. కనీస అవసరాలైన గాలి, నీరు కూడా లేకుండా చేస్తున్నారు. – రొంగలి మధుసూదనరావు, గ్రామరైతు -
ప్రాణం తీసిన పేలుళ్లు
వీరఘట్టం: మండలంలోని నడిమి కెల్ల పంచాయతీ పరిధిలోని కడకెల్ల రాతి క్వారీలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జరిగిన భారీ బాంబు పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు కూలీల ఆచూకీ కానరావడం లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరితో పాటు ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఇక్కడ ఏం జరిగిందో నిర్వాహకులు స్పష్టంగా చెప్పకుండా దాచిపెడుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మృతుల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. విషయం తెలుసుకున్న వెంటనే పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద సమయంలో 20 మంది కూలీలు.. జిల్లాకు శివారులో ఉన్న కడకెల్ల పొలిమేరల్లో జి.ఎస్.ఆర్.స్టోన్‌క్రషర్‌కు అనుసంధానంగా రాతి క్వారీ ఉంది. ఇక్కడ ఆదివారం సాయంత్రం బాంబు బ్లాస్ట్ జరిగింది. రాతి కొండపై పెద్ద పెద్ద రాళ్లను పేల్చేందుకు కొండ రంధ్రాల్లో ప్రమాదకర మందుగుండి అమర్చి బ్లాస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా భారీ శబ్దం వచ్చిందని సమీపంలో ఉన్న వారు చెబుతున్నారు. ఈ సమయంలో సుమారు 20 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న జగ్గురోతు రామారావు(23) మృతి చెందాడు. భారీ రాళ్ల మధ్య ఈయన మృతదేహాన్ని గుర్తించారు.మరో ఇద్దరు కూలీలు కూడా రాళ్ల మధ్య ఇరుక్కున్నట్లు పలువురు చెబుతున్నారు. వీరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అనుమతి లేకుండానే.. స్టోన్ క్రషర్కు అనుమతులు ఉన్నాయే తప్ప సమీపంలో ఉన్న రాతి క్వారీలో పేలుళ్లు చేసేందుకు ఎటువంటి అనుమతులు లేవు. అయినప్పటికీ ప్రతి రోజూ ఇక్కడ ప్రమాదకర మందుగుండుతో బ్లాస్టులు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక రైతులు కలెక్టర్, అధికారులందరికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ నిండుప్రాణం బలైపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు వీరే... ఈ ప్రమాదంలో జగ్గురోతు రామారావు(23) మృతి చెందగా, జగ్గురోతు చంద్రరావు, జగ్గురోతు స్వామినాయుడు, మోపాడ సూరిబాబు, జగ్గురోతు అప్పలనాయుడు, ఆబోతుల పకీరునాయుడు, బ్లాస్టర్ శివ గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, ఆబోతులపేటకు చెందిన మృతుడు రామారావు తన అన్నదమ్ములు చంద్రరావు,స్వామినాయుడుతో కలసి ఏడాది నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. వీరితోపాటు పడిన వారంతా వలస కూలీలుగా ఉన్నారు. అంతా గోప్యం.. క్వారీలో ఆదివారం ఏం జరిగిందనే విషయాన్ని నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. విషయం తెలిసిన వెంటనే వీరఘట్టం ఎస్ఐ జి.అప్పారావు, సీఐ సూరినాయుడు, డిప్యూటీ తహసీల్దార్ సుందరరావు, ఆర్ఐ సన్యాసిరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చీకటిగా ఉండటంతో నిర్వాహకులు పూర్తిగా విద్యుత్ దీపాలను సంఘటనను దాచివేసే ప్రయత్నం చేశారు. బ్లాస్టు చేసే వ్యక్తికి కూడా ఎటువంటి అనుభవం లేదని పోలీసుల విచారణలో తేలింది. ఇంతలో పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి సంఘటన స్థలానికి వచ్చి నిర్వాహకులను ప్రశ్నించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలిసిన ఏకైక వ్యక్తి బ్లాస్టర్ శివ. పేలుడు జరిగిన వెంటనే ఈయన పరారవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆబోతులపేటలో విషాదం... క్వారీ పేలుల్లో మృతిచెందినట్లు భావిస్తున్న వ్యక్తి రామారావుది జి.సిగడాం మండలం ఆబోతులపేట. విషయం తెలిసిన వింటనే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు క్వారీ వద్దకు చేరకుని బోరున విలపించారు. ఈ నెల 16న తన కుమార్తె వెన్నెల పుట్టిన రోజు ఉంది. ఇంటికి వస్తానని చెప్పిన భర్త అంతలోనే మృతి చెందడంతో భార్య రూపావతి బోరున విలపించింది. దర్యాప్తు చేస్తాం.. ప్రస్తుతం క్వారీలో ప్రమాదకర బాంబులు అమర్చినట్లు తెలిసింది. బాంబు స్క్వాడ్ వచ్చి పరిశీలించిన తర్వాత దర్యాప్తు చేపట్టి నిజాలు బయటపెడతాం. తెల్లవారితేగాని మృతులు ఎంత మందో చెప్పలేం. నిర్వాహకుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నాం. – స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ -
చిన్నమ్మ శిబిరంలో కలవరం!
చెన్నై : ‘ న్యాయం జరగాల్సిందే...ఎవ్వరికీ భయపడను, పది రోజులు గడువు ఇస్తున్నా...లేదంటే శిబిరం మారతా...’ అని అన్నాడీఎంకే సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ హెచ్చరిక చిన్నమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. తమతో చేతులు కలపాలని పన్నీరు శిబిరం ఎమ్మెల్యేలు ఆయనకు ఆహ్వానాలు పలికే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే తాత్కాళిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరం చేతిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రభుత్వానికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలు జారుకుంటే చాలు ప్రభుత్వం కుప్పకూలినట్టే. ఈ సమయంలో తరచూ ఏదో ఒక ఎమ్మెల్యే చడీ చప్పుడు కాకుండా అధిష్టానానికి బెదిరింపులకు ఇవ్వడం, బుజ్జగింపుల సమయంలో తమ సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో కోయంబత్తూరు జిల్లా సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ బహిరంగంగా ఆదివారం బెదిరింపులు ఇవ్వడం చిన్నమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. ప్రమాదంతో బెదిరింపు : సూళూరు పచ్చపాళయంలో ఆనందకుమార్‌కు చెందిన క్వారీ ఉంది. ఇక్కడ శుక్రవారం జరిగిన ప్రమాదంలో పళనికి చెందిన బాలన్, శక్తి వేలన్ కార్మికులు గాయపడ్డారు. శనివారం వీరు ఆసుపత్రిలో మరణించారు. ఆ కుటుంబాలకు తలా రూ.మూడు లక్షలు ముట్టచెప్పి, సాధారణ ప్రమాదంగా మార్చేసి ఆ యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఈ సమాచారంతో ఎమ్మెల్యే కనకరాజ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆదివారం ఆ క్వారీ పరిసరాల్లో పరిశీలించారు. అక్కడి ప్రజలు ఈ క్వారీ రూపంలో ఎదుర్కొంటున్న కష్టాలను, వారి గోడును విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ క్వారీ రూపంలో తన నియోజకవర్గ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. ఇక, తానెవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని, సీఎం పళనిస్వామికి కూడా భయపడనని స్పష్టం చేశారు. క్వారీకి శాశ్వతంగా తాళం వేయడం, ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. పది రోజుల్లో న్యాయం జరగని పక్షంలో, ప్రజలు కోరుకునే శిబిరంలోకి చేరాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తాను వెనక్కు తగ్గనని, చిన్నమ్మ శిబిరంకు గుడ్‌బై చెప్పి మరో శిబిరంలోకి వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన ఆ ప్రకటన చేశారో లేదో ఆగమేఘాలపై మంత్రి ఉడుమలై కే రాధాకృష్ణన్ కనకరాజ్ ఇంటికి చేరుకుని బుజ్జగించారు. ఇందుకు ఏ మాత్రం ఆ ఎమ్మెల్యే తగ్గని దృష్ట్యా, నిరాశతో వెనుదిరిగారు. ఇక, తమ శిబిరం వైపు త్వరితగతిన వచ్చేయాలని మాజీ సీఎం పన్నీరు మద్దతు ఎమ్మెల్యే కనకరాజ్‌కు పిలుపునిచ్చే పనిలో పడ్డారు. ఇక, జయలలిత మేన కోడలు దీప పేరవైలో కీలక నేతగా ఉన్న తిరుచ్చికి చెందిన మాజీ ఎమ్మెల్యే సౌందరరాజన్ టాటా చెప్పేసి పన్నీరు శిబిరం వైపుగా వచ్చేశారు. వస్తూ వస్తూ, దీపకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పేరవై వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది. ఆయన దిష్టిబొమ్మల్ని దగ్ధం చేసే పనిలో దీప మద్దతు సేన నిమగ్నమైంది. -
క్వారీలో కార్మికుడి మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో క్వారీలో పనిచేసే ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. వెలగట్టూరు స్టోన్ క్వారీలో పనిచేస్తున్న ఎల్లయ్య(45) అనే కార్మికుడు రాళ్లకు కంప్రెషర్ ద్వారా రంధ్రాలు వేస్తుండగా జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలైన ఎల్లయ్యను కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఎల్లయ్య స్వస్థలం వెలగట్టూరు మండలం పైడిపల్లి గ్రామం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సేఫ్టీ బెల్ట్ ధరించకుండా పనులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెప్పుతున్నారు.