అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ల అబ్జర్వర్‌గా సీనియర్ క్రీడాకారుడు మనోహర్‌రెడ్డిని నియమించినట్లు డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరుగుతున్న 50 సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణ, కేంద్రాలకు అందిన మెటీరియల్ వివరాలు, కేంద్రాల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యల కోసమే ఆయన్ను నియమించామని చెప్పారు. కోచింగ్ క్యాంపులు కొనసాగేంత వరకు ఆయన అబ్జర్వర్‌గా వ్యవహరిస్తాడన్నారు.