జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు రాఘవేందర్‌ | raghavender selected to national powelifting competitions | Sakshi
Sakshi News home page

జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు రాఘవేందర్‌

Published Thu, Aug 11 2016 7:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు రాఘవేందర్‌ - Sakshi

జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు రాఘవేందర్‌

శంషాబాద్‌ రూరల్‌: సెప్టెంబరు 7న జంషెడ్‌పూర్‌లో జరుగనున్న ఆల్‌ ఇండియా సీనియర్‌ నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు గొల్లపల్లికి చెందిన రాఘవేందర్‌గౌడ్‌ ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్‌ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో రాఘవేందర్‌ గోల్డ్‌మెడల్‌తో పాటు ‘స్ట్రాంగ్‌మన్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌’లో విజేతగా నిలిచాడు. దీంతో అతడిని ఆల్‌ ఇండియా సీనియర్‌ నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక చేశారు. 105 కేజీల విభాగంలో పాల్గొన్న రాఘవేందర్‌ తన కేరీరీలోనే మొదటిసారి 890 కేజీలు ఎత్తి అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్భంగా రాఘవేందర్‌ మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న మైహోం ఎండీ.జగపతిరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement