రంగంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి: మహాకూటమి ప్రజలకు మాయమాటలు చెబుతూ పక్కదారి పట్టిస్తుందని, అయినా మహా కూటమి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ, కాంగ్రెస్ పరిపాలనలోని తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనుకబాటు, రాజకీయంగా అణిచివేతకు గురైందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సాధించి రైతులు, యువకులు, విద్యార్థులు, వృద్ధులు, పెళ్లీడు ఆడపడుచులు, గర్భిణులు సమాజంలోని అన్ని వర్గాలను మెప్పించే పథకాలను కేసీఆర్ అమలు చేశారన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలోనూ ప్రతి ఇంటికి సర్కార్ సంక్షేమ పథకాలు అందించగలిగామన్నారు. గ్రామాలకు రోడ్లు వేయించామని, పెద్దపల్లి పట్టణంలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. పెద్దపల్లిని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో జిల్లాను ఏర్పాటు చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రెండోసారి పట్టం కట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కలిసి రావాలని గ్రామస్తులను కోరారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి తనను ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్, నాయకులు ఉప్పు రాజు, రాజ్‌కుమార్, అమ్రీష్, పెర్కరి రమేష్, దాసరి రమణారెడ్డి, ప్రభాకర్, రంగయ్య, సునీత, రాజేందర్, పూదరి మహేందర్, వాహిదా శ్రీనివాస్, అశోక్, వేల్పుల నర్సయ్య, తూముల నంబరావు, అక్బర్, రాజ్‌కుమార్, జబ్బర్ ఉన్నారు.
టీఆర్‌ఎస్‌లో పలువురికి చేరిక..
టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్, టీడీపీ నుంచి పలువురు చేరారు. పార్టీలో చేరిన పెర్క భారతి, అన్నపూర్ణ, రాజేశ్వరి, లక్ష్మీ, అరుణ, మల్లమ్మ, రుక్కమ్మ, స్వప్న, రాజమణమ్మ, అనసూయ, మమత, సుగుణ, స్వరూప, నిషాబేగం, సరిత, జయ, వజ్ర, రాధ, బుచ్చమ్మ, జరీనా, ఎండీ సమీర్, తాజ్, కలీల్, రషీద్‌లకు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ప్రతి ఇంట్లో వెలుగులు పంచుతా..
కారుగుర్తుకు ఓటేసి మరోసారి గెలిపిస్తే దీపావళి వెలుగులా ప్రతి ఇంట్లో వెలుగులు పంచుతానని దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు వెలుగులు పంచింది టీఆర్‌ఎస్ అని, పెద్దపల్లి శివారు రంగంపల్లిలో గురువారం రాత్రి ప్రచారంలో భాగంగా స్థానికులతో కలిసి బాణసంచా కాలుస్తూ తనను గెలిపించాలని అభ్యర్థించారు
Comments
Please login to add a commentAdd a comment