
పెద్దపల్లి: ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధిస్తే హ్యాట్రిక్‌గా చెప్పుకుంటాం. పెద్దపల్లిలో మాత్రం ఓ నేత 15 ఏళ్లుగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ నామినేషన్ వేసి విత్ డ్రా అవుతూ హ్యాట్రిక్ సాధించారు. ఆయనే కాంగ్స్ నేత, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేతి ధర్మయ్య. మొదటగా ధర్మయ్య 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీఆర్‌పీలో చేరి నామినేషన్ వేశారు. అనివార్య కారణాలతో ఉపసంహరించుకున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి నామినేషన్ వేశారు.
కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా భానుప్రసాద్‌రావుకు టికెట్ దక్కగా...ఆయన సూచన మేరకు మరోసారి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. పోటీకి సిద్ధమంటూ నామినేషన్ సమర్పించారు. చివరగా మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ రమణారావుల ఒత్తిడితో గురువారం నామినేషన్ ఉపసంహరించకున్నారు. ఇలా మూడుమార్లు నామినేషన్ వేయడం..ఉపసంహరించుకోవ డం ద్వారా ధర్మయ్య హ్యాట్రిక్ కొట్టారు.