పాఠశాలల అభివృద్ధికి రూ.పది కోట్లు | 10 crose for shcools devolapment | Sakshi
Sakshi News home page

పాఠశాలల అభివృద్ధికి రూ.పది కోట్లు

Published Fri, Aug 26 2016 6:43 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

10 crose for shcools devolapment

ఓదెల: పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి రూ. పదికోట్లు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఓదెల మండలపరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రహరీ, టాయిలెట్లు, నీటి సదుపాయం, బెంచీలు వంటి మౌలిక సదుపాయలను అన్ని సర్కారు పాఠశాలల్లో కల్పించనున్నట్లు చెప్పారు. ఆర్‌వీఎం ద్వారా పాఠశాలలకు పక్కాభవనాలు నిర్మిస్తామన్నారు. గ్రామపంచాయతీ పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, మరికొన్నింటికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. చివరిభూములకు సాగునీరందించి రైతులను ఆదుకుంటామన్నారు. అనంతరం హరితమిత్రగా ఎంపికైన ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పొతుగంటి రాజు, సర్పంచ్‌లు మహేందర్, సంపత్‌కుమార్, మహేందర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, సాయిలు, ఎంపీటీసీలు శంకర్, చిన్నస్వామి, జలపతి, హన్మంతరావు, నాయకులు గట్టు శ్రీనివాస్, రాజిరెడ్డి, వెంకటరెడ్డి, రవికుమార్, వెంకటస్వామి, సాంబమూర్తి, ముక్తేశ్వర్, అధికారులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement