
గుర్తుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు
సాక్షి,వైరా: ఎట్టకేలకు వైరాలో 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావటంతో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయేషా మస్రత్ ఖానం వైరా నియోజకవర్గంలో 13 మంది పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. వారిలో ఆరుగురు స్వతంత్రులు కాగా, మరో ఏడుగురు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి పోటీలో ఉన్నారు.
నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి మొత్తం 28 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. 18 సెట్లను పరిశీలించి ప్రకటించారు. వారిలో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 16 మంది బరిలో ఉన్నారు. చివరి రోజు మరో ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకొన్న వారిలో సీపీఐ రెబల్ అభ్యర్థి బాణోత్ లాల్ సింగ్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి లకావత్ గిరిబాబు, టీడీపీ రెబల్ అభ్యర్థి భూక్యా దేవీలాల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment