manoharreddy
-
సమ్మర్ క్యాంప్ అబ్జర్వర్‌గా మనోహర్‌రెడ్డి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ల అబ్జర్వర్‌గా సీనియర్ క్రీడాకారుడు మనోహర్‌రెడ్డిని నియమించినట్లు డీఎస్డీఓ బాషామోహిద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరుగుతున్న 50 సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణ, కేంద్రాలకు అందిన మెటీరియల్ వివరాలు, కేంద్రాల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యల కోసమే ఆయన్ను నియమించామని చెప్పారు. కోచింగ్ క్యాంపులు కొనసాగేంత వరకు ఆయన అబ్జర్వర్‌గా వ్యవహరిస్తాడన్నారు. -
పాఠశాలల అభివృద్ధికి రూ.పది కోట్లు
ఓదెల: పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి రూ. పదికోట్లు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఓదెల మండలపరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రహరీ, టాయిలెట్లు, నీటి సదుపాయం, బెంచీలు వంటి మౌలిక సదుపాయలను అన్ని సర్కారు పాఠశాలల్లో కల్పించనున్నట్లు చెప్పారు. ఆర్వీఎం ద్వారా పాఠశాలలకు పక్కాభవనాలు నిర్మిస్తామన్నారు. గ్రామపంచాయతీ పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, మరికొన్నింటికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. చివరిభూములకు సాగునీరందించి రైతులను ఆదుకుంటామన్నారు. అనంతరం హరితమిత్రగా ఎంపికైన ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పొతుగంటి రాజు, సర్పంచ్‌లు మహేందర్, సంపత్‌కుమార్, మహేందర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, సాయిలు, ఎంపీటీసీలు శంకర్, చిన్నస్వామి, జలపతి, హన్మంతరావు, నాయకులు గట్టు శ్రీనివాస్, రాజిరెడ్డి, వెంకటరెడ్డి, రవికుమార్, వెంకటస్వామి, సాంబమూర్తి, ముక్తేశ్వర్, అధికారులు పాల్గొన్నారు. -
‘కేశోరాం’తో ప్రత్యక్ష పోరాటం
బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని, కార్మికుల సమస్యల సాధనకై కంపెనీతో ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతున్నామని కంపెనీ పర్మినెంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బసంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై డిమాండ్ నోటీస్ అందజేసి ఏడాది గడుస్తున్నా ఒక్క సమస్యను యాజమాన్యం పరిష్కరించలేదన్నారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తమ ఆలోచనను యాజమాన్యం బేఖాతరు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. దీనిపై కార్మికులతో కలిసి సమైక్యంగా ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీల్లో యూనియన్ కార్యాలయాలు ఉన్నాయని, కేవలం ఒక్క కేశోరాంలోనే యూనియన్ కార్యాలయం లేదని, దీని నిర్మాణానికి యాజమాన్యం పూర్తిగా సహకరించడం లేదన్నారు. తాము స్వంత ఖర్చులతో యూనియన్ భవనాన్ని నిర్మించనున్నామని, దీనిలో భాగంగా భవన నిర్మాణానికి అనుమతి కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డికి దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు. ఈసమావేశంలో కార్మిక సంఘం కార్యదర్శిలు ముల్కల కొంరయ్య, గద్వాల నగేష్‌లు పాల్గొన్నారు.