‘కేశోరాం’తో ప్రత్యక్ష పోరాటం | fight to keshoram management | Sakshi
Sakshi News home page

‘కేశోరాం’తో ప్రత్యక్ష పోరాటం

Published Fri, Aug 26 2016 6:41 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

fight to keshoram management

బసంత్‌నగర్‌ : రామగుండం మండలం బసంత్‌నగర్‌ కేశోరాం సిమెంట్‌ కర్మాగారం యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని, కార్మికుల సమస్యల సాధనకై కంపెనీతో ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతున్నామని కంపెనీ పర్మినెంట్‌ కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బసంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై డిమాండ్‌ నోటీస్‌ అందజేసి ఏడాది గడుస్తున్నా  ఒక్క సమస్యను యాజమాన్యం పరిష్కరించలేదన్నారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తమ ఆలోచనను యాజమాన్యం బేఖాతరు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. దీనిపై కార్మికులతో కలిసి సమైక్యంగా ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీల్లో యూనియన్‌ కార్యాలయాలు ఉన్నాయని, కేవలం ఒక్క కేశోరాంలోనే యూనియన్‌ కార్యాలయం లేదని, దీని నిర్మాణానికి యాజమాన్యం పూర్తిగా సహకరించడం లేదన్నారు. తాము స్వంత ఖర్చులతో యూనియన్‌ భవనాన్ని నిర్మించనున్నామని, దీనిలో భాగంగా భవన నిర్మాణానికి అనుమతి కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డికి దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు.  ఈసమావేశంలో కార్మిక సంఘం కార్యదర్శిలు ముల్కల కొంరయ్య, గద్వాల నగేష్‌లు పాల్గొన్నారు.    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement