రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి | Three killed in car accident at gollapalli in Anantapur District | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి

Published Wed, Sep 17 2014 11:37 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

Three killed in car accident at gollapalli in Anantapur District

అనంతపురం: అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద  మారుతీ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు.

 

మృతులు శ్రీహర్ష, కామేశ్వరరావు, సుమన్ గా పోలీసులు గుర్తించారు. శ్రీహర్ష కాకినాడ వాసి కాగా,మిగతా ఇద్దరు హైదరాబాద్ కు చెందినవారు. వీరంతా బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement